క్లాడియా గోల్డెన్

2023 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌ కు లభించింది[1]. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి సమగ్రమైన అధ్యాయం చేసినందుకుగాను క్లాడియా గోల్డిన్‌ కు ఈ అవార్డు దక్కింది[2]. ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ పురస్కారం అందుకున్న మహిళల్లో క్లాడియా గోల్డిన్‌ మూడో వ్యక్తి కావడం విశేషం[3]. గత శతాబ్ది కాలంలో అనేక ఆదాయ దేశాల్లో వేతన మహిళల నిష్పత్తి మూడు రెట్లు పెరిగింది[4]. ఆధునిక కాలంలో కార్మిక రంగంలో ఇది అతి పెద్ద సామాజిక, ఆర్థిక మార్పుల్లో ఒకటి. మహిళల సంపాదనతో పాటు ఈ వ్యత్యాసాల మూలాలను వివరించేందుకు క్లాడియా గోల్డిన్‌ సమగ్ర అధ్యయనం చేశారు. క్లాడియా గోల్డిన్‌ పరిశోధనలు లేబర్ మార్కెట్లో మహిళల చారిత్రాత్మక, సమకాలిన పాత్రలపై ఎప్పటికప్పుడు సరికొత్త, ఆశ్చర్యకరమైన వివరాలు అందించారని నోబెల్ పురస్కార ఎంపిక కమిటీ పేర్కొంది. క్లాడియా గోల్డిన్‌ 1964 సంవత్సరం న్యూయార్క్ లో జన్మించారు. ప్రస్తుతం హర్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

మూలాలు :

  1. "ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం". Sakshi. 2023-10-09. Retrieved 2023-10-25.
  2. "Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్‌". EENADU. Retrieved 2023-10-25.
  3. "అర్ధశాస్త్రంలో క్లాడియో గోల్డిన్ కు నోబెల్ పురస్కారం". ap7am.com. 2023-10-09. Retrieved 2023-10-25.
  4. Gopi (2023-10-12). "Claudia Goldin: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్‌.. ఈ ఘనత సాధించిన మూడో మహిళగా రికార్డు..!". Telugu Varadhi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-25.[permanent dead link]