గండీడ్ మండలం

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా లోని మండలం

గండీడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

గండీడ్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°55′25″N 77°48′19″E / 16.92361°N 77.80528°E / 16.92361; 77.80528
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా
మండల కేంద్రం గండీడ్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 227 km² (87.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 70,387
 - పురుషులు 35,062
 - స్త్రీలు 35,325
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.31%
 - పురుషులు 56.50%
 - స్త్రీలు 30.34%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 30 కి. మీ. దూరంలో వికారాబాదు జిల్లా, తాండూరు రోడ్డు మార్గంలో ఉంది. ఈ ఊరి పేరు మొదట్లో గండివీడు అని పిలిచేవారు. కాల క్రమంలో గండీడుగా మారింది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పరిగి రెవెన్యూ డివిజనులో ఉండేది.ఈ మండలం పునర్వ్యవస్థీకరణలో 28 రెవెన్యూ గ్రామాలతో మహబూబ్​నగర్​ జిల్లా, మహబూబ్​నగర్​ రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది. .2021 ఏప్రిల్ 24న ఈ మండలం నుండి 10 గ్రామాలు కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలంలో చేరినవి.అవిపోను ఈ మండలలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం గండీడ్

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 70,387. జనాభాలో పురుషులు 35,062 కాగా, స్త్రీల సంఖ్య 35,325. మండలంలో 13,985 గృహాలున్నాయి.[3]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 70,387 - పురుషులు 35,062 - స్త్రీలు 35,325,అక్షరాస్యత మొత్తం 43.31% - పురుషులు 56.50% - స్త్రీలు 30.34%

రంగారెడ్డి జిల్లా నుండి మహబూబ్​నగర్​ జిల్లాకు

మార్చు

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా, పరిగి రెవెన్యూ డివిజనులో ఉండేది.పునర్వ్యవస్థీకరణలో 28 గ్రామాలతో మహబూబ్​నగర్​ జిల్లా, మహబూబ్​నగర్​ రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది..2021 ఏప్రిల్ 24న ఈ మండలం నుండి 10 గ్రామాలు కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలంలో చేరినవి.

సమీప మండలాలు

మార్చు

ఈ గ్రామానికి చుట్టుప్రక్కల కుల్కచెర్ల మండలం, కోస్గి మండలం, హాంవాడ, దోమ మండలాలున్నాయి.

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. కప్లాపూర్
  2. వెన్నచేడ్
  3. జిన్నారం
  4. చెల్‌మిల్ల
  5. సాలార్‌నగర్
  6. పెద్దవర్వల్
  7. చిన్నవర్వల్
  8. రుసుంపల్లి
  9. గండీడ్
  10. బైస్‌పల్లి
  11. రెడ్డిపల్లి
  12. సల్కర్‌పేట్
  13. గొవిందపల్లి
  14. పగిడ్యాల్
  15. బల్సుల్గొండ
  16. కొండాపూర్
  17. మన్సూర్‌పల్లి
  18. కొంరెడ్డిపల్లి

కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలానికి తరలించిన గ్రామాలు

మార్చు

గతంలో ఈమండలంలో ఉన్న 10 గ్రామాలుతో మహమ్మదాబాద్ మండలం కొత్తగా ఏర్పడినందున దిగువ గ్రామాలు తరలించబడ్డాయి.[4]

  1. నంచెర్ల
  2. గాదిర్యాల్
  3. చౌదర్‌పల్లి
  4. మంగంపేట్
  5. ముకర్లాబాద్
  6. జూలపల్లి
  7. అన్నారెడ్డిపల్లి
  8. లింగయపల్లి
  9. మహమ్మదాబాద్
  10. సంగాయపల్లి

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2021-04-29.

వెలుపలి లంకెలు

మార్చు