గట్టెం వెంకటేష్

గట్టెం వెంకటేష్ సూక్ష్మ కళాకారుడు. ఇతడు పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల వంటి సూక్ష్మ వస్తువులపై కళాఖండాలను, పేర్లను చెక్కాడు.

గట్టెం వెంకటేష్
జననం (1996-05-28) 1996 మే 28 (వయసు 28)
పౌరసత్వంభారతీయుడు
విద్యబి.ఆర్క్.,
విద్యాసంస్థగీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, విశాఖపట్నం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సూక్ష్మ కళ
గుర్తించదగిన సేవలు
పంటిపుల్లపై ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, దారపు గొట్టాలతో ఈఫిల్ టవర్ నమూనాలు
తల్లిదండ్రులుసూరిబాబు, సత్యవతి
పురస్కారాలు100కు పైగా పురస్కారాలు

విశేషాలు

మార్చు

ఇతని స్వస్థలం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు. ఇతడు సూరిబాబు, సత్యవతి దంపతులకు 1996, మే 28న జన్మించాడు.[1] ఇతని తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం గౌతం మాడల్ స్కూలులో గడిచింది. 2019లో విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయంనుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో పట్టా పుచ్చుకున్నాడు. [2]

చిన్నతనంలోనే సూక్ష్మ కళపై ఆసక్తి పెంచుకున్న వెంకటేష్ పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా 400కిపైగా కళాకృతులను రూపొందించి 100కు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. [3]

ఇతడు న్యూయార్క్ నగరంలో ఉన్న ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ని పంటిపుల్ల(టూత్ పిక్)పై చెక్కాలని నిర్ణయించుకుని 6 ఏళ్ల పాటు క‌ష్టప‌డి ఎట్టకేల‌కు దాన్ని మ‌లిచాడు. 18 మిల్లీమీట‌ర్ల పొడ‌వైన అత్యంత సూక్ష్మమైన ఆకృతిలో ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ను పంటిపుల్లపై చెక్కాడు. ఈ సూక్ష్మ ఆకృతి వెంక‌టేష్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కించింది. 19 ఏళ్లవయసుకే ఇతడు ఈ రికార్డ్ సృష్టించడం విశేషం.

ఇతడు తన కళను ఇతరులకు నేర్పడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తుంటాడు. ఇప్పటి వరకు 80 పాఠశాలలో 15000 విద్యార్థులకు సూక్ష్మకళలో శిక్షణ ఇచ్చాడు. ఇతడు వ్యర్థపదార్థాలనుండి అలంకరణ వస్తువులను తయారు చేయడం కూడా నేర్పిస్తుంటాడు.

పురస్కారాలు

మార్చు
 • 2016లో స్కోర్‌మోర్ ఫౌండేషన్ వారిచే ప్రతిభా శిరోమణి పురస్కారం [4]
 • 2016లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ - 48 గంటలలో ఖాళీ దారపు రీళ్ళతో 90 సెం.మీ.ల ఈఫిల్ టవర్ ప్రతిమను తయారు చేసినందుకు [1]
 • 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ - పంటిపుల్లపై 18 మి.మీ.ల పరిమాణంలో న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నకలును చెక్కినందుకు[5][6]
 • 2018లో భారత జాతీయ యువ పురస్కార గ్రహీతల ఫెడరేషన్‌చే రాష్ట్రీయ గౌరవ్ సమ్మాన్
 • 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం
 • జర్మనీలోని ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్
 • 2019లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖచే జాతీయ యువ పురస్కారం [7]
 • వరల్డ్ రికార్డ్స్ ఇండియా - అగ్గిపుల్లపై సూక్ష్మశిల్పాన్ని చెక్కినందుకు [8]
 • యూనిక్ వరల్డ్ రికార్డ్ - కాగితపు పడవలతో అతి పెద్ద మొజాయిక్ చేసినందుకు [9]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "MINIATURE EIFFEL TOWER USING WASTE THREAD REEL". India Book of Records. 10 August 2013. Archived from the original on 26 ఆగస్టు 2019. Retrieved 26 August 2019.
 2. "Meet Gattem Venkatesh, a micro artist from AP, who carves intricate designs on soaps and even toothpicks". The New Indian Express. Archived from the original on 24 ఆగస్టు 2019. Retrieved 24 August 2019.
 3. విలేకరి (26 March 2019). "విశాఖపట్నం కుర్రోడు.. సూక్ష్మ కళలో నిష్ణాతుడు". సమయం దినపత్రిక. Retrieved 26 July 2020.
 4. విలేకరి (19 September 2016). "పలు రంగాల్లో ప్రసిద్ధులకు స్కోర్‌మోర్ పురస్కారాలు". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 26 July 2020.
 5. విలేకరి (10 June 2017). "గిన్నిస్ కెక్కిన చిన్నదొడ్డిగల్లు కుర్రాడు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 26 జూలై 2020. Retrieved 26 July 2020.
 6. Devalla, Rani (28 June 2017). "Miniature wonder fetches him place in Guinness Book of World Records". The Hindu. ISSN 0971-751X. Retrieved 27 August 2019.
 7. విలేకరి (13 August 2019). "జాతీయ యువజన అవార్డులు ప్రధానం". సాక్షి దినపత్రిక. Retrieved 26 July 2020.
 8. "MINIATURE MATCHSTICK CARVING". World Records India – First Indian World Record Book since 2015. Archived from the original on 27 ఆగస్టు 2019. Retrieved 27 August 2019.
 9. Limited, Unique World Records (25 December 2017). Unique World Records 2017: Unique World Records 2017 Digital Edition (in ఇంగ్లీష్). Symbion Books. ISBN 9788193394502.