క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ (సీసీహెచ్‌ఎఫ్)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కాంగొర్ ఫీవర్ (సీసీహెచెఫ్) అనేది ఒక జూనోటిక్ డిసీజ్. ఇది సీసీహెచెఫ్ వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వైరస్ అర్గాసిడ్ టిక్స్ అనే పురుగుల వంటి జీవుల ద్వారా సోకుతుంది. క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF) అనేది కుటుంబంలో ని టిక్-బోర్న్ వైరస్ (నైరోవైరస్) తో సంక్రమణ వలన వస్తుంది. ఈ వ్యాధి క్రిమియాలో 1944లో మొదటిసారిగా గుర్తించబడింది.[1] క్రిమియన్ హెమరేజిక్ జ్వరం అనే పేరుఇవ్వబడింది. తరువాత 1969లో కాంగోలో అనారోగ్యానికి కారణం అని గుర్తించబడింది, దీని ఫలితంగా వ్యాధి ప్రస్తుత పేరు ఏర్పడింది. ఇది ఒక వైరల్ అంటు వ్యాధి. జ్వరం , కండరాల నొప్పి , తలనొప్పి , వాంతులు, విరేచనాలు, స్కిన్ పెటెసియా వంటి వ్యాధి లక్షణాలు ఉన్నాయి . ఇవి సాధారణంగా వ్యాధికారకానికి గురైన రెండు వారాలలో అభివృద్ధి చెందుతాయి, కాలేయ వైఫల్యం వంటి సమస్యలను కలిగిస్తాయి.ఈ వైరస్ హెమరేజిక్ ఫీవర్ ని కలుగచేస్తుంది. పేషెంట్స్ జ్వరం, రాష్, బ్లీడింగ్ తో బాదపడతారు.అయితే ఈ వైరస్ సోకినవారిలో చాలా మంది ప్రాణాపాయం నుండి బైటపడతారు. ఒక ముప్ఫై శాతం మందికి మాత్రం మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ జరిగి ప్రాణాలు విడుస్తారు.[2] ఈ పేనుజాతి కీటకం కుడితే మనుషులు, పశువులకు కాంగో ఫీవర్ వస్తుంది. అనంతరం ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతుంది. అయితే అది సోకిన జంతువుల రక్తాన్ని తాకినప్పుడు, వాటి మాంసాన్ని తిన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్ సంక్రమించే అవకాశాలు ఉంటాయి. తూర్పు, పశ్చిమ ఆఫ్రికాలో ఈ వ్యాధి సర్వసాధారణం .ఇది 30% మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది, ప్రస్తుతం ఈ వ్యాధికి వాణిజ్య వ్యాక్సిన్ లేదు, ప్రధాన నివారణకు మార్గం అర్గాసిడ్ టిక్స్ కాటును నివారించడం. జంతువులతో దగ్గర కాంటాక్ట్ లో ఉండేవారు ఈ వ్యాధికి సంబంధించి హై-రిస్క్ క్యాటగిరీలో ఉంటారు.
వ్యాధి కారణాలు
మార్చుఆసియా, తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యం, మధ్య ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, మడగాస్కర్, ఇతర ప్రదేశాలలో ఈ వ్యాధికారకం కనిపిస్తుంది. పశువులనీ, కొన్ని జంతువులనీ ఆశ్రయించుకుని బతికే అర్గాసిడ్ టిక్స్ జీవులు కుట్టడం ద్వారా ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. ఇవి పశువులు, ఆస్ట్రిచ్, చెవుల పిల్లి వంటి వాటిని ఆశ్రయించుకుని బతుకుతాయి. ఇవి మనుషుల్ని కుట్టినా లేదా ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన జంతువుల రక్తం, లేదా స్రావాలు, టిష్యూ తో మనుషులు కాంటాక్ట్ లోకి వచ్చినా వారికి ఈ వ్యాధి సోకుతుంది.[3] ఈ పేనుజాతి కీటకం రక్త-మాంసం సంపర్కం ద్వారా మానవుడి నుండి మానవునికి కూడా వ్యాప్తి చెందుతాయి. అర్గాసిడ్ 7 జన్యువులలో 31 రకాల పేలులలో ఈ వైరస్ కనుగొనబడింది. Hyalomma truncatum, Amblioma varigate(అంబ్లియోమ్మా వరిగటే) రెండు రకాల పేలులు ప్రధాన వ్యాధి కారకాన్ని కలిగి ఉంటాయి. (వెక్టర్స్). ఇవి తరాల ద్వారా ( ట్రాన్స్-వేరియన్ ట్రాన్స్మిషన్ ) వైరస్లను ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. 4 జతల కాళ్లతో ఉన్న ఈ పేలు అన్ని దేశీయ జంతువులలో, వన్యప్రాణులలో సాధారణం కాబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీనివలన శరీరంలో అధిక జ్వరం తీవ్రమైన అంతర్గత రక్తస్రావం ఉంటుంది. ఈ పేను కుట్టిన తరువాత ఒకటి నుండి తొమ్మిది రోజుల లోగా లక్షణాలు కనిపిస్తాయి. యానిమల్ బ్లడ్, టిష్యూ కి ఎక్స్పోజ్ అయిన ఐదు నుండీ పదమూడు రోజుల లోగా లక్షణాలు కనిపిస్తాయి. CCHF ప్రారంభం అకస్మాత్తుగా ఉంటుంది, తలనొప్పి, అధిక జ్వరం, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, కడుపు నొప్పి వాంతులు వంటి ప్రాథమిక సంకేతాలు, లక్షణాలు ఉంటాయి. ఎర్రగా ఉండే కళ్లు, ముఖం ఎర్రబారడం, గొంతు ఎర్రబారడం, అంగిలిపై ఎర్రటి మచ్చలు సర్వసాధారణం. కామెర్లు,, తీవ్రమైన సందర్భాల్లో, మూడ్ ఇంద్రియ గ్రహణాల్లో మార్పులు కూడా లక్షణాలుగా ఉండవచ్చు.
చరిత్ర
మార్చురష్యా శాస్త్రవేత్తలు 1944లో క్రిమియాలో ఈ వ్యాధిని కనుగొన్నారు. 200 మందికి పైగా సైనికులు బారిన పడ్డారు. 1969 లో కాంగోలో చాలామంది ఈ వ్యాధి బారిన పడ్డారు . 2002, 2008 మధ్య టర్కీలో 3128 మందికి వ్యాధి సోకింది. 2010లో కొసావోలో 70 కేసులు, 4 మరణాలు సంభవించాయి. సెప్టెంబర్ 2010లో, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఒక అంటువ్యాధి సంభవించింది. 2011 జనవరిలో గుజరాత్‌లో భారతదేశంలో తొలిసారిగా 3 మరణాలు సంభవించాయి. భారతదేశం గుజరాత్ లోని వల్సాద్ జిల్లాల్లో 2020 సెప్టెంబర్ లో కాంగో జ్వరాలు వ్యాపిస్తున్నాయి.[4]
రోగ నిర్ధారణ
మార్చుELISA (ELISA), EIA, వైరస్ అనిరిబాటి (EIA) రక్తంలో వ్యాధి కనుగొనబడిందో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు. వీటివలన రక్తంలో ప్రతిరోధకాలు కనుగొనబడతాయి. రోగి రక్తం లేదా కండరాల నమూనాను పరీక్షించడం ద్వారా వైరస్ను కనుగొనవచ్చు. పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) తాజా విశ్లేషణ పద్ధతి , ఈ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ (సీసీహెచ్‌ఎఫ్) నివారణకు నిర్దిష్ట వైద్య పద్ధతులు కనుగొనబడలేదు. వ్యాధి ప్రభావాలకు చికిత్స జరుగుతుంది.
ఇరాక్ లో మరణాలు
మార్చుప్రాణాంతక కాంగో ఫీవర్ ఇరాక్ దేశంలో ఇటీవల భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 2022 మే నెలాఖరు వరకు 19 మంది కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.[5]
మూలాలు
మార్చు- ↑ "Crimean-Congo Hemorrhagic Fever (CCHF) | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-27. Retrieved 2020-09-30.
- ↑ "Congo Virus: కాంగో ఫీవర్ ఎవరికీ వస్తుంది.. ఎందుకొస్తుంది.. వ్యాక్సిన్ కూడా లేదట." Samayam Telugu. Retrieved 2020-09-30.
- ↑ "కాంగో ఫీవర్ ఎవరికీ వస్తుంది.. ఎందుకొస్తుంది.. కరోనా కంటే డేంజరా." www.msn.com. Retrieved 2020-09-30.
- ↑ "ఇక కరోనా రెండోదశ!". www.andhrajyothy.com. Retrieved 2020-09-30.
- ↑ "Congo Fever: ఇరాక్‌ను వణికిస్తోన్న ప్రాణాంతక కాంగో ఫీవర్". web.archive.org. 2022-05-30. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)