క్రిస్ సిల్వర్‌వుడ్
క్రిస్టొఫర్ ఎరిక్ విల్ఫ్రెడ్ సిల్వర్‌వుడ్ (జననం 5 మార్చి 1975) మాజీ అంతర్జాతీయ క్రికెటరు, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్. గతంలో అతను ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేసాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్రిస్టొఫర్ ఎరిక్ విల్ఫ్రెడ్ సిల్వర్‌వుడ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పోటెఫ్రాక్ట్, యార్క్‌షైర్, ఇంగ్లాండ్ | 1975 మార్చి 5|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | స్పూన్స్, స్పూన్స్, సిల్వర్స్, చబ్బీ | |||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 1 అం. (1.85 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 583) | 1996 డిసెంబరు 18 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2002 నవంబరు 29 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 144) | 1996 డిసెంబరు 15 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2001 అక్టోబరు 13 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1993–2006 | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||
2006–2009 | మిడిల్‌సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2009 | Mashonaland Eagles | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 జనవరి 1 |
తొలినాళ్ళ జీవితం, దేశీయ కెరీర్
మార్చువెస్ట్ యార్క్‌షైర్‌లోని పాంటెఫ్రాక్ట్‌లో జన్మించిన సిల్వర్‌వుడ్, గార్ఫోర్త్ కాంప్రహెన్సివ్ స్కూల్‌లో చదువుకున్నాడు, కుడిచేతి ఫాస్ట్ బౌలర్‌గా [1] 1993 లో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున రంగప్రవేశం చేశాడు. అతను తన స్థానిక కౌంటీ కోసం పదమూడు సంవత్సరాలు ఆడాడు.[1] 1990ల చివరిలో కౌంటీ ఉత్పత్తి చేసిన ఫాస్ట్ బౌలర్లలో అతనొకడు. క్లబ్‌తో అతను 2001లో కౌంటీ ఛాంపియన్‌షిప్, 2002లో C&G ( ఫ్రెండ్స్ ప్రావిడెంట్ ట్రోఫీ ) గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ బౌలింగ్ కోచ్ బాబ్ కాట్టమ్, అతను అలన్ డొనాల్డ్ కంటే వేగవంతమైనవాడని చెప్పాడు. అతను చక్కటి అవుట్‌స్వింగర్ వేస్తాడని, పరిస్థితులు అనుకూలించినప్పుడు పదునైన బౌన్సరు కూడా వేయగలడనీ అన్నాడు. సిల్వర్‌వుడ్, అలుపు లేని సత్తువకు కూడా ప్రసిద్ది చెందాడు. రోజులో చివర్లో వచ్చి, అదే వేగాన్ని కొనసాగించగల సామర్థ్యానికి అతను ప్రసిద్ది చెందాడు.
అతను 2005 సీజన్‌లో యార్క్‌షైర్‌కు ఆరు ఆటలు మాత్రమే ఆడిన తర్వాత, వరుస గాయాలతో పరస్పర అంగీకారంతో అక్కడి నుండి నిష్క్రమించాడు. 2006 సీజన్‌లో మిడిల్‌సెక్స్‌కు సంతకం చేశాడు.[1] మిడిల్‌సెక్స్‌తో మొదటి సీజన్‌లో 63 ఫస్ట్-క్లాస్ వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తర్వాత గాయాలతో ఇబ్బంది పడి, 2009లో ఆ క్లబ్‌ను విడిచిపెట్టాడు [2]
2009లో అతను హరారే లోని ఫ్రాంచైజీ మషోనాలాండ్ ఈగల్స్‌తో ప్లేయరుగా, కోచ్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మాటాబెలెలాండ్ టస్కర్స్‌తో మ్యాచ్‌లో రంగప్రవేశం చేశాడు.[3] [4]
అతని కెరీర్ ముగిసే సమయానికి సిల్వర్‌వుడ్, 184 మ్యాచ్‌లలో 27.41 సగటుతో 577 ఫస్ట్-క్లాస్ వికెట్లు తీశాడు. 93 పరుగులకు 7 వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన. లిస్ట్ A లో 25.05 సగటుతో 259 వికెట్లు తీసుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన 28కి 5. [2] సాధారణంగా టెయిల్-ఎండ్ బ్యాట్స్‌మన్ అయిన అతను అప్పుడప్పుడు వన్‌డే ఆటలలో పించ్ హిట్టర్‌గా ఉపయోగపడేవాడు.
సిల్వర్‌వుడ్ 1996లో NBC డెనిస్ కాంప్టన్ అవార్డును గెలుచుకున్నాడు.
అంతర్జాతీయంగా
మార్చుసిల్వర్వుడ్ 1996-97లో జింబాబ్వే, న్యూజిలాండ్‌లలో పర్యటించే ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబరు 15న జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్లో అతను అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు. జింబాబ్వే రెండు వికెట్ల తేడాతో గెలిచింది. [5] సిల్వర్‌వుడ్ మొదటి టెస్ట్‌లో టెస్ట్ రంగప్రవేశం చేసాడు. ఈ మ్యాచ్ చివరిలో ఇంగ్లండ్ స్కోర్‌ల స్థాయితో డ్రా చేసుకుంది. [6] అతను నాలుగు వికెట్లు తీశాడు, కానీ రెండవ టెస్టుకు ఎంపిక కాలేదు. అయితే, జింబాబ్వేతో జరిగిన మిగిలిన వన్‌డేలు అలాగే న్యూజిలాండ్ పర్యటనలో చివరి రెండు వన్‌డేలలో ఆడాడు. 1997 మేలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్‌డే, అతను స్వదేశంలో ఆడిన ఏకైక మ్యాచ్.
అతను మళ్ళీ 1999 వరకు అంతర్జాతీయ ఆట ఆడలేదు. 1999-2000 దక్షిణాఫ్రికా పర్యటనలో నాలుగు టెస్టులు ఆడాడు. బంతిని స్వింగు చెయ్యడానికి ఇబ్బంది పడ్డాడు.[2] 50 కంటే తక్కువ సగటుతో 7 వికెట్లు పడగొట్టాడు.
అతను ఆస్ట్రేలియాలో 2002-03 యాషెస్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. మొత్తం ఆరు టెస్టులు, ఏడు వన్‌డేలతో తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాడు.
కోచింగ్ కెరీర్
మార్చుఎసెక్స్
మార్చు2010లో, సిల్వర్‌వుడ్ ఎసెక్స్‌లో బౌలింగ్ కోచ్‌గా చేరి, [7] 2016 సీజన్‌కు ముందు ప్రధాన కోచ్ స్థానానికి పదోన్నతి పొందాడు. [8] అతని మొదటి సంవత్సరంలో ఎసెక్స్, కౌంటీ ఛాంపియన్‌షిప్ మొదటి విభాగానికి పదోన్నతి పొందింది. ఆ తర్వాత 2017 పోటీలో విజయం సాధించింది.
ఇంగ్లాండ్
మార్చుసిల్వర్వుడ్ 2018 జనవరిలో ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ కోచింగ్ టీమ్‌లో చేరాడు.[9] 2019 సీజన్ ముగింపులో ట్రెవర్ బేలిస్ నిష్క్రమణ తర్వాత, అతను 2019 అక్టోబరు 7 న కొత్త ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. [10] [11] 2021 ఏప్రిల్లో సెలెక్టర్ల అధిపతిగా నియమితుడయ్యాడు. దాంతో ఆ రెండు పాత్రలూ నిర్వహించాడు.[12] 2021–22 యాషెస్ సిరీస్‌లో సిల్వర్‌వుడ్, పేలవమైన నిర్ణయాలకు గాను విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ నిర్ణయాల్లో ముఖ్యమైనవి - మొదటి టెస్టులో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లను తప్పించడం, రెండో టెస్టులో జాక్ లీచ్‌ని ఎంపిక చేయకపోవడం. [13] యాషెస్‌ను 0-4 తో కోల్పోయాక, అతను ఆ పాత్ర నుండి తప్పుకుంటున్నట్లు 2022 ఫిబ్రవరి 3 న ప్రకటించబడింది. [14]
శ్రీలంక
మార్చు2022 ఏప్రిల్‌లో, అతను శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు 2 సంవత్సరాల పాటు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [15]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Warner, David (2011). The Yorkshire County Cricket Club: 2011 Yearbook (113th ed.). Ilkley, Yorkshire: Great Northern Books. p. 378. ISBN 978-1-905080-85-4.
- ↑ 2.0 2.1 2.2 "Chris Silverwood". Cricinfo. Retrieved 7 October 2019.
- ↑ Silverwood makes his Zimbabwe domestic debut
- ↑ "Zimcricket.org". Archived from the original on 10 January 2018. Retrieved 23 January 2010.
- ↑ "Zimbabwe v England 1996-97". Cricinfo. Retrieved 7 October 2019.
- ↑ "ZIMBABWE v ENGLAND". Cricinfo. Retrieved 7 October 2019.
- ↑ "Essex name Chris Silverwood as bowling coach". Cricinfo. Retrieved 26 February 2016.
- ↑ "Silverwood named as new Essex coach". Cricinfo. Retrieved 26 February 2016.
- ↑ Martin, Exclusive by Ali (31 October 2017). "Chris Silverwood accepts role as England's fast-bowling coach". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 7 October 2019.
- ↑ "Chris Silverwood announced as England Men's Head Coach". ECB. 7 October 2019.
- ↑ ESPN Cricinfo staff (7 October 2019). "England appoint Chris Silverwood as men's head coach". ESPN Cricinfo. Retrieved 7 October 2019.
- ↑ "ECB confirms restructure to selection of England Men's senior teams". English Cricket Board (in ఇంగ్లీష్). Retrieved 4 February 2022.
- ↑ "The Ashes: Time's up for Chris Silverwood – is coach Eoin Morgan the answer?". The Times. 20 December 2021. Retrieved 22 December 2021.
- ↑ "Coach Silverwood leaves England role". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 4 February 2022.
- ↑ "Chris Silverwood named Sri Lanka's new head coach". ESPN Cricinfo. Retrieved 9 April 2022.