ఖుంజేరబ్ కనుమ
ఖుంజేరబ్ కనుమ కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న కనుమ దారి. ఇది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు, గిల్గిట్-బాల్టిస్తాన్ లోని హుంజా, నగర్ జిల్లాలకూ, చైనా నైరుతి సరిహద్దులోని జింజియాంగ్‌కూ మధ్య ఉంది. సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 4,693 మీటర్లు ఉంటుంది.
ఖుంజేరబ్ కనుమ | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 4,693 m (15,397 ft) |
ఇక్కడ ఉన్న రహదారి పేరు | Karakoram Highway |
ప్రదేశం | పాక్ ఆక్రమిత కశ్మీరు లోని హుంజా / చైనా లోని జింజియాంగ్ |
శ్రేణి | కారకోరం శ్రేణి |
Coordinates | 36°51′00″N 75°25′40″E / 36.85000°N 75.42778°E |
ఖుంజేరబ్ కనుమ | |||||||
---|---|---|---|---|---|---|---|
Chinese name | |||||||
సంప్రదాయ చైనీస్ | 紅其拉甫山口 | ||||||
సరళీకరించిన చైనీస్ | 红其拉甫山口 | ||||||
|
శబ్దవ్యుత్పత్తి
మార్చుదీని పేరు స్థానిక వాఖీ భాషలోని రెండు పదాల నుండి ఉద్భవించింది. ఈ భాషలో "ఖూన్" అంటే రక్తం అని, "జేరబ్": అంటే నీటిబుగ్గ లేదా జలపాతం అనీ అర్థం.
ప్రశస్తి
మార్చుఖుంజేరబ్ కనుమ ప్రపంచంలోనే ఎత్తైన అంతర్జాతీయ సరిహద్దు రహదారి. కారకోరం హైవే పై ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం. ఈ కనుమ గుండా వేసిన రహదారి 1982 లో పూర్తయింది. కారకోరం శ్రేణిలో అంతకు ముందు ప్రాచుర్యంలో ఉన్న మింటాకా, కిలిక్ కనుమల గుండా పోయే కచ్చా రోడ్ల స్థానంలో ఈ కొత్త రహదారి ప్రాచుర్యం పొందింది. ఖుంజేరబ్ కనుమ గుండా కారకోరం హైవేను వెయ్యాలని 1966 లో నిర్ణయించారు. మింటాకా కనుమకు వైమానిక దాడుల ముప్పు ఎక్కువ ఉందని పేర్కొంటూ చైనా, మరింత నిటారుగా ఉన్న ఖుంజేరబ్ కనుమను సిఫారసు చేసింది. [1]
ఈ కనుమ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు లోని నేషనల్ పార్క్ స్టేషన్ నుండి, దీహ్ లోని చెక్ పాయింట్ నుండీ 42 కి.మీ. దూరం లోను, సోస్త్ లోని కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ పోస్ట్ నుండి 75 కి.మీ. దూరం లోనూ, గిల్గిట్ నుండి 270 కి.మీ. దూరం లోనూ, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదు నుండి 870 కి.మీ. దూరం లోనూ ఉంది.
చైనా వైపు ఈ కనుమ, చైనా నేషనల్ హైవే 314 (జి 314 ) కు నైరుతి టెర్మినస్. ఇది తాష్కుర్గాన్ నుండి 130 కి.మీ., కష్గర్ నుండి 420 కి.మీ., ఉరుమ్కి నుండి 1,890 కి.మీ. ఉంటుంది. కనుమ నుండి 3.5 కి.మీ. దూరంలో, తాష్కుర్గాన్ కౌంటీలో చైనా దేశపు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంది
ఈ పొడవైన, చదునైన కనుమ దారి శీతాకాలంలో ఎక్కువగా మంచుతో కప్పడిపోయి ఉంటుంది [2] అందుచేత ఈ కనుమను, నవంబర్ 30 నుండి మే 1 వరకూ భారీ వాహనాలకూ, డిసెంబరు 30 నుండి ఏప్రిల్ 1 వరకు అన్ని రకాల వాహనాలకూ మూసివేస్తారు. [3]
పునర్నిర్మించిన కారకోరం హైవే ఖుంజేరబ్ కనుమ గుండా వెళుతుంది.
2006 జూన్ 1 నుండి, గిల్గిట్ నుండి జిన్జియాంగ్లోని కష్గర్ వరకు సరిహద్దు మీదుగా రోజువారీ బస్సు సర్వీసు నడుపుతున్నారు. [4]
ఈ కనుమ వద్ద ట్రాఫిక్ ఎడమ వైపు (పాకిస్తాన్-పరిపాలన గిల్గిట్-బాల్టిస్తాన్) నుండి కుడి వైపుకు (చైనా) మారుతుంది. ఇలాంటి కొద్ది అంతర్జాతీయ సరిహద్దులలో ఇది ఒకటి.
ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉన్న ఎటిఎం
మార్చుప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఎటిఎం ఈ కనుమ వద్ద పాకిస్తాన్ వైపున ఉంది. దీనిని నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, 1LINK లు నిర్వహిస్తున్నాయి. . [5]
రైల్వే
మార్చు2007 లో, పాకిస్తాన్ పాలిత గిల్గిట్-బాల్టిస్తాన్‌ను చైనాతో అనుసంధానించేలా, ఈ కనుమ ద్వారా రైలుమార్గ నిర్మాణాన్ని అంచనా వేయడానికి కన్సల్టెంట్లను [6] నియమించారు. పాకిస్తాన్ లోని హవేలియన్ (కనుమ నుండి750 కి.మీ.) ను చైనా వైపున జిన్జియాంగ్ లోని కష్గర్ (కనుమ నుండి 350 కి.మీ.) తో అనుసంధానించే మార్గం కోసం 2009 నవంబరులో సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రారంభమైంది. [7] అయితే, ఆ తరువాత ఈ పనిలో ఎటువంటి పురోగతి జరగలేదు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత సిపిఇసి ప్రణాళికలో భాగం కాదు.
గ్యాలరీ
మార్చు-
ఖుంజేరబ్ కనుమ వద్ద చైనా, పాక్ ఆక్రమిత కాశ్మీరు ల వద్ద సరిహద్దు రహదారి
-
ఖుంజేరబ్ కనుమ వద్ద రహదారి, మరో దృశ్యం
-
ఖుంజేరబ్ కనుమ దారి
-
ఖుంజేరబ్ కనుమ
-
సరిహద్దు సమీపంలో చైనా పాకిస్తాన్ల మైత్రీ చిహ్నం
మూలాలు
మార్చు- ↑ 刘欣 (2013-05-03). "重寻玄奘之路" [Rediscover the path taken by Xuanzang] (in చైనీస్). 东方早报. Retrieved 2017-02-02.
1966年,时任新疆军区副司令员的张希钦在主持修筑中巴公路时,为避敌国空袭,放弃了巴方主张的走宽阔的明铁盖达坂的方案,而取道地势高峻的红其拉甫山口。
- ↑ "Archived copy". Archived from the original on 2016-08-07. Retrieved 2016-06-11.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Khunjerab Pass". www.dangerousroads.org. Retrieved 2016-09-18.
- ↑ Road widening work has begun on 600 కి.మీ. (370 మై.) of the highway.
- ↑ World's Highest ATM Atlas Obscura (www.atlasobscura.com). Retrieved on 2019-07-26.
- ↑ "Online Asia Times South Asia Feb 24, 2007. "China-Pakistan rail link on horizon." Syed Fazl-e-Haider". Archived from the original on 2011-05-22. Retrieved 2020-10-05.
- ↑ http://www.fallingrain.com/world/CH/13/Kashi.html