ఖైదీ నెం. 786

(ఖైదీ నెంబరు.786 నుండి దారిమార్పు చెందింది)

ఖైదీ నెం. 786 విజయ బాపినీడు దర్శకత్వంలో 1988లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, స్మిత, భానుప్రియ ముఖ్యపాత్రలు పోషించారు. రాజ్ - కోటి సంగీతం అందించారు. ఈ సినిమాను మాగంటి రవీంద్రనాథ్ చౌదరి శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసింది.[1]

ఖైదీ నెం. 786
దర్శకత్వంవిజయ బాపినీడు
నిర్మాతమాగంటి రవీంద్రనాథ్ చౌదరి
తారాగణంచిరంజీవి,
స్మిత,
భానుప్రియ
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుగీతా ఆర్ట్స్
విడుదల తేదీ
జూన్ 10, 1988 (1988-06-10)
భాషతెలుగు

గోపి గ్రామంలో సంగీతం నేర్చుకుంటూ పెరుగుతాడు. పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకుంటాడు. అదే ఊర్లో ధనవంతుడైన సూర్యచంద్రరావు కి రాధ అనే ఒక కూతురు ఉంటుంది. ఆమెకు ధనగర్వం, అహంకారం. ఆమె ఒకసారి గోపీతో గొడవపడి అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. గోపీ దగ్గర శిష్యురాలిగా చేరి సంగీతం నేర్చుకున్నట్లు నటించి చివరికి అతను తన మీద అత్యాచారం చేయబోయాడని నిందలు వేస్తుంది. దీనికి అసిరయ్య అనే పోలీసు ఎస్. ఐ సహాయపడతాడు. కానీ తర్వాత గోపీ మంచి మనసు తెలుసుకుని అతనితో ప్రేమలో పడుతుంది. గోపీ మొదట్లో ఆమెను క్షమించలేకపోయినా ఆమె ప్రేమలో నిజాయితీని చూసి ఒప్పుకుని పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమె తండ్రి సూర్యచంద్రరావు మాత్రం గోపి మీద కోపం పెంచుకుని అతన్ని చంపడానికి రౌడీని పంపుతాడు. అతన్ని చితక్కొట్టి సూర్యచంద్రరావు ఇంట్లో పడేయిస్తాడు గోపి. సూర్యచంద్రరావు రౌడీని హత్యచేసి ఆ నేరం గోపీ మీద వేసి జైలుకి పంపిస్తాడు. గోపీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని నేరస్థులను చట్టానికి పట్టించడం మిగతా కథ.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు.

  • గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, రచన: భువన చంద్ర ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • గుండమ్మో, బండి దిగి రావమ్మో, రచన: భువన చంద్ర గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • అటు అమలాపురం, రచన: భువన చంద్ర, గానం. ఎస్ జానకి
  • రైటో అటో ఇటో , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • చలిగాలి కొట్టిందమ్మ , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

ఇవి కూడా చూడండి

మార్చు

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

మూలాలు

మార్చు
  1. "Khaidhi No 786 (1988)". Indiancine.ma. Retrieved 2021-05-23.