క్రోన్స్ వ్యాధి

ఒక రకమైన శోథ ప్రేగు వ్యాధి

క్రోన్స్ వ్యాధి అనేది ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD), ఇది జీర్ణశయం ప్రేగులలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయవచ్చు.[1] తరచుగా కడుపు నొప్పి, అతిసారం, జ్వరం, కడుపు వెడల్పుగా ఉండడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి .[2][1] జీర్ణశయాంతర ప్రేగు మార్గం వెలుపల సమస్యలు రక్తహీనత, చర్మ దద్దుర్లు, కీళ్ళనొప్పులు, కంటి వాపు, అలసట కలిగి ఉండవచ్చు. చర్మం మీద దద్దుర్లు సంక్రమణం, అలాగే 'పియోడెర్మా గ్యాంగ్రెనోసం' లేదా 'ఎరిథెమా నోడోసం' కారణంగా ఉండవచ్చు. దీర్ఘకాలిక వాపు సమస్యగా ప్రేగు అవరోధం సంభవించవచ్చు, వ్యాధి ఉన్నవారికి పెద్దప్రేగు క్యాన్సర్, చిన్న ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.[2]

క్రోన్స్ వ్యాధి
ఇతర పేర్లుక్రోన్ వ్యాధి, క్రోన్ సిండ్రోమ్, గ్రాన్యులోమాటస్ ఎంటెరిటిస్, ప్రాంతీయ ఎంటెరిటిస్, లెష్నియోవ్స్కీ-క్రోన్ వ్యాధి
అల్సరేటివ్ కొలిటిస్(కొలిటిస్ అల్సెరోసా)కుడివైపు. ప్రభావితమైన ప్రాంతాలతో పోలిస్తే క్రోన్స్ వ్యాధి (ఎడమ వైపు)లో పేగులో మూడు ప్రభావిత ప్రదేశాలు
ప్రత్యేకతజీర్ణకోశ వ్యాధులు
లక్షణాలుతరచుగా కడుపు నొప్పి, అతిసారం, జ్వరం, కడుపు వెడల్పుగా ఉండడం, బరువు తగ్గడం, రక్తహీనత, చర్మ దద్దుర్లు, కీళ్ళనొప్పులు, కంటి వాపు, అలసట
సంక్లిష్టతలురక్తహీనత, చర్మం దద్దుర్లు, కీళ్లవాతం, పేగు క్యాన్సర్
సాధారణ ప్రారంభం20–29 సంవత్సరాలలో
కాల వ్యవధిదీర్ఘ కాలం
కారణాలుపర్యావరణ,జన్యు పరమైన అంశాలు
రోగనిర్ధారణ పద్ధతికణజాల పరీక్ష (బయాప్సి)
ఔషధంకార్టికోస్టెరాయిడ్లు, బయోలాజికల్ థెరపీ,అజాథియోప్రైన్, మెథోట్రెక్సేట్ వంటి ఇమ్యునోసప్రెసెంట్స్
రోగ నిరూపణమరణ ప్రమాదం కొంత వరకు
తరుచుదనము1,000 మందికి 3.2

కారణాలు

మార్చు

క్రోన్స్ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినప్పటికీ, జన్యుపరంగా హాని సంభావ్యత కల వ్యక్తులలో పర్యావరణ, రోగనిరోధక బ్యాక్టీరియా కారకాల కలయిక వల్ల ఇది సంభవిస్తుందని భావిస్తారు.[1][3] [4] ఇది దీర్ఘకాలిక శోథ రుగ్మత దారితీస్తుంది, దీనిలో శరీరం బహుశా సూక్ష్మజీవుల యాంటిజెన్లను లక్ష్యంగా చేసుకుని రోగనిరోధక వ్యవస్థ జీర్ణశయాంతర ప్రేగులను రక్షిస్తుంది[5][6]. క్రోన్స్ వ్యాధి రోగనిరోధకశక్తికి సంబంధిత వ్యాధి అయినప్పటికీ, ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధిగా భావించరు (రోగనిరోధక వ్యవస్థని శరీరం ప్రేరేపించదు).[7] అంతర్లీన రోగనిరోధక సమస్య స్పష్టంగా లేదు, అయితే, ఇది రోగనిరోధక శక్తి లేకపోవడం వలన రావచ్చు.[6][8][9]

సగం పైగా ప్రమాదం జన్యుపరమైనది. ఇందులో 70 కంటే ఎక్కువ జన్యువులు ఉన్నాయి.[2][10] పొగాకు ధూమపానం చేసేవారు, చేయని వారితో పోలిస్తే క్రోన్స్ వ్యాధికి గురి అయే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.[11] ఇది తరచుగా గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధి తర్వాత ప్రారంభమవుతుంది[2] . ఇలాంటి లక్షణాలు ఉన్న వేరే వ్యాధులు ప్రేగు సిండ్రోమ్, బెహెట్ వ్యాధి ఉన్నాయి.[2]

నివారణ, చికిత్స

మార్చు

క్రోన్స్ వ్యాధికి నివారణ లేదు.[2][1] చికిత్స అంటే వ్యాధి లక్షణాలు తగ్గించడానికి, ఉపశమనం కొనసాగించడానికి మళ్ళీ పునఃస్థితిని నివారించడానికి చేస్తారు. కొత్తగా రోగ నిర్ధారణ అయిన వారికి లక్షణాలను వేగంగా తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్ కొంతకాలం, ఉపయోగించుతారు. ఇంకా మెథోట్రెక్సేట్ లేదా వ్యాధి పునరావృతను నిరోధించడానికి ఉపయోగించే థియోపరిన్ వంటి మందులు కూడా వాడుతారు. క్రోన్స్ వ్యాధి ఉన్నవారు ధూమపానం మానేవేయాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.ఈ వ్యాధి ఉన్నవారిలో ప్రతి ఐదుగురికి ఒకరు సంవత్సరానికి ఒకసారైనా ఆసుపత్రిలో చేరతారు, వ్యాధి గ్రస్తులలో సగం మందికి పదేళ్ల కాలంలో ఏదో ఒక సమయంలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్రచికిత్సను వీలైనంత తగ్గించాలి, కొన్ని చీములు, కొన్ని ప్రేగు అడ్డంకులు క్యాన్సర్లను పరిష్కరించడం అనేది తరచూ అవసరం. కోలొనోస్కోపీ ద్వారా ప్రేగు క్యాన్సర్ ఉందేమో అనే పరీక్ష వ్యాధి ప్రారంభమైన ఎనిమిది సంవత్సరాల తర్వాత నుంచి ఒకసారి సిఫార్సు చేస్తారు.[2]

వ్యాధి ప్రాబల్యం

మార్చు

ఐరోపా, ఉత్తర అమెరికాలో క్రోన్స్ వ్యాధి ప్రతి 1,000 మందికి 3.2 మందిని ప్రభావితం చేస్తుంది.[12] ఆసియా, ఆఫ్రికాలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.[13][14] సర్వసాధారణంగా ఇది ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఉంది.[15] అయితే, 1970ల నుండి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ రోగుల సంఖ్య పెరుగుతోంది. [14][15] శోథ ప్రేగు వ్యాధి (IBD) ఫలితంగా 2015 లో 47,400 మరణాలు సంభవించాయి, క్రోన్స్ వ్యాధి ఉన్నవారిలో జీవిత కాలం ఇంకొంచెం తక్కువ ఉంటుందని భావిస్తారు.[16] ఇది కౌమారదశలో, యుక్తవయస్సులో ప్రారంభమవుతుంది, అయితే ఇది ఏ వయసులోనైనా సంభవించవచ్చు. [17][2] [18] పురుషులు మహిళలు సమానంగా ప్రభావితమవుతారు[1].

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Crohn's Disease". National Institute of Diabetes and Digestive and Kidney Diseases (NIDDK). Archived from the original on December 8, 2019. Retrieved December 8, 2019.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 Baumgart DC, Sandborn WJ (August 2012). "Crohn's disease". Lancet. 380 (9853): 1590–1605. doi:10.1016/S0140-6736(12)60026-9. PMID 22914295.
  3. Cho JH, Brant SR (May 2011). "Recent insights into the genetics of inflammatory bowel disease". Gastroenterology. 140 (6): 1704–12. doi:10.1053/j.gastro.2011.02.046. PMC 4947143. PMID 21530736.
  4. Stefanelli T, Malesci A, Repici A, Vetrano S, Danese S (May 2008). "New insights into inflammatory bowel disease pathophysiology: paving the way for novel therapeutic targets". Current Drug Targets. 9 (5): 413–8. doi:10.2174/138945008784221170. PMID 18473770.
  5. Dessein R, Chamaillard M, Danese S (September 2008). "Innate immunity in Crohn's disease: the reverse side of the medal". Journal of Clinical Gastroenterology. 42 (Suppl 3 Pt 1): S144–7. doi:10.1097/MCG.0b013e3181662c90. PMID 18806708.
  6. 6.0 6.1 Marks DJ, Rahman FZ, Sewell GW, Segal AW (February 2010). "Crohn's disease: an immune deficiency state". Clinical Reviews in Allergy & Immunology. 38 (1): 20–31. doi:10.1007/s12016-009-8133-2. PMC 4568313. PMID 19437144.
  7. Casanova JL, Abel L (August 2009). "Revisiting Crohn's disease as a primary immunodeficiency of macrophages". The Journal of Experimental Medicine. 206 (9): 1839–43. doi:10.1084/jem.20091683. PMC 2737171. PMID 19687225.
  8. Lalande JD, Behr MA (July 2010). "Mycobacteria in Crohn's disease: how innate immune deficiency may result in chronic inflammation". Expert Review of Clinical Immunology. 6 (4): 633–641. doi:10.1586/eci.10.29. PMID 20594136. S2CID 25402952.
  9. Yamamoto-Furusho JK, Korzenik JR (November 2006). "Crohn's disease: innate immunodeficiency?". World Journal of Gastroenterology. 12 (42): 6751–5. doi:10.3748/wjg.v12.i42.6751. PMC 4087427. PMID 17106921.
  10. Barrett JC, Hansoul S, Nicolae DL, Cho JH, Duerr RH, Rioux JD, Brant SR, Silverberg MS, Taylor KD, Barmada MM, Bitton A, Dassopoulos T, Datta LW, Green T, Griffiths AM, Kistner EO, Murtha MT, Regueiro MD, Rotter JI, Schumm LP, Steinhart AH, Targan SR, Xavier RJ, Libioulle C, Sandor C, Lathrop M, Belaiche J, Dewit O, Gut I, Heath S, Laukens D, Mni M, Rutgeerts P, Van Gossum A, Zelenika D, Franchimont D, Hugot JP, de Vos M, Vermeire S, Louis E, Cardon LR, Anderson CA, Drummond H, Nimmo E, Ahmad T, Prescott NJ, Onnie CM, Fisher SA, Marchini J, Ghori J, Bumpstead S, Gwilliam R, Tremelling M, Deloukas P, Mansfield J, Jewell D, Satsangi J, Mathew CG, Parkes M, Georges M, Daly MJ (August 2008). "Genome-wide association defines more than 30 distinct susceptibility loci for Crohn's disease". Nature Genetics. 40 (8): 955–962. doi:10.1038/ng.175. PMC 2574810. PMID 18587394.
  11. Cosnes J (June 2004). "Tobacco and IBD: relevance in the understanding of disease mechanisms and clinical practice". Best Practice & Research. Clinical Gastroenterology. 18 (3): 481–496. doi:10.1016/j.bpg.2003.12.003. PMID 15157822.
  12. Molodecky NA, Soon IS, Rabi DM, Ghali WA, Ferris M, Chernoff G, Benchimol EI, Panaccione R, Ghosh S, Barkema HW, Kaplan GG (January 2012). "Increasing incidence and prevalence of the inflammatory bowel diseases with time, based on systematic review". Gastroenterology. 142 (1): 46–54.e42, quiz e30. doi:10.1053/j.gastro.2011.10.001. PMID 22001864. S2CID 206223870. Archived from the original on October 7, 2022. Retrieved October 7, 2022.
  13. Prideaux L, Kamm MA, De Cruz PP, Chan FK, Ng SC (August 2012). "Inflammatory bowel disease in Asia: a systematic review". Journal of Gastroenterology and Hepatology. 27 (8): 1266–80. doi:10.1111/j.1440-1746.2012.07150.x. PMID 22497584. S2CID 205468282.
  14. 14.0 14.1 Hovde Ø, Moum BA (April 2012). "Epidemiology and clinical course of Crohn's disease: results from observational studies". World Journal of Gastroenterology. 18 (15): 1723–31. doi:10.3748/wjg.v18.i15.1723. PMC 3332285. PMID 22553396.
  15. 15.0 15.1 Burisch J, Munkholm P (July 2013). "Inflammatory bowel disease epidemiology". Current Opinion in Gastroenterology. 29 (4): 357–62. doi:10.1097/MOG.0b013e32836229fb. PMID 23695429. S2CID 9538639.
  16. . "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980–2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015".
  17. Shih, I-Lun; Lee, Tsung-Chun; Tu, Chia-Hung; Chang, Chin-Chen; Wang, Yu-Fen; Tseng, Yao-Hui; Chiu, Han-Mo; Wu, Ming-Shiang; Wang, Hsiu-Po; Shih, Tiffany Ting-Fang; Liu, Kao-Lang (2016-12-01). "Intraobserver and interobserver agreement for identifying extraluminal manifestations of Crohn's disease with magnetic resonance enterography". Advances in Digestive Medicine (in ఇంగ్లీష్). 3 (4): 174–180. doi:10.1016/j.aidm.2015.05.004. S2CID 70796090.
  18. "Crohn's Disease: Get Facts on Symptoms and Diet". eMedicineHealth. Archived from the original on October 20, 2007.