చిరంజీవి

తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు


చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా [1].

చిరంజీవి
Chiranjeevi at Amitabh Bachchan's 70th birthday celebration (cropped).jpg

చిరంజీవి

జననం కొణిదెల శివశంకర వరప్రసాద్
1955, ఆగష్టు 22
భారత దేశం మొగల్తూరు,ఆంధ్ర ప్రదేశ్
బిరుదు(లు) పద్మభూషణ్
మెగాస్టార్
వేరేపేరు(లు) చిరు
వృత్తి సినిమా నటుడు
నిర్మాత
రాజకీయ నాయకుడు
ముఖ్య_కాలం 1977 నుండి (నటుడిగా)
2008 నుండి (రాజకీయ నాయకుడిగా)
భార్య / భర్త(లు) సురేఖ

కుటుంబంసవరించు

ఆగష్టు 22, 1955పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కథానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మాణం 2007లో "చిరుత"తో ప్రారంభమైంది. ఈ సినిమా సెప్టెంబరు 28న విడుదలైంది. రామ్ చరణ్ రెండవ సినిమా మగధీర. ఈ సినిమా జూలై 31న విడుదలై 301 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తెలుగు చలన చిత్ర రంగం లోనే అతి పెద్ద విజయం అనే రికార్డును నెలకొల్పినది. చిరంజీవి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.దాని పేరు ప్రజారాజ్యం. ఇది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

చలనచిత్ర ప్రస్థానంసవరించు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి.

 
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలు

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.

ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు.

 
2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి. పోస్టర్లు వెలిశాయి.

మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలన అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.మళ్ళీ పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150, 2017 జనవరి 11 న విడుదల అయ్యి చిరు రీ ఎంట్రీ ఘనం గా సాగింది..ఆ సినిమా లో చిరు చాలా చలాకీగా నటించాడు,బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా తగ్గలేదని నిరూపించాడు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

ఇతర భాషలుసవరించు

 
"దొంగ" చిత్రంలో megastar
 
"థ్రిల్లర్" విడియోలో మైకేల్ జాక్సన్

ఇటు తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, హిందీలలో కూడా చిరంజీవి ప్రసిధ్ధుడు.

కొదమ సింహం చిత్రం ఆంగ్లంలో తీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా, మెక్సికొ, ఇరాన్, ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది.

ప్రత్యేకతలుసవరించు

 • శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోతారు. శివుడు శివుడు శివుడు, ఆపద్భాందవుడు, మంజునాథ చిత్రాలలో చిరంజీవిని శివుడుగా చూడొచ్చు.
 • నాట్యానికి చిరంజీవి పెట్టింది పేరు. నాట్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చలన చిత్ర రంగంలో ఒక నూతన శకానికి తెర తీశాడనటంలో అతిశయోక్తి లేదు.
 • ప్రారంభ దశలో సహ నటుడు గా, నెగటివ్ పాత్ర లతో, విలన్ గా, కొంత నిలదొక్కుకున్న తర్వాత కుటుంబ చిత్రాల పాత్రలతో, రౌద్రం, ప్రతాపం ఉట్టిపడే పాత్రలతో, పిమ్మట అడపాదడపా హాస్య భరిత చిత్రాలతో, అటు సాంఘిక, ఇటు పౌరాణిక పాత్రలతో నటుడుగా చిరంజీవి పరిపూర్ణతని సంతరించుకొన్నాడు.
 • తన కన్నడ అభిమానులను ఉత్తేజ పరచటానికి చిరు కొండకచో చిన్న చిన్న కన్నడ పదాలని ఉచ్ఛరిస్తూ ఉంటాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి లో, జూదగాడి (తనికెళ్ళ భరణి) చేతిలో మోసపోయిన "గుండప్ప" అనే కన్నడిగ పాత్రకి అదే జూదంలో తిరిగి డబ్బుని సంపాదించి అతనికి మేలు చేస్తాడు. అతనితో "బన్నిరి సార్, బన్నిరి" (రండి సార్, రండి) అంటాడు. శంకర్ దాదా MBBSలో ఒక పాటలో కన్నడిగ యువతి "నిన్న హెసరేనప్పా?" (నీ పేరేంటయ్యా?) అని అడిగిన ప్రశ్నకి "నన్న హెసరా? శంకర్ దాదా MBBS" (నా పేరా? శంకర్ దాదా MBBS) అని జవాబిస్తాడు. శంకర్ దాదా జిందాబాద్ లో ఒక పాటలో "స్టార్ట్ మాడిత్తిని, కేళిత్తియా?" (స్టార్ట్ చేస్తాను, వింటావా?) అని అంటాడు. బళ్ళారిలో చిరుకు విపరీతమయిన జనాదరణ ఉంది అని ఒక వినికిడి.
 • రఫ్ ఆడించేస్తా, బాక్సు బద్దలౌద్ది, అంతొద్దు, ఇది చాలు వంటి ఇతని సినిమాల్లో సంభాషణలని తెలుగు ప్రజలు రోజూవారీ సంభాషణలుగా వాడటం, సమాజం పై చిరు చూపించిన ప్రభావానికి నిదర్శనం.
 • చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు.ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు.
 • చిరు గుర్రపు స్వారీ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక చేత్తో మాత్రమే కళ్ళాన్ని పట్టుకొని, మరొక చేయిని గాలిలో వదిలేసి, గుర్రం పైన పూర్తిగా కూర్చోకుండా కొద్దిగా నిలబడి చిరు చేసే స్వారీ కంటికి ఇంపుగా ఉంటుంది. అంజి, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి చిత్రాల్లో ఈ శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

సేవా కార్యక్రమాలుసవరించు

 
హైదరాబాదు‌లో చిరంజీవి రక్త, నేత్రనిధి ప్రధాన కార్యాలయం

చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి.[2]. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా .[3]. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

సత్కారాలుసవరించు

పురస్కారం పేరు బహుకరించింది సంవత్సరం ఇతర వివరాలు
పద్మభూషణ్[4] 2006 జనవరి,2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి పద్మభూషణ్ పురస్కారం స్వీకరణ[4]
డాక్టరేట్ 2006 నవంబరు 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు[5] ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ నుండి[5]

నటించిన సినిమాలుసవరించు

రాజకీయ చరిత్రసవరించు

చిరంజీవి క్రొత్తగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 2008 ఆగస్టు 26 న (మదర్ థెరిసా జన్మదినం) తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. ప్రస్తుతానికి సినిమాలు తీసే ఆలోచనలు ప్రక్కన

పెట్టినట్లు ప్రకటించారు. 2011, ఫిబ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు.

చిరంజీవి చిత్రాలుసవరించు

1979-పునాది రాళ్ళు

1980 -పున్నమి నాగు

1982-శుభలేఖ

1983-అభిలాష

1983-ఖైది

1984-చాలెంజ్

1985-విజేత

1986-చంటబ్బాయి

1987-దొంగమొగుడు

1987-పసవాడి ప్రాణం

1987-స్వయం కృషి

1988-రుద్రవీణ

1988- యముడికి మొగుడు

1989-అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

1990-కొండవీటి దొంగ

1990-జగదేక వీరుడు అతిలోక సుందరి

1991-రౌడి అల్లుడు

1991-గ్యాంగ్ లీడర్

1992-ఘరానా మొగుడు

1992-ఆపద్బాంధవుడు

1993-ముఠామేస్త్రి

1997-హిట్ల్లర్

1998-చూడాలని వుంది

1999-స్నేహం కోసం

2000-అన్నయ్య

2001-daddy

2001-మృగరాజు

2002-ఇంద్ర

2003-ఠాగూర్

2004-అంజి

2004-శంకేర్ దాదా MBBS

2006:స్టాలిన్

2005-అందరివాడు

2005-జై చిరంజీవా

2007-శంకర్ దాదా జిందాబాద్

2017-ఖైది నెంబర్ 150

2018-సైరా నరసింహా రెడ్డి

మూలాలుసవరించు

 1. Devotion and Defiance in Fan Activity - S.V.Srinivas http://apache.cscsarchive.org/Hongkong_Action/docs/devotion_defiance.pdf Archived 2007-03-12 at the Wayback Machine.
 2. "idlebrain.com". A Notable Deed by Megastar. Retrieved 3 November. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate= (help)
 3. "idlebrain.com". Chiranjeevi Charitable Trust. Retrieved 3 December. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate= (help)
 4. 4.0 4.1 ద హిందూ దిన పత్రిక:అధికారిక వెబ్సైటు నుండి53 receive Padma awards from President[permanent dead link] ఫోటోతో వార్తా కథనం జులై 14, 2008న సేకరించబడినది.
 5. 5.0 5.1 ద హిందూ దిన పత్రిక:అధికారిక వెబ్సైటు నుండిAU confers honorary degrees on Chiru, others[permanent dead link] ఫోటోతో వార్తా కథనం జులై 14, 2008న సేకరించబడినది.

బయటి లింకులుసవరించు


"https://te.wikipedia.org/w/index.php?title=చిరంజీవి&oldid=2880568" నుండి వెలికితీశారు