ఖ్లెహ్రియత్
ఖ్లెహ్రియత్, మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ జిల్లా జైంతియా హిల్స్ జిల్లా నుండి ఏర్పాటు చేయబడింది.
ఖ్లెహ్రియత్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°21′32″N 92°22′01″E / 25.359°N 92.367°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | తూర్పు జైంతియా హిల్స్ |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 793200 |
Vehicle registration | ఎంఎల్ - 11 |
వాతావరణం | Cwa |
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఖ్లెహ్రియత్ పట్టణంలో 327 జనాభా ఉంది. ఈ జనాభాలో 146 మంది పురుషులు, 181 మంది స్త్రీలు ఉన్నారు.పట్టణ పరిధిలో మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 108 (33.03%) మంది ఉన్నారు. ఖ్లెహ్రియాత్ అక్షరాస్యత రేటు 19.63% కాగా, రాష్ట్ర అక్షరాస్యత 74.43% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 14.71% కాగా, మహిళా అక్షరాస్యత 23.93% గా ఉంది.[1]
విభాగాలు
మార్చుఈ జిల్లాలో ఖ్లెహ్రియత్, సైపుంగ్ అనే రెండు కమ్యూనిటీ, గ్రామీణాభివృద్ధి విభాగాలు ఉన్నాయి.
ఇతర వివరాలు
మార్చుఖ్లైహ్రియాత్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు, చాలా చర్చిలు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్, ఎద్దుల పోటీలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.
వాతావరణం
మార్చుఏడాది పొడవునా ఖ్లైహ్రియాట్ చాలా చల్లగా ఉంటుంది, వర్షాకాలంలో ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.[2]
మూలాలు
మార్చు- ↑ "Khliehriat Village Population - Thadlaskein - Jaintia Hills, Meghalaya". www.census2011.co.in. Retrieved 2021-01-02.
- ↑ "Meghalaya State Portal". meghalaya.gov.in. Archived from the original on 2020-07-17. Retrieved 2021-01-02.