క్రష్
క్రష్ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[2] ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రవి బాబు నిర్మతగా దర్శకత్వం వహించిన ఈ సినిమా 09 జులై 2021న జీ5 ఓటీటీలో విడుదలైంది.[3] అభయ్ సింహ, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పెర్రీ పాండే, శ్రీ సుధా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
క్రష్ | |
---|---|
దర్శకత్వం | రవిబాబు |
రచన | రవిబాబు |
నిర్మాత | రవిబాబు |
తారాగణం | అభయ్ సింహ, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి |
ఛాయాగ్రహణం | ఎన్.సుధాకర్ రెడ్డి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | వైద్ధే |
నిర్మాణ సంస్థ | ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 09 జులై 2021 [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురవి (అభయ్ సింహా), తేజు (కృష్ణ బూరుగుల), వంశీ (చరణ్ సాయి) బాల్య స్నేహితులు. వారు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సన్నద్ధమవుతుంటారు. తమ కంటే సీనియర్ అయిన మిత్రుడు అమెరికా వెళ్లి సెలవులకు వస్తే ఆ సెలవుల్లో వచ్చి ఇచ్చిన ఒక ఐడియా వీరి జీవితాలను ఎలా మలుపు తిప్పింది?? ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన తప్పులు, ఆ తప్పుల నుంచి వారు నేర్చుకున్న జీవిత సత్యాలు ఏమిటి? అనేదే ఈ సినిమా మిగతా కథ.
నటీనటులు
మార్చు- అభయ్ సింహ - రవి
- కృష్ణ బూరుగుల - తేజు
- చరణ్ సాయి - వంశీ
- అంకిత మనోజ్
- పెర్రీ పాండే
- శ్రీ సుధా రెడ్డి
- రామ్ రవిపల్లి
- ప్రియదర్శిని
- చైతన్య
- అరుణ శ్రీ
- పాలేపు నాగసాయాన్
- మాధవి
- కార్తిక్ జైరాం
- ప్రభావతి
- బ్యాంక్ శ్రీనివాస్
- జ్యోతి
- మాస్టర్ రాకేశ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్ : ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్
- నిర్మాత & దర్శకత్వం: రవి బాబు
- సినిమాటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి
- సంగీతం: వైద్ధే
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
- స్క్రీన్ ప్లే: సత్యానంద్
- డైలాగ్స్: నివాస్
- పాటలు: భాస్కరభట్ల
- ఆర్ట్ డైరెక్టర్: నారాయణ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ Andrajyothy (1 July 2021). "ఓటీటీలో రవిబాబు". Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.
- ↑ News18 Telugu (8 June 2020). "అదుగో, ఆవిరి తర్వాత 'క్రష్' మూవీతో వస్తోన్న రవిబాబు." Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prabha News (30 June 2021). "రవిబాబు కొత్త సినిమా 'క్రష్'.. జూలై 9న ఓటీటీలో విడుదల". Prabha News. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.