ఖైబర్ కనుమ

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య నున్న పర్వత కనుమ

ఖైబర్ పాస్ (ఎత్తు: 1,070 మీ. or 3,510 అ.) అన్నది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల నడుమ స్పిన్ ఘర్ పర్వతాల వాయువ్య ప్రదేశంలో ఏర్పడిన పర్వత మార్గం. ప్రాచీన సిల్క్ రోడ్డులో అత్యంత ప్రధానమైన భాగం, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన మార్గాల్లో ఒకటిగా పేరొందింది. చరిత్ర పొడవునా మధ్య ఆసియా, భారత ఉపఖండాల నడుమ అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గం, వ్యూహాత్మకమైన సైనిక స్థానం. పాకిస్తాన్లోని లాండి కోటాల్ నుంచి ఈమార్గం దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఖైబర్ పాస్ ఆసియన్ హైవే 1లో భాగం. ఖైబర్ అన్న హిబ్రూ పదానికి కోట అని అర్థం.

చరిత్ర

మార్చు
 
1895లో ఖైబర్ పాస్ పొడవునా క్యాంప్ బెల్ పూర్ వద్ద ఏనుగుల వరుసపై సైన్యం

ఈ ప్రాంతంలోని ప్రఖ్యాతమైన దండయాత్రలు ప్రధానంగా ఖైబర్ పాస్ గుండానే సాగాయి, వాటిలో డారియస్, అలెగ్జాండర్, ఛెంఘిజ్ ఖాన్, దువా, ఖుత్లుగ్ ఖ్వాజా, కెబెక్ వంటి మొఘలులు చేసిన దండయాత్రలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంపై జరిగిన ముస్లిం దండయాత్రల్లో ప్రధానంగా ఖైబర్ పాస్ మీదనుంచే సాగాయి, వారిలో ప్రఖ్యాత దండయాత్రికుల్లో మహమ్మద్ ఘజనీ, ఆఫ్ఘాన్ మహమ్మద్ ఘోరీ, టర్కిక్-మంగోలులు ఉన్నారు.

తుదకు 1834లో రంజిత్ సింగ్ నాయకత్వంలో సిక్ఖులు ఖైబర్ పాస్ ను స్వాధీనపరుచుకున్నారు, అయితే వజీర్ అక్బర్ ఖాన్ బలగాలు వారిని ఓడించి 1837లో మళ్ళీ ఖైబర్ పాస్ ను ఆక్రమించాయి. ఖైబర్ పాస్ రక్షణ బాధ్యతలు సంవత్సరాలుగా వహించిన సిక్ఖు సైన్యాధ్యక్షుడు హరి సింగ్ నల్వా ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నాళ్ళ పాటో ఇంటింటి పేరుగా నిలిచింది.[1][2]

మూలాలు

మార్చు