ఖమ్మం
ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.ఖమ్మం పట్టణం వ్యాపార,ఆర్థిక కేంద్రం .
ఖమ్మం ఖమ్మమెట్ట్ | |
---|---|
నగరం | |
![]() నరసింహ స్వామి కొండ నుండి ఖమ్మం పట్టణం | |
నిర్దేశాంకాలు: 17°15′N 80°10′E / 17.25°N 80.16°ECoordinates: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
ప్రభుత్వం | |
• నిర్వహణ | ఖమ్మం మ్యునిసిపల్ కార్పొరేషన్ |
• మేయర్ | గుగులోత్ పాపాలాల్ |
• డిప్యూటీ మేయర్ | బత్తుల మురళి |
• మ్యునిసిపల్ కమీషనర్ | సందీప్ కుమార్ |
• శాసనసభ్యుడు | పువ్వాడ అజయ్ కుమార్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 93.45 కి.మీ2 (36.08 చ. మై) |
విస్తీర్ణపు ర్యాంకు | 3వ (రాష్ట్రంలో) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 107 మీ (351 అ.) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 3,13,504 |
• ర్యాంకు | 151(India) 4th (Telangana) |
• సాంద్రత | 3,400/కి.మీ2 (8,700/చ. మై.) |
పిలువబడువిధం (ఏక) | ఖమ్మమైట్ |
అధికార | |
• భాషలు | తెలుగు, ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 507001/02/03/115/154/170/305/318 |
వాహనాల నమోదు కోడ్ | TS–04[3] |
జాతీయత | భారతీయులు |
ప్రణాళికా సంస్థ | ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ |
జాలస్థలి | Khammam Municipal Corporation |
పద చరిత్రసవరించు
చారిత్రిక గ్రంథాల ఆధారంగా ఖమ్మం నగరానికి మునుపటి పేరు "",స్తంభశిఖరి "కంభం మెట్టు" లేదా స్థంభాద్రి.[4] "మెట్టు" అంటే తెలుగు భాషలో కొండ లేదా ఎత్తైన ప్రదేశం. ఈ పేరును "కమోమెట్" మరియు "ఖమ్మమ్మెట్" అని కూడా ఆంగ్లీకరించారు.[5]
చరిత్రసవరించు
తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల (శాతవాహనులు, తూర్పు చాళిక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాచర్ల దొరలూ, బహామనీయులు, కుతుబషాహీలు, మొగల్, అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉన్నది 1905 దాకా వంరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన. నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ గా పేర్కొనబడినది .[6]
చారిత్రక ఆధారాల ప్రకారము ఖమ్మం నిజనామము స్తంభశిఖరి" [7][8][9][10][11][12]. తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది.
చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.
భౌగోళికముసవరించు
ఖమ్మం భౌగౌళికముగా 17.25° ఉ 80.15° తూలో ఉంది.దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణం కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగ సాగర్ నీరు లభించింది.
స్వాతంత్ర్యోద్యమంసవరించు
స్వాతంత్య్ర సంగ్రామంలో ఖమ్మం పట్టణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు.
- 1931 - ఖమ్మంలో మొదటి స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది.
- 1935 - ఖమ్మం పట్టణంలో మొదటి గ్రంథాలయం స్థాపించబడింది.
- 1945 - ఖమ్మంలో 12 వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం పెండ్యాల సత్య నారాయణరావు ప్రధాన కార్యదర్శిగా, అహ్వాన సంఘం నిర్వహించారు. ఆ సమావేశంలో బద్దాం ఎల్లారెడ్డిని అధ్యక్షుడిగా, 13 వ రాష్ట్రం ఆంధ్ర మహాసభకు ఉపాధ్యక్షుడిగా పెండ్యాల సత్య నారాయణరావు ఎన్నికయ్యారు. ఈ సమావేశం మార్చి 26–28 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో పుచ్చలపల్లి సుందరయ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి దాదాపు 40,000 మంది హాజరయ్యారు.
- 1946 - 1946 ఆగస్టు 5 న మహాత్మా గాంధీ ఖమ్మం మెట్ (ఖమ్మం పట్టణం) సందర్శన,
- 1947 ఆగస్టు, 7 - జమలాపురం కేశవరావు, కూరపాటి వెంకట రాజు, జగదీశ్వరయ్య నీలకందన్, బచ్చలకూర లక్ష్మయ్య, వట్టికొండ రామకోటయ్య, హీరాలాల్ మోరియా, తీగల హనుమంతరావు, కిలిపాక కిషన్‌రవు, గెల్ల కేశవరావు, యాదవల్లి వెంకటేశ్వర శర్మ, పుల్లభట్ల వెంకటేశ్వర్లు (హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు), ఊటుకూరి కమల (స్వాతంత్ర్య సమరయోధురాలు - తెలంగాణ విమోచన)
పర్యాటక కేంద్రాలుసవరించు
- ఖమ్మం ఖిల్లా
- నరసింహస్వామి ఆలయం
- శ్రీ జలాంజనేయస్వామి ఆలయం
- లకారం చెరువు
- దానవాయిగూడెం పార్కు
- తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
- లకారం పార్క్ / ట్యాంక్ బండ్
- కిన్నెరసాని వన్యప్రాణి ఆశ్రయం
- నేలకొండపల్లి
ప్రముఖులుసవరించు
పట్టణంలోని నివాస ప్రాంతాలుసవరించు
ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస, వాణిజ్య ప్రాంతాలు.
|
|
|
|
|
మూలాలుసవరించు
- ↑ "Basic Information". Official website of Khammam Municipal Corporation. Archived from the original on 11 February 2016. Retrieved 18 February 2016.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;population
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
- ↑ Khammam, Telangana State Potal, retrieved 15 April 2019.
- ↑ https://books.google.co.in/books?id=5zeBDwAAQBAJ&pg=PA155&redir_esc=y#v=onepage&q&f=false
- ↑ Nizam's Guaranteed State Railway 1870
- ↑ A Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216
- ↑ A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80
- ↑ Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149
- ↑ A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London
- ↑ The Geography of India, J. Burgess, 1871, London, p. 48
- ↑ The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73