గణపతి తనికైమోని
గణపతి తనికైమోని (1938 జనవరి 1 - 1986 సెప్టెంబరు 5) భారతీయ పాలినాలజిస్ట్. ఆయన తనికైమోనిగా సుపరిచితుడు.
గణపతి తనికైమోని | |
---|---|
జననం | 1938 జనవరి 1 మద్రాస్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1986 సెప్టెంబరు 5 | (వయసు 48)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | థని |
వృత్తి | వృక్షశాస్త్రజ్ఞుడు (Botanist) |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పాలినాలజీ (palynology) శాస్త్రానికి ఆయన చేసిన కృషి |
ప్రారంభ జీవితం
మార్చుమద్రాసులో 1938 జనవరి 1న జన్మించాడు. 1962లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్ష స్వరూప శాస్త్రవేత్త ప్రొఫెసర్ బి.జి.ఎల్ స్వామి ఆధ్వర్యంలో వృక్షశాస్త్రం (botany)లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నాడు.
అదే సమయంలో ఆయనకు సహజ శాస్త్రంలో ఫైసన్ ప్రైజ్ లభించింది, ఇది అత్యుత్తమ భారతీయ ప్రకృతి శాస్త్రవేత్తలకు కేటాయించబడింది.
1970లో మాంట్పెల్లియర్ విశ్వవిద్యాలయం ఆయనకి డాక్టరేట్ పట్టా ఇచ్చింది. ఆయన థీసిస్ పాల్మే (అరెకేసి) 800 జాతుల పుప్పొడి పదనిర్మాణం, వర్గీకరణ, ఫైలోజెని విషయంపై ఉంది.
మరణం
మార్చుఆయన యుఎస్‌కి ప్రయాణిస్తున్న పాన్ ఆమ్ ఫ్లైట్ 73 అనే విమానం 1986 సెప్టెంబరు 5న పాకిస్తాన్‌లోని కరాచీలో హైజాక్ కు గురియైంది. ఆ సమయంలో జరిగిన ఉగ్రదాడిలో ఆయన తలకు ప్రాణాంతక గాయాలయ్యాయి. పాకిస్తాన్ కమాండోలు విమానంలోకి చొరబడి ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రవాదులు తరలిస్తున్న గ్రెనేడ్, బుల్లెట్లు, ష్రాప్‌నెల్‌ల నుండి ఒక చిన్నారిని ఆయన కాపాడే ప్రయత్నంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
అమెరికాలోని మసాచుసెట్స్‌లోని వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో సెప్టెంబరు 6-12 తేదీలలో జరిగిన పాలియో-ఓషనోగ్రఫీపై యునెస్కో-ప్రాయోజిత రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో భాగంగా, సముద్ర పాలినాలజీపై సింపోజియంలో ఉపన్యాసం ఇవ్వడానికి ఆయన ఆహ్వానించబడ్డాడు.