క్రిస్టోఫర్ బ్లెయిర్ గఫానీ (జననం 1975 నవంబరు 30) ఒటాగో తరపున ఆడిన న్యూజిలాండ్ మాజీ క్రికెటరు, కుడిచేతి వాటం బ్యాటరు. అతను 83 ఫస్ట్-క్లాస్, 113 లిస్టు A మ్యాచ్‌లలో ఆడాడు. ప్రస్తుతం అతను అంతర్జాతీయ అంపైర్‌గా పనిచేస్తున్నాడు. గఫానీ ప్రస్తుతం ఐసిసి ఎలైట్ అంపైర్ ప్యానెల్‌లో సభ్యుడు. టెస్టులు, వన్ డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో అఫీషియల్‌గా ఉన్నాడు.

క్రిస్ గఫానీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్రిస్టొఫర్ బ్లెయిర్ గఫానీ
పుట్టిన తేదీ (1975-11-30) 1975 నవంబరు 30 (వయసు 49)
డునెడిన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటరు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–2006/07ఒటాగో
తొలి ఫక్లా17 January 1996 Otago - ఆక్లండ్
చివరి ఫక్లా20 March 2005 Otago - వెల్లింగ్టన్
తొలి లిఎ26 November 1995 Otago - Wellington
Last లిఎ10 February 2007 Otago - Auckland
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు49 (2014–2023)
అంపైరింగు చేసిన వన్‌డేలు77 (2010–2022)
అంపైరింగు చేసిన టి20Is43 (2010–2022)
అంపైరింగు చేసిన మవన్‌డేలు3 (2008)
అంపైరింగు చేసిన మటి20Is5 (2010–2016)
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 83 113
చేసిన పరుగులు 4,711 2,411
బ్యాటింగు సగటు 33.41 23.63
100లు/50లు 8/24 1/11
అత్యధిక స్కోరు 194 101*
వేసిన బంతులు 102 36
వికెట్లు 2 1
బౌలింగు సగటు 23.50 36.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/3 1/4
క్యాచ్‌లు/స్టంపింగులు 73/– 33/–
మూలం: Cricinfo, 7 June 2023

అంపైరింగ్ కెరీర్

మార్చు

2010 సెప్టెంబరులో టొరంటోలో కెనడా, ఐర్లాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గాఫానీ తన వన్‌డే అంపైరింగు మొదలు పెట్టాడు. ఐసిసి అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో అంపైర్‌గా పనిచేశాడు. 2014 ఆగస్టులో హరారేలో జింబాబ్వే, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌తో తన టెస్టు మ్యాచ్‌ అంపైరింగు మొదలుపెట్టాడు.

ఆ తర్వాత 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో నిలిచిన ఇరవై మంది అంపైర్‌లలో ఒకరిగా గఫానీ ఎంపికయ్యాడు. టోర్నమెంటు సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా మూడు మ్యాచ్‌లలో నిలిచాడు. [1] కొన్ని నెలల తర్వాత అతను తన అనేక స్థిరమైన ప్రదర్శనల ఫలితంగా 2015-16 కొరకు ఐసిసి ఎలైట్ అంపైర్ ప్యానెల్‌కు ఎలివేటయ్యాడు. [2]


2019 ఏప్రిల్‌లో అతను, 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో నిలిచిన పదహారు అంపైర్‌లలో ఒకడిగా స్థానం పొందాడు. [3] [4]

2020 సెప్టెంబరులో, అతను 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్‌లలో పనిచేసిన పదిహేను మంది అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. ఫైనల్‌లో కూడా నిలిచాడు.

మూలాలు

మార్చు
  1. "ICC announces match officials for ICC Cricket World Cup 2015". ICC Cricket. 2 December 2014. Archived from the original on 30 March 2015. Retrieved 12 February 2015.
  2. "S Ravi and Chris Gaffaney in Elite Panel". ESPNCricinfo. Retrieved 6 June 2015.
  3. "Match officials for ICC Men's Cricket World Cup 2019 announced". International Cricket Council. Retrieved 26 April 2019.
  4. "Umpire Ian Gould to retire after World Cup". ESPN Cricinfo. Retrieved 26 April 2019.