క్రీనీడలు (నాటకం)


క్రీనీడలు కె.ఎల్. నరసింహారావు 1956లో రాసిన సాంఘీక నాటకం.[1][2] స్త్రీలు నాటకాల్లో నటించాలా, వద్దా అన్న నేపథ్యంలో సాగిన ఈ నాటకం ప్రదర్శించిన ప్రతిచోటా ప్రేక్షకులను ఆకట్టుకుంది.[3]

క్రీనీడలు
Kreeneedalu Book Cover Page.jpg
క్రీనీడలు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కె.ఎల్. నరసింహారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: ఆంధ్ర బుక్ హౌజ్ (హైదరాబాదు)
విడుదల: 1957
పేజీలు: 96

కథానేపథ్యంసవరించు

నాటకం వెయ్యాలనే సంకల్పంతో ప్రారంభమై, నాటక ప్రదర్శన గురించి పాత్రలు చర్చించడం, చివరికి నాటకం వెయ్యాలనే నిర్ధారణతో ఈ నాటకం ముగుస్తుంది.[4]

పాత్రలుసవరించు

 • వాసు
 • డాక్టర్
 • సీతాపతి
 • శీను
 • సరళ
 • రాధ

ప్రదర్శనలుసవరించు

 1. 1956, నవంబరు 10వ తేదీన సికింద్రాబాదు సెంట్రల్ రైల్వే ఇన్సిట్యూట్‌లో సాంస్కృతిక విభాగాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా రైల్వే ఉద్యోగులచే తొలి ప్రదర్శన జరిగింది. ఇందులో డి. రాజేశ్వరరావు (వాసు), చలపతి (డాక్టర్), ఎ.వి. శేషారావు (సీతాపతి), పి. సుబ్బారావు (శీను), రాజేశ్వరి (సరళ), ఝాన్సీ (రాధ) పాత్రలు పోషించారు.
 2. 1956, డిసెంబరు 2వ తేదీన హైదరాబాదు లోని ఇన్సిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ భవనంలో రెండవ ప్రదర్శన జరిగింది.[5] ఇందులో డి. రాజేశ్వరరావు (వాసు), కె.ఎల్. నరసింహారావు (డాక్టర్), అజ్ఞాతుడు (సీతాపతి), పి. సుబ్బారావు (శీను), రమాదేవి (సరళ), రత్నప్రసాద్ (రాధ) పాత్రలు పోషించారు.
 3. 1957, ఫిబ్రవరి 20న ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రంలో 30 నిమిషాలు నాటిగా ప్రసారమయింది. ఇందులో మంత్రి శ్రీనివాసరావు (వాసు), జి. సత్యనారాయణ (డాక్టర్), డి. కోటయ్య (సీతాపతి), పి. సుబ్బారావు (శీను), ఎస్. నర్మదాదేవి (సరళ), యం. సత్యవతి (రాధ) పాత్రలు పోషించారు.
 • వీణ, గానం: పాలగుమ్మి విశ్వనాథం
 • గానం: పాలగుమ్మి సుమతి
 • వయొలిన్: ఆంథోనీ మాథ్యూస్
 • వేణువు: టి. పార్థసారథి

ఇతర వివరాలుసవరించు

 1. సంఘటనలు మీదకాకుండా మనస్తత్వ పరిశీలనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ రాయబడడంవల్ల సంఘటనలు తక్కువగానూ, సంభాషణలు, చర్చలు ఎక్కువగానూ ఉంటాయి.
 2. ఇందులోని పాత్రలన్నీ స్వభావ సిద్ధమైనవిగా, మామూలు వ్యక్తుల్లో నిత్యం చూస్తున్నట్లు ఉన్నాకానీ ఏ పాత్ర వ్యక్తిత్వం ఆ పాత్రకి ఉంటుంది.
 3. ఈ నాటకం చూస్తున్నంతసేపు బెర్నార్డ్ షా నాటకాలు గుర్తుకువస్తాయి.

మూలాలుసవరించు

 1. నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాట‌కం బ‌తికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 3 నవంబర్ 2018. Retrieved 19 December 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. నమస్తే తెలంగాణ, సంపాదక పేజీ వ్యాసాలు (15 December 2014). "తెలంగాణల నాటక సాహిత్యం". www.ntnews.com. గందసిరి రాజేష్. Archived from the original on 19 December 2019. Retrieved 19 December 2019.
 3. వెబ్ ఆర్కైవ్ (22 March 1957). "క్రీనీడలు (పరిచయం)". నాటకం. Retrieved 19 December 2019.
 4. వెబ్ ఆర్కైవ్ (22 March 1957). "క్రీనీడలు". నాటకం. Retrieved 19 December 2019.
 5. వెబ్ ఆర్కైవ్ (22 March 1957). "క్రీనీడలు (పరిచయం)". నాటకం. Retrieved 19 December 2019.

ఇతర లంకెలుసవరించు