గజల్

దక్షిణ ఆసియా, మధ్యప్రాచ్యాల్లో పలు భాషలలోని కవితా రీతి

గజల్ (ఆంగ్లం: Ghazal) ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ , కవితా రూపం.గజల్ అనగా 'స్త్రీ సంభాషణ', 'స్త్రీల సంభాషణ'. 'స్త్రీ సౌందర్యాన్ని' వర్ణించడానికి గజల్ వాడే వారు. గజల్ అనే పదం 'గజాల్' 'గజాల' నుండి ఆవిర్భవించింది (మూలం టర్కీ భాష), అర్థం 'జింక', 'జింక కనులు గల', 'మృగనయని'.పర్షియన్లు ఖసీదా ద్వారా దీన్ని వాడుకలోకి తెచ్చారు.10 వ శతాబ్దంలోఇరాన్ లో గజల్ ఆవిర్భావం జరిగింది.12 వ శతాబ్దంలోముస్లిం రాజుల ప్రాబల్యంలో, మొగలులు ఇరానీయుల ఆచారవ్యవహారాలతో పాటు గజల్ ను ఇరాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేశారు. అమిర్ ఖుస్రో ఉత్తరభారతంలో గజల్ ను ప్రారంభించాడని చెబుతారు కాని, నిజానికి గజల్ దక్కనులోనే మొదలయింది. గజల్లు పర్షియన్ భాషలో జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి (13వ శతాబ్దం), హాఫిజ్ (14 వ శతాబ్దం) , తుర్కీ కవి ఫుజూలి, భారత కవులు మిర్జా గాలిబ్ (1797-1869), ముహమ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ , ఉర్దూ భాషలలో గజల్ రచించారు.

మిర్జా గాలిబ్
జావేద్ అఖ్తర్

గజల్ రచనా సరళి

మార్చు

గజల్ లో కనీసం 5 షేర్లు లేదా అషార్ లు వుంటాయి. 7, 9, 11... అషార్ లూ వుండవచ్చు. ప్రతి షేర్ లో రెండు మిస్రాలు వుంటాయి.ప్రతి మిస్రా ఛందస్సు గల్గి వుంటుంది.గజల్ లో మొదటి షేర్ ను మత్ లా, ఆఖరి షేర్ ను మఖ్ తా అంటారు. మఖ్ తాలో కవి తన తఖల్లుస్ (కలం పేరు) ను ఉపయోగిస్తాడు.

ప్రముఖ గజల్ కవులు

మార్చు

వలీ దక్కని, సిరాజ్ ఔరంగాబాది, మీర్ తఖి మీర్, గాలిబ్, మీర్ దర్ద్, మోమిన్ ఖాన్ మోమిన్, ఇబ్రాహీం జౌఖ్, బహాదుర్ షా జఫర్, దాగ్ దెహల్వి, ఇక్బాల్, హస్రత్ మోహాని, జిగర్ మురాదాబాది, ఫిరాఖ్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, నాసిర్ కాజ్మి, అహ్మద్ ఫరాజ్, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖమర్ జలాలాబాది, మగ్దూం మొహియుద్దీన్, సాహిర్ లుధ్యానవి, నిదా ఫాజిలి, మునవ్వర్ రానా, ఖ్వాజా షౌఖ్ హైదరాబాది, జాలిబ్ కడపవి, సాఖి కడపవి, పర్వీన్ షాకిర్, కైఫి అజ్మి, డా. దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి, అద్దేపల్లి రామమోహనరావు, రసరాజు, రోచిష్మాన్, బిక్కికృష్ణ, విజయలక్ష్మి పండిట్, కోరుప్రోలు మాధవరావు,ఇరువింటి వెంకటేశ్వర శర్మ (ఇరువింటి శర్మ) ఉప్పలపాటి కుసుమ కుమారి.

గజల్ గాయకులు

మార్చు

బేగం అక్తర్, మెహ్ది హసన్, గులాం అలి, జగ్జీత్ సింగ్, పంకజ్ ఉధాస్, అహ్మద్ హుసేన్ , ఎహ్సాన్ హుసేన్, హరిహరన్, ఆషా భోంస్లే, ఫరీదా ఖానం, మహమ్మద్ రఫీ, మున్ని బేగం, పీనాజ్ మసాని, రేష్మా, తలత్ మెహమూద్, తలత్ అజీజ్, నూర్ జహాం, లతా మంగేష్కర్, కె.ఎల్. సైగల్ మొ.

తెలుగు గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్, గజల్ వాసుదేవ్, స్వరూపరాణి, డా.అద్దేపల్లి రామమోహనరావు.

"https://te.wikipedia.org/w/index.php?title=గజల్&oldid=3926207" నుండి వెలికితీశారు