1996
1996 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1993 1994 1995 1996 1997 1998 1999 |
దశాబ్దాలు: | 1970 1980లు 1990లు 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజనవరి
మార్చు- జనవరి 8: జైరేకు చెందిన విమానం కిన్షాసాలో కూలి 350 ప్రయాణీకుల మృతి.
- జనవరి 18 : నందమూరి తారక రామారావు - తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. 1996 జనవరి 18న హైదరాబాదులోని తన నివాసంలో 72 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు.
- జనవరి 23: జావా ప్రోగ్రామింగ్ భాష తొలి వెర్షన్ విడుదల చేశారు.
ఫిబ్రవరి
మార్చు- ఫిబ్రవరి 9: ఉనంబియం మూలకం కనుగొనబడింది.
- ఫిబ్రవరి 10: చదరంగం ఆడే కంప్యూటర్ డీప్ బ్లూ తొలిసారిగా ప్రపంచ చాంపియన్ గారీ కాస్పరోవ్‌ను ఓడించింది.
మార్చి
మార్చు- మార్చి 2: ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా జాన్ హొవార్డ్ ఎన్నికయ్యాడు.
- మార్చి 14: ఈజిప్టులో అంతర్జాతీయ శాంతి సదస్సు నిర్వహిమ్చబడింది.
- మార్చి 16: జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే తిరిగి ఎన్నికయ్యాడు.
- మార్చి 17: ప్రపంచ కప్ క్రికెట్‌ను శ్రీలంక క్రికెట్ జట్టు గెలిచింది.
మే
మార్చు- మే 16: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవిని చేపట్టినాడు.
- మే 21: ప్రయాణీకుల నౌక ఎం.వి.బుకోబా విక్టోరియా సరస్సులో మునిగి వెయ్యికి పైగా ప్రయాణీకుల మృతి.
- మే 30: ఇజ్రాయెల్ ఎన్నికలలో బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ స్వల్ప ఆధిక్యం సాధించింది.
- మే 31: 2002 ప్రపంచ కప్ సాకర్ నిర్వహణ బాధ్యతను తొలిసారిగా ఆసియా ఖండానికి అప్పగించాలని ఫిఫా నిర్ణయించింది. (జపాన్, దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహించడానికి వీలుగా).
జూన్
మార్చు- జూన్ 1: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ పదవిని అధిష్టించాడు.
- జూన్ 12: భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.యన్.సంగ్మా పదవిని స్వీకరించాడు.
- జూన్ 30: జర్మనీ చెక్ రిపబ్లిక్‌ను ఓడించి యూరోకప్ ఫుట్‌బాల్ సాధించింది.
జూలై
మార్చు- జూలై 3: రష్యా అధ్యక్షుడిగా బొరిక్ ఎల్సిన్ తిరిగి ఎన్నికయాడు.
- జూలై 5: తొలి క్లోనింగ్ గొర్రెపిల్ల డాలీ జన్మించింది.
- జూలై 19: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి.
సెప్టెంబర్
మార్చునవంబర్
మార్చు- నవంబర్ 5: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ రిపబ్లికన్ పార్టీకి చెందిన బాబ్ డోల్పై విజయం సాధించాడు.
- నవంబర్ 8: నైజీరియాకు చెందిన బోయింగ్ 727 అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి మొత్తం 141 ప్రయాణీకుల మృతి.
- నవంబర్ 12: సౌదీ అరేబియా విమానం బోయింగ్ 747 ప్రమాదంలో 349 ప్రయాణీకులు మృతి చెందారు.
- నవంబర్ 16: మదర్ థెరీసా అమెరికా గౌరవ పౌరసత్వం స్వీకరించింది.
- నవంబర్ 25: ఫిలిప్పీన్స్‌లో ఆసియా పసిఫిల్ ఆర్థిక సహకార కూటమి సదస్సు ప్రారంభమైంది.
డిసెంబర్
మార్చు- డిసెంబర్ 30: అసోంలో బోడో తీవ్రవాదులు ప్రయాణీకుల రైలులో బాంబు పేల్చడంతో 26 మంది మృతిచెందారు.
జననాలు
మార్చు- ఫిబ్రవరి 3: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.
- ఫిబ్రవరి 18: అనుపమ పరమేశ్వరన్ భారతీయ నటి. శతమానం భవతి ఫేమ్
- మే 28: గట్టెం వెంకటేష్, సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించిన తెలుగు యువకుడు.
- జూన్ 21: సూర్య సాయిరాం, భారత దేశానికి చెందిన తెలుగు పౌరుడు.
మరణాలు
మార్చు- జనవరి 8: ఫ్రాంకోయిస్ మిట్టరాండ్, ఫ్రాన్సు అధ్యక్షుడు (జ.1916)
- జనవరి 18: ఎన్.టి.రామారావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (జ.1923)
- ఫిబ్రవరి 1: ఆలపాటి రవీంద్రనాధ్, పత్రికా సంపాదకులు గాంధేయవాది. (జ.1922)
- ఫిబ్రవరి 9: వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (జ.1936)
- ఫిబ్రవరి 11: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922)
- మే 29: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)
- జూన్ 1: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి. (జ.1913)
- జూలై 3: రాజ్‌కుమార్, హిందీ సినీనటుడు (జ.1926)
- జూలై 3: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ లోక్‌సభ సభ్యులు. (జ.1922)
- జూలై 29: అరుణా అసఫ్ ఆలీ, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (జ.1909)
- ఆగష్టు 16: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (జ.1909)
- సెప్టెంబరు 6: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (జ.1926)
- సెప్టెంబరు 8: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (జ.1949)
- సెప్టెంబర్ 23: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)
- సెప్టెంబర్ 27: నజీబుల్లా, అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు .
- అక్టోబర్ 11: గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (జ.1909)
- అక్టోబర్ 21: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (జ.1915)
- అక్టోబర్ 22: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896)
- నవంబర్ 1: జయవర్థనే, శ్రీలంక మాజీ అధ్యక్షుడు.
- నవంబర్ 10: మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1926)
- నవంబర్ 21: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (జ.1926)
- డిసెంబర్ 2: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919)
- డిసెంబర్ 17: సూర్యకాంతం, ప్రసిద్ధ తెలుగు సినిమా నటి. (జ.1924)
- డిసెంబర్ 25: హరిత కౌర్ డియోల్, భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972)
పురస్కారాలు
మార్చునోబెల్ బహుమతులు
మార్చు- భౌతికశాస్త్రం: డేవిడ్ లీ, డగ్లస్ ఓషెరఫ్, రాబర్ట్ రిచర్డ్సన్.
- రసాయనశాస్త్రం: రాబర్ట్ కర్ల్, హరోల్డ్ క్రొటో, రిచర్డ్ స్మాలీ.
- వైద్యశాస్త్రం: పీటర్ డొహెర్తి, రాల్ఫ్ జింకర్‌నాజెల్.
- సాహిత్యం: విస్లావా జింబోర్స్కా.
- శాంతి: కార్లోస్ ఫెలిప్ జిమెనెస్ బెలో, జోస్ రామోస్ హోర్టా.
- ఆర్థికశాస్త్రం: జేమ్స్ మెర్లీస్, విలియం విక్రే.