మహమ్మదాబాద్ (మహబూబ్ నగర్ జిల్లా)
మొహమ్మదాబాద్, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ మండలం లోని గ్రామం.[1]
మొహమ్మదాబాద్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°52′29″N 77°53′32″E / 16.874600°N 77.892323°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండలం | మహమ్మదాబాద్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 12,454 |
- పురుషుల సంఖ్య | 6,231 |
- స్త్రీల సంఖ్య | 6,223 |
- గృహాల సంఖ్య | 2,647 |
పిన్ కోడ్ | Pin Code : 509337 |
ఎస్.టి.డి కోడ్ 08721 |
ఇది గండీడ్ నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం రంగారెడ్డి జిల్లా లోని గండీడ్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో ఇది, మండలంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా లోకి చేరింది. [2] ఆ తరువాత, 2021 ఏప్రిల్లో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన మహమ్మదాబాద్ మండలం లోకి చేర్చారు. [3][4]
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2647 ఇళ్లతో, 12454 జనాభాతో 4698 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6231, ఆడవారి సంఖ్య 6223. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1148 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1197. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574593[5].పిన్ కోడ్: 509337.
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11802. ఇందులో పురుషుల సంఖ్య 5870, మహిళలు 5932. ఎస్సీల సంఖ్య 1112, ఎస్టీల సంఖ్య 1148. గృహాలు 2177, విస్తీర్ణము 4698 హెక్టార్లు, ప్రజల భాష తెలుగు. మండలంలో ఈ గ్రామమే అత్యధిక జనాభా కల గ్రామం.
భౌగోళికం
మార్చుభౌగోళికంగా ఈ గ్రామం మండలంలో తూర్పు వైపున మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. వైశాల్యం పరంగా చూసిననూ ఈ గ్రామం మండలంలో పెద్దది. ఈ గ్రామానికి ఉత్తరాన, తూర్పున మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దు ఉండగా, పశ్చిమాన గండీడ్ మండలానికి చెందిన చౌదర్ పల్లి, మంగన్ పేట గ్రామం, దక్షిణాన లింగాయిపల్లి, సంగాయిపల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.
సమీపగ్రామాలు
మార్చుమంగంపేట్ 4 కి.మీ. చౌదర్ పల్లి 5 కి.మీ. నంచెర్ల 6 కి.మీ. కొంరెడ్డి పల్లి 9 కి.మీ. గండీడ్ 10 కి.మీ దూరంలో ఉన్నాయి.
ఉప గ్రామాలు
మార్చుబొమ్మకుంట తండ, కాంచన్ పల్లి, సంకేపల్లి తండ, ముందయ్ తండ, బండమీదిపల్లి, మతమారిపల్లి.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో చైతన్య విద్యానికేతన్ హై స్కూలు,జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి.[6] ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 14, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గండీడ్లోను, ఇంజనీరింగ్ కళాశాల మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ మహబూబ్ నగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నాన్చెర్లలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుమొహమ్మదాబాద్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రిలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుగ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుమొహమ్మదాబాద్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఇక్కడికి 10 కి.మీ దూరము లోపు రైలు వసతి లేదు. ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ కు, ఇతర ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి బస్సుల సౌకర్యమున్నది.మహబూబ్ నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు బస్సులు కూడా ఈ గ్రామం మీదుగానే వెళ్తాయి. ప్రధాన రహదారిపై ఉండటంతో బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ ఊరికి ప్రతి 10 నిమిషలకి ఒక బస్ సౌకర్యం ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.
ఏటీఎమ్, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
మార్చు- కమతం రాంరెడ్డి : మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.1938లో లక్ష్మారెడ్డి, రంగనాయకమ్మ దంపతులకు మొహ్మదాబాద్ గ్రామంలో జన్మించాడు. న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.[7] పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి 3సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి, ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశాడు.[8]
భూమి వినియోగం
మార్చుమొహమ్మదాబాద్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 2428 హెక్టార్లు
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 173 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 93 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 350 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 10 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 18 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 263 హెక్టార్లు
- బంజరు భూమి: 311 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1049 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1276 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 348 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుమొహమ్మదాబాద్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 348 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుమొహమ్మదాబాద్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుగ్రామ ప్రముఖులు
మార్చు- కమతం రాంరెడ్డి: మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.[9]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటు". Namasthe Telangana. 2021-04-24. Retrieved 2022-01-04.
- ↑ "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2022-01-04.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Gandeed/Mohammadabad
- ↑ "ముగిసిన 'కమతం' రాజకీయ శకం". Sakshi. 2020-12-06. Archived from the original on 2020-12-08. Retrieved 2021-01-31.
- ↑ ఈనాడు, తెలంగాణ (6 December 2020). "మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత". Archived from the original on 31 January 2021. Retrieved 31 January 2021.
- ↑ "ముగిసిన 'కమతం' రాజకీయ శకం". Sakshi. 2020-12-06. Archived from the original on 2020-12-08. Retrieved 2021-01-31.
వెలుపలి లింకులు
మార్చుఈ గ్రామం పూర్వ నామం కదనకల్ అదే కాలక్రమేనా మహమ్మదాబాద్ గా మార్పు చెందింది.