ఖమ్మం పోలీస్ కమీషనరేట్
ఖమ్మం పోలీస్ కమిషనరేట్, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో ఉన్న పోలీసు కమీషనరేట్. ఖమ్మం ప్రాంతంలో చట్ట అమలుకు, దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న ఒక పోలీసు విభాగం.[1] ప్రస్తుత పోలీసు కమిషనర్ గా విష్ణు ఎస్ వారియర్ ఐపిఎస్ విధులు నిర్వర్తిస్తున్నాడు.[2]
ఖమ్మం పోలీస్ కమీషనరేట్ | |
---|---|
మామూలుగా పిలిచే పేరు | ఖమ్మం నగర పోలీస్ |
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 2016 |
ఉద్యోగులు | కమీషనర్ ఆఫ్ పోలీస్ డిప్యూటి కమీషనర్ అడిషనల్ డిప్యూటి కమీషనర్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ |
అధికార పరిధి నిర్మాణం | |
కార్యకలాపాల అధికార పరిధి | ఖమ్మం జిల్లా, భారతదేశం |
చట్టపరమైన అధికార పరిధి | ఖమ్మం |
Primary governing body | తెలంగాణ ప్రభుత్వం |
ద్వితీయ పాలకమండలి | తెలంగాణ రాష్ట్ర పోలీస్ |
ప్రధాన కార్యాలయం | ఖమ్మం, తెలంగాణ |
ఏజెన్సీ అధికారులు |
|
మాతృ ఏజెన్సీ | తెలంగాణ రాష్ట్ర పోలీస్ |
Facilities | |
Stations | 29 పోలీస్ స్టేషన్లు |
చరిత్ర
మార్చు2016 అక్టోబరులో ఖమ్మం పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఖమ్మంలో హెడ్ క్వార్టర్స్‌తో ఈ కమీషనరేట్ ఏర్పడింది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ అధికార పరిధి 4,360 చ.కి.మీ. కాగా, జనాభా సుమారు 1,389,566. మంది ఉన్నారు. ఈ కమీషనరేట్ పరిధిలో 3 సబ్ డివిజన్లు, 9 సర్కిళ్ళు, 29 - పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
జోన్స్
మార్చుఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం మూడు డిసిపి జోన్స్ ఉన్నాయి.[3]
ఖమ్మం జోన్
మార్చు- ఖమ్మం టౌన్: ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, ఖమ్మం ట్రాఫిక్, మహిళా పిఎస్, సిసిఎస్, ఖానాపూర్ హవేలీ, పిసిఆర్ కొత్తగూడెం, రఘునాథపాలెం
- ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్, ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలైపాలెం
- ఇల్లందు రూరల్: కారేపల్లి, కామేపల్లి
వైరా
మార్చు- వైరా: వైరా, తల్లాడ, కొనిజెర్ల, చింతకాని
- మధిర: మధిర టౌన్, మధుర రూరల్, బోనకల్, ఎర్రుపాలెం
కల్లూరు ===
- సత్తుపల్లి రూరల్: వి.ఎం. బంగీర, కల్లూరు, వేంసూర్, ఏన్కూర్
కమీషనరేట్ భవనం
మార్చుఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కోసం కొత్త భవనాన్ని నిర్మించారు. అద్దాలు, ఆర్కిటెక్చర్‌తో చాలా ఆకర్షణీయంగా నిర్మించిన ఈ కమిషనరేట్ చుట్టూ సిసి కెమెరాలు ఉన్నాయి. ఈ కమిషనరేట్ కార్యాలయం నుండి ఖమ్మం మార్కెట్ యార్డ్ వైపు ఒక గేట్, ప్రకాష్ నగర్ వంతెనల సమీపంలో రెండవ గేట్ ఉన్నాయి. ఈ కార్యాలయం హై క్లాస్ ఫెసిలిటీస్, ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడింది.
మూలాలు
మార్చు- ↑ "Khammam made police commissionerate - The Hindu". thehindu.com. Retrieved 2016-10-11.
- ↑ నమస్తే తెలంగాణ, ఖమ్మం (14 September 2021). "పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైరా ఏసీపీ స్నేహామెహ్రా…". Namasthe Telangana. Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
- ↑ "Telangana State Police". www.tspolice.gov.in. Retrieved 2021-09-23.