క్లైమాక్స్ (2021 సినిమా)

క్లైమాక్స్ 2021లో విడుదలైన కామెడీ, సస్సెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. కరుణాకర్ రెడ్డి, రాజేశ్వరరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భవానీ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021, మార్చి 5న విడుదలైంది.[1][2]

క్లైమాక్స్
దర్శకత్వంభవాని శంకర్ కే
రచనకరుణాకర్ రెడ్డి
నిర్మాతరాజేశ్వర్ రెడ్డి ‌
కరుణాకర్ రెడ్డి
తారాగణంరాజేంద్రప్రసాద్
సాషాసింగ్
ఛాయాగ్రహణంరవి కుమార్ నీర్ల
కూర్పుబ‌స్వా పైడిరెడ్డి
సంగీతంరాజేష్, నిద్వాన‌
నిర్మాణ
సంస్థ
కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ
5 మార్చి 2021 (2021-03-05)
సినిమా నిడివి
90 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ నేపథ్యం

మార్చు

విజయ్ మోడీ (రాజేంద్ర ప్రసాద్) అనే వ్యక్తి పచ్చి అవకాశవాది. ఎలాంటి అడ్డదారులు తొక్కైనా సరే జీవితంలో పైకి రావాలనుకొంటాడు. ఓ మంత్రికి బినామీగా కూడా వ్యవహరిస్తుంటాడు. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకొని పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడు. పాపులారిటీ కోసం టీవీ షోలు చేస్తాడు. సినిమాలు నిర్మిస్తాడు. చివరకు విజయ్ మోడీ అప్పులపాలవుతాడు. ఓ దశలో దారుణ హత్యకు గురవుతాడు.ఈ హత్య చేసింది ఎవరు? ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.[3]

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: భవాని శంకర్ కే
  • నిర్మాతలు: రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి
  • సంగీతం: రాజేష్, నిద్వాన
  • ఛాయాగ్రహణం: రవి కుమార్ నీర్ల
  • ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్, రవి (ముంబై)
  • ఎడిటర్: బ‌స్వా పైడిరెడ్డి
  • కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్
  • నిర్మాణం: కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు

మార్చు

మూలాలు

మార్చు
  1. News18 Telugu (5 March 2021). "Climax Movie Review: క్లైమాక్స్ మూవీ రివ్యూ.. సగమే ఆకట్టుకున్న క్లైమాక్స్." Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi Post (5 March 2021). "Rajendra Prasad's Climax Review, Rating". Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.
  3. NTV Telugu (5 March 2021). "రివ్యూ: 'క్లైమాక్స్' మూవీ". Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.