క్వార్క్ అంటే పదార్థానికి మూలాధారమైన ప్రాథమిక కణాల్లో ఒక రకం. ఈ క్వార్కులు ఒకదానితో ఒకటి కలిసి హెడ్రాన్లు అనే సంయుక్త కణాలను ఏర్పరుస్తాయి. ఈ హెడ్రాన్లలో అత్యంత నిలకడ అయినవి పరమాణు కేంద్రకంలో భాగమైన ప్రోటాన్లు, న్యూట్రాన్లు.[1] సాధారణంగా మనం పరిశీలించగలిగిన పదార్థమంతా అప్ క్వార్కులు, డౌన్ క్వార్కులు, ఎలక్ట్రాన్ల చేత నిర్మితమై ఉంటుంది. కలర్ కన్‌ఫైన్‌మెంట్ అనే ధర్మం వలన ఈ క్వార్కులు ఎప్పుడూ విడిగా కనిపించవు. వీటిని బేరియాన్లు (ప్రోటాన్లు, న్యూట్రాన్లు), మేసాన్లు లాంటి హెడ్రాన్లలోనూ, లేదా క్వార్క్-గ్లువాన్ ప్లాస్మాలో మాత్రమే చూడగలం.[2][3][4] ఈ కారణం వల్ల క్వార్కుల గురించి మనకు తెలిసిన సమాచారమంతా హెడ్రాన్లను పరిశీలించడం ద్వారా సంపాదించినదే.

క్వార్క్
Three colored balls (symbolizing quarks) connected pairwise by springs (symbolizing gluons), all inside a gray circle (symbolizing a proton). The colors of the balls are red, green, and blue, to parallel each quark's color charge. The red and blue balls are labeled "u" (for "up" quark) and the green one is labeled "d" (for "down" quark).
ఒక ప్రోటాన్లో రెండు అప్ క్వార్కులు, రెండు డౌన్ క్వార్కులు వాటిని బంధించి ఉంచే గ్లూఆన్స్ ఉంటాయి. The color assignment of individual quarks is arbitrary, but all three colors must be present; red, blue and green are used as an analogy to the primary colors that together produce a white color.
కూర్పుప్రాథమిక కణం
కణ గణాంకాలుఫర్మియోనిక్
ఉత్పత్తి1st, 2nd, 3rd
Interactionsstrong, weak, electromagnetic, gravitation
చిహ్నం
q
వ్యతిరేక కణముantiquark (
q
)
సైద్ధాంతీకరణ
ఆవిష్కరణSLAC (సుమారు 1968)
రకములు6 (up, down, strange, charm, bottom, and top)
విద్యుదావేశం+2/3 e, −1/3 e
Color chargeyes
స్పిన్1/2 ħ
బేరియన్ సంఖ్య1/3

ఈ క్వార్కులకు కొన్ని స్వాభావికమైన గుణాలు ఉన్నాయి. అవి విద్యుదావేశం, ద్రవ్యరాశి, కలర్ చార్జ్, ఇంకా స్పిన్.

మూలాలు

మార్చు
  1. "Quark (subatomic particle)". Encyclopædia Britannica. Retrieved 2008-06-29.
  2. R. Nave. "Confinement of Quarks". HyperPhysics. Georgia State University, Department of Physics and Astronomy. Retrieved 2008-06-29.
  3. R. Nave. "Bag Model of Quark Confinement". HyperPhysics. Georgia State University, Department of Physics and Astronomy. Retrieved 2008-06-29.
  4. There is also the theoretical possibility of more exotic phases of quark matter.
"https://te.wikipedia.org/w/index.php?title=క్వార్క్&oldid=4164290" నుండి వెలికితీశారు