గంగోం బాలా దేవీ. భారతీయ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణి. ఆమె ప్రస్తుతం స్కాటిష్ విమెన్స్ ప్రీమియర్ లీగ్ క్లబ్, రేంజర్స్ ఎఫ్.సి లతో సహా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రేంజర్స్ ఎఫ్.సి.తో 2020లో ఒప్పందం కుదర్చుకోవడం ద్వారా ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.[1]

గంగోం బాలా దేవీ
వ్యక్తిగత సమాచారం
జననం2 ఫిబ్రవరి 1990
మణిపూర్, భారత దేశం
క్రీడ
స్థానంస్ట్రైకర్
జట్టురేంజర్స్
గంగోం బాలా దేవీ

వ్యక్తిగత జీవితం, నేపథ్యం

మార్చు

ఆమె 1990, ఫిబ్రవరి 2 న భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జన్మించింది. ఆ ప్రాంతంలో ఫుట్ బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఆ రాష్ట్ర జట్టు ఆడిన 25 మ్యాచ్‌లలో 20 ఛాంపియన్ షిప్‌లను కైవసం చేసుకుంది.

బాలా దేవికి ఫుట్ బాల్ పట్ల మక్కువ వారసత్వంగా వచ్చిందని చెప్పవచ్చు. అందుకే చిన్నప్పుడే ఫుట్ బాల్ ఆడటం మొదలు పెట్టింది.  ఆమె తండ్రికి ఫుట్ బాల్ ఆడటం అభిరుచిగా ఉండేది. అతనితో పాటు బాలా దేవి అన్నయ్య, ఆమె కవల సోదరి కూడా ఫుట్‌బాల్ ఆడేవారు.[2] అయితే ఆమె కుటుంబంలో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్రీడాకారిణిగా ఎదిగింది బాలాదేవి మాత్రమే. ఆమెకు ఫుట్ బాల్‌తో పాటు టెన్నిస్, హ్యాండ్ బాల్ క్రీడల్లో కూడా ప్రవేశం ఉంది.

ఆమె తన 11 ఏళ్ల వయసులోనే స్థానిక ఫుట్ బాల్ క్లబ్ ఐసీఎస్ఎలో చేరింది. దీంతో ఆమె జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం చిక్కింది. ఆమె చిన్నతనంలో బ్రెజిల్ ఫుట్ బాల్ క్రీడాకారులూ రొనాల్డో, రొనాల్డీనో అంటే ఎక్కువగా ఇష్టబడేది. అమెరికా మహిళా జాతీయ  జట్టు కో కెప్టెన్, మిడ్ ఫీల్డర్ అయిన మెగన్ రెపినో ప్రస్తుతం  ఆమెకు మార్గదర్శి. ఇక పురుషుల విషయానికి వస్తే పోర్చుగీస్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఆమె ఫేవరెట్ క్రీడాకారుడు.[1]

ఒక మహిళాగా క్రీడల్లో రాణించేందుకు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందో బాలాదేవీ తరచుగా తన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చేది. మొదట్లో కేవలం తన కుటుంబం నుంచి మాత్రమే మద్దతు లభించేందని, పురుషాధిక్యం గల ఫుట్ బాల్ ఆటలో రాణించేందుకు యుద్ధాలు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పేది.  మొదట్లో అబ్బాయిలతో కలిసి ఆమె ఆడటం ప్రారంభించింది. అయితే విమెన్స్ లీగ్ ప్రారంభమైన తర్వాత దేశంలో పరిస్థితి మెరుగుపడిందన్నది ఆమె భావన.[2]

వృత్తిపరంగా విజయాలు

మార్చు

బాలాదేవి 2005లో భారత జట్టులో భాగమయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 15 ఏళ్లు.[2] ఐదేళ్ల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె దేశంలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్ బాల్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. గత దశా బ్ద కాలంలో 58 మ్యాచ్‌లు ఆడిన ఆమె 52 గోల్స్ చేసింది.  దేశీయ మ్యాచ్‌లలో ఆమె 100కి పైగా గోల్స్ చేసింది. క్రీడల్లో సాధించిన విజయంతో 2010లో ఆమెకు మణిపూర్ పోలీస్ విభాగంలో ఉద్యోగం లభించింది. ఇండియన్ విమెన్స్‌ లీగ్‌లో ఆమె మణిపూర్ పోలీస్ స్పోర్ట్స్ క్లబ్ సహా మూడు వేర్వేరు క్లబ్‌లకు ప్రాతినిద్యం వహిస్తున్నది. వరుసగా రెండు సీజన్లలో ఆమె టాప్ స్కోరర్‌గా నిలిచింది.  2015-16 సంవత్సరాలకు గానూ ఆల్ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆమెను విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. రేంజర్స్ ఎఫ్.సి. ఆమెకు అవకాశం కల్పించేనాటికి ఆమె మణిపూర్ పోలీస్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నది. 2020 జనవరిలో ఆ చారిత్రక ఒప్పందంపై ఆమె సంతకం చేసింది. వారు అందజేసిన నెంబర్ 10 జెర్శీని ఆమె ధరించింది. భారత జట్టు తరపున కూడా అదే నెంబర్ జెర్సీతో ఆమె ఆడటం విశేషం. బాలా దేవి కన్నా ముందు పేరొందిన గోల్ కీపర్ అదితి చౌహాన్ 2015లో వెస్ట్ హమ్ యునైటెడ్‌ తరపున ఆడారు. కానీ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. ఆ ఘనత కేవలం బాలాదేవీ మాత్రమే సాధించింది. బెంగళూరు ఫుట్ బాల్ క్లబ్ ద్వారా రేంజర్స్‌తో ఒప్పందానికి మార్గం సుగమమయ్యింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Bala Devi: The woman making Indian football history". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-02-06. Retrieved 2021-02-19.
  2. 2.0 2.1 2.2 McKeever, Vicky (2020-02-19). "How Ngangom Bala Devi became India's first professional female soccer player". CNBC (in ఇంగ్లీష్). Retrieved 2021-02-19.