కౌషని ముఖర్జీ

బెంగాలీ సినిమా నటి, రాజకీయ నాయకురాలు

కౌషని ముఖర్జీ, బెంగాలీ సినిమా నటి, రాజకీయ నాయకురాలు.[1] 2015లో రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన పర్బోనా అమీ చార్టీ టోకీ అనే సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2]

కౌషని ముఖర్జీ
జననం
విద్యబి.కామ్ (హానర్స్), హేరంబ చంద్ర కళాశాల (కోల్‌కతా)
విద్యాసంస్థఅసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చి స్కూల్, కలకత్తా
హేరంబ చంద్ర కళాశాల, కోల్‌కతా
వృత్తిమోడల్, నటి, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
రాజకీయ పార్టీతృణమూల్ కాంగ్రెస్
భాగస్వామిబోనీ సేన్‌గుప్తా
తల్లిదండ్రులుసయన్ దాస్, సంగీతా ముఖర్జీ
బంధువులుసుమన్ ముఖర్జీ
పురస్కారాలుకోల్‌కతా సుందరి

జననం, విద్య మార్చు

కౌషని, సయన్ దాస్ - సంగీతా ముఖర్జీ దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. కలకత్తాలోని అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చి స్కూల్ నుండి ప్రాథమిక విద్యను, హేరంబ చంద్ర కళాశాల నుండి బి.కామ్ (హానర్స్) పూర్తిచేసింది.

వ్యక్తిగత జీవితం మార్చు

కౌషనికి బోనీ సేన్‌గుప్తాతో వివాహం జరిగింది.

వృత్తిరంగం మార్చు

కైషని ముఖర్జీ 2015లో మిస్ బ్యూటీ ఆఫ్ కోల్‌కతాగా గెలుపొందింది.[3] 2015లో వచ్చిన పర్బోనా అమీ చార్టే టోకీ సినిమాలో తొలిసారిగా నటించింది.[4] 2016లో రాజా చందా దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా కేలోర్ కీర్తిలో నటించింది.[5][6] ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్‌తో ప్రేమలోపడే సంపన్న యువతి అనుష్కగా నటించింది.[7]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర దర్శకుడు ఇతర వివరాలు
2015 పర్బోనా అమీ చార్టీ టోకీ అపర్ణా రాయ్/అపు రాజ్ చక్రవర్తి
2016 కేలోర్ కీర్తి అనుష్క రాజా చందా
2017 తోమాకే చాయ్ దియా రాజీవ్ కుమార్ బిస్వాస్
జియో పాగ్లా మోనాలిసా రవి కినాగి
2018 హోయిచోయ్ అన్‌లిమిటెడ్ అనిందితా అనికేత్ చటోపాధ్యాయ
గర్ల్ ఫెండ్ సుచిత్ర రాజా చందా
2019 జమై బాదల్ బార్షా రవి కినాగి
బచ్చా షోషూర్ జోనకి బిస్వరూప్ బిస్వాస్
జాన్‌బాజ్ పోలీసు అధికారి అనూప్ సేన్‌గుప్తా
2020 బైయే. కాం శ్రేయ అభిజిత్ గుహ, సుధేష్నా రాయ్ జీ5 ప్రీమియం
2021 తుమీ అష్బే బోలే ఆంఖి సుజిత్ మోండల్
ఫిరే దేఖా జీ5 ప్రీమియం

రాజకీయరంగం మార్చు

కౌషని 2021 జనవరి 24న పియా సేన్‌గుప్తాతో కలిసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరింది. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేయబడింది. 2021 జూలై 11న తిరిగి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ముకుల్ రాయ్ చేతిలో 35,089 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

మూలాలు మార్చు

  1. "Koushani Mukherjee: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2022-04-04.
  2. "Rom-com Parbona Ami Charte Toke releases today! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-04.
  3. "The glitter girls". The Telegraph. 19 February 2015. Archived from the original on 2 January 2016. Retrieved 2022-04-04.
  4. "Love Stories Ideal Launchpad for Newcomers: Raj Chakraborty". Hundustan Times. 23 September 2015. Archived from the original on 2017-07-31. Retrieved 2022-04-04 – via HighBeam Research.
  5. Buzarbaruah, Upam (14 July 2016). "Kelor Kirti Movie Review". The Times of India. Retrieved 2022-04-04.
  6. "Shocking: Did Ankush and Koushani secretly get married? - Times of India". The Times of India. Retrieved 2022-04-04.
  7. Ganguly, Ruman (12 January 2017). "Kelor Kirti is an hilarious tale of seven youngsters – Times of India". The Times of India. Retrieved 2022-04-04.

బయటి లింకులు మార్చు