క్షితిమోహన్ సేన్
క్షితిమోహన్ సేన్ ( 1880 డిసెంబరు 2 - 1960 మార్చి 12) ప్రఖ్యాత సంస్కృత భాషా పండితుడు, బహుభాషా వేత్త, రచయిత. ఈయన మధ్య యుగ చరిత్రలో పండితుడు, రవీంద్రనాథ్ టాగూర్ కు ముఖ్య సన్నిహితుడు.
క్షితిమోహన్ సేన్ | |
---|---|
జననం | వారణాసి, బ్రిటీష్ ఇండియా | 1880 నవంబరు 30
మరణం | 1960 మార్చి 12 | (వయసు 79)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సంస్కృత పండితుడు, అధ్యాపకుడు, రచయిత |
జీవిత విశేషాలు
మార్చుక్షితిమోహన్ సేన్ భారతీయ పండితుడు, రచయిత, సంస్కృత అధ్యాపకుడు, బెనారస్‌లోని క్వీన్స్ కాలేజీ నుండి సంస్కృతంలో ఎం.ఎ. పట్టా పొందారు. అతను బెంగాల్‌లోని (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న) సోనారంగ్‌కు చెందిన వైద్య కుటుంబంలో జన్మించాడు. అతను చంబా రాష్ట్రంలోని విద్యా శాఖలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1908లో రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు బ్రహ్మచర్యాశ్రమంలో చేరారు. అనంతరం విద్యాభబన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అతను విశ్వ భారతి మొదటి దేశికోట్టం (1952) బిరుదును పొందారు. సేన్ గారు విశ్వభారతి విశ్వవిద్యాలయం (1953-1954) యొక్క బదులు ఉపాచార్యులుగా పనిచేసారు. సేన్ గారు ఠాగూర్ తో పాటు అనేక దేశ విదేశ ప్రయాణాలు చేసారు. సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, రాజస్థానీ, అరెబిక్ మొదలగు భాషలలో సేన్ గారు నిష్ణాతులు. సేన్ గార్య్ భారతదేశం మధ్యయుగంలో జరిగిన చారిత్రక అంశాలపై చాలా కృషి చేసారు. వేదాలు- ఉపనిషత్తులు- తంత్ర-మంత్ర-పురాణాలను భాగా ఆకట్టుకొని నిత్య జీవతంలో వాటి సారాంశాలను విశ్వభారతి విద్యాలయ విద్యార్థులకు బోధించేవారు. భారతీయ నారీ, రవీంద్రుని ప్రసంగాలు, హిందూయిజం, కబీర్ మొదలగు గ్రంథాలను రచించారు. క్షితిమోహన్ సేన్ ప్రఖ్యాత భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమర్త్య సేన్ తాతగారు అవుతారు (తల్లి తరుపు నుండి).