గజల్ శ్రీనివాస్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
గజల్ శ్రీనివాస్ గా పేరుగాంచిన కేశిరాజు శ్రీనివాస్ ప్రముఖ తెలుగు గజల్ గాయకుడు. గజల్ శ్రీనివాస్ 125 ప్రపంచ భాషలలో గాంధేయవాదం పై గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు, లిమ్కా రికార్డ్ నెలకొల్పాడు.
డా. కేసిరాజు శ్రీనివాస్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | కేసిరాజు శ్రీనివాస్ |
ఇతర పేర్లు | గజల్ శ్రీనివాస్ |
జననం | 1966 |
రంగం | గజల్ |
వృత్తి | singer, activist |
వాయిద్యాలు | వోకల్స్, తంబూర |
జీవిత భాగస్వామి | సురేఖ |
పిల్లలు | సంస్కృతి |
వెబ్సైటు | అధికారిక జాలస్థలం |
వ్యక్తిగత జీవితంసవరించు
శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలో పుట్టారు. అతని తండ్రి అదే జిల్లాలో పంచాయతీ అధికారిగా పనిచేశారు. శ్రీకాకుళాన్ని గిన్నీస్‌బుక్ రికార్డులో చూపిస్తానన్నారు. ప్రపంచ భాషల్లో గాంధేయవాదం, సత్యాగ్రహ సిద్ధాంతాలు, శాంతగీతాలాపనలు చేయడం ద్వారా బాపూజీ పట్ల అవగాహన, తనకు ప్రజాదరణ లభిస్తుందని చెప్పారు. 125 భాషల్లో పాడి రెండు ప్రపంచ గిన్నీసు రికార్డులు సాధించారు. ప్రపంచభాషల్లో శాంతి గీతాలు పాడడం వల్ల ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల వారు ఆహ్వానిస్తున్నారు. అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా ప్రపంచంలో మొత్తం 6 వేల కచేరీలు చేశారు.
శ్రీనివాస్ తల్లిదండ్రులు శ్రీమతి రత్నావళి, నరసింహరావు దంపతులు. ఇల్లాలు సురేఖ, ఏకైక పుత్రిక సంస్కృతి
గజల్ గీతాలతో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆయన హైదరాబాదులో సేవ్ టెంపుల్ కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదు చేయగా, పోలీసులు జనవరి 2వ తేదీ, 2018న అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. లైంగిక కార్యకలాపాల వీడియోలు లీకై తీవ్ర సంచలనం సృష్టించాయి.
ప్రదర్శనలుసవరించు
శ్రీనివాస్ అమెరికాలో అనేక సార్లు పర్యటించి తెలుగు తోరణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. తాను సుమారు 60 గజళ్లను రాశానని, సినారే, డాక్టర్ తాటపర్తి రాజగోపబాలం, రెంటాల వేంకటేశ్వరరావుల గజళ్లను గానం చేస్తుంటానని చెప్పారు. ఎవరైనా రచయితలు గజళ్లను రాస్తే పుస్తక ప్రచురణకు అయ్యే ఖర్చు తమ ట్రస్టు భరిస్తుందని తెలిపారు.
స్వచ్ఛంద సేవా సంస్థ.సవరించు
తాను పుట్టిన శ్రీకాకుళం జిల్లాలో గజల్ శ్రీనివాస్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా జిల్లాలో విస్తృతంగా వైద్యసేవలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రసిద్ధ గజల్ గాయకుడు శ్రీనివాస్ వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధ లాజరస్ ఆసుపత్రికి సాంస్కృతిక రాయబారిగా తాను ఉన్నందున ఇచ్ఛాపురం, కవిటి వంటి ప్రాంతాలను దత్తత తీసుకొని ప్రముఖ వైద్య నిపుణులతో సేవలందిస్తానని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడిన పలుగ్రామాలను దత్తత తీసుకొని వైద్యసేవలందిస్తున్న తెలిపారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలు తాము పుట్టిన గ్రామాలనయినా దత్తత తీసుకొని సేవలందించాలని, 'ఓనామాలు నేర్పిన నీ వీధిబడి కూలిపోతూ నీకు సెలవు అడగమంది..' 'ఆనవాలు పట్టలేని రాములోడి భజన గుడి' అని పాడి విన్పించారు.
బిరుదులుసవరించు
- గజల్ మాస్ట్రో
- గజల్ గానగంధర్వ
- గజల్ గానప్రపూర్ణ
- గజల్ గానవిశారద
- గజల్ గానచిరంజీవి
- గజల్ గానసమ్రాట్
- గజల్ గానవిభూషణ
- గజల్ మొఘల్
- గజల్ గాయకపాదుషా
- గజల్ గానబ్రహ్మ
- గజల్ స్వరభూషణ
- ప్రైడ్ ఆఫ్ ఇండియా
పురస్కారాలుసవరించు
- డా.బి.ఆర్.అంబేద్కర్ సేవాసమితి -డా.బి.ఆర్.అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం
- కళావేదిక, విశాఖపట్నం - ఉగాది పురస్కారం
- రోటరీ ఇన్టర్నేషనల్ - ఒకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం
- లయన్స్ ఇన్టర్నేషనల్ - ఒకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం
- జేసీస్ క్లబ్ - అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ పురస్కారం
- తెలుగు విజ్ఞానసమితి బెంగళూరు - తెలుగు విజ్ఞానసమితి పురస్కారం
- తెలుగు ఇన్టాక్ మలేషియా - మలేషియా ఉగాది పురస్కారం
- ఆస్ట్రేలియా సిడ్నీ తెలుగు అసోసియేషన్ - తెలుగు అసోసియేషన్ పురస్కారం
- యూరోపియన్ తెలుగు అసోసియేషన్ - ఈటా పురస్కారం
- తెలుగు కళాసమితి - అంతర్జాతీయ సద్భావనా పురస్కారం
విమర్శలుసవరించు
గజల్ గీతాలతో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆయన హైదరాబాదులో సేవ్ టెంపుల్ కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదు చేయగా, పోలీసులు జనవరి 2వ తేదీ, 2018న అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. లైంగిక కార్యకలాపాల వీడియోలు లీకై తీవ్ర సంచలనం సృష్టించాయి.[1]