ఖమ్మం రైల్వే స్టేషన్
ఖమ్మం రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: KMT [1] ) భారతదేశంలోని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ భారతీయ రైల్వేలకు సేవలు అందిస్తోంది. ఈ స్టేషను భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ స్టేషనుకు ప్రతీ రోజు సుమారు 98 రైళ్లు చేరుకుంటాయి లేదా బయలుదేరుతాయి. దేశవ్యాప్తంగా వారి గమ్యస్థానాలకు ప్రతిరోజూ ఒక లక్షా అరవై వేల (160,000) మంది ప్రయాణికులు ఈ స్టేషను నుండి ప్రయాణిస్తుంటారు. ఖమ్మం రైల్వే స్టేషన్ 'ఎ' కేటగిరీ స్టేషన్లలో రెండవ పరిశుభ్రమైన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. [2] ఖమ్మం రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థలో అతిపెద్ద, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. స్టేషన్‌లో ఐదు ట్రాక్‌లు అందించే రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.
ఖమ్మం రైల్వే స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | Near Anand Bhavan, Khammam – 507001 Telangana India |
Coordinates | 17°14′58″N 80°08′19″E / 17.249347°N 80.138491°E |
నిర్వహించువారు | Indian Railways |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 4 |
నిర్మాణం | |
పార్కింగ్ | Available (Paid) |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | KMT |
Fare zone | Secunderabad Division |
Location | |
మూలాలు
మార్చు- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. 2015. p. 46. Retrieved 29 April 2019.
- ↑ Correspondent, Special. "Secunderabad declared second cleanest station". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-06-05.
బాహ్య లింకులు
మార్చు- Khammam railway station at the India Rail Info