మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల

చెన్నైలోని ఒక ఆర్ట్స్, సైన్స్, లా కళాశాల

13°03′36″N 80°16′56″E / 13.06007°N 80.28212°E / 13.06007; 80.28212

ప్రెసిడెన్సీ కళాశాల
మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల చిహ్నం
రకంప్రభుత్వ కళాశాల
స్థాపితం15 అక్టోబర్ 1840
స్థానంవాల్లజా రోడ్డు, చెపాక్, చెన్నై, భారతదేశం
అనుబంధాలుమద్రాసు విశ్వవిద్యాలయం
ప్రెసిడెన్సీ కళాశాల, చెన్నై

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక ఆర్ట్స్, సైన్స్, లా కళాశాల. ఇది 1840 అక్టోబర్ 15వ తేదీన ప్రెసిడెన్సీ ప్రిపరేటరీ స్కూలుగా ప్రారంభమై తరువాతి కాలంలో హైస్కూలుగా, కళాశాలగా ఉన్నతీకరించబడింది. ఈ కళాశాల భారతదేశంలోని పురాతన ప్రభుత్వ కళాశాలలో ఒకటి. ఇది బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పిన రెండు ప్రెసిడెన్సీ కళాశాలలో ఒకటి. రెండవది కోల్‌కాతా లోని ప్రెసిడెన్సీ కళాశాల.

చరిత్ర

మార్చు

1836లో సర్ థామస్ మన్రో ఆదేశాల మేరకు ప్రజా బోధన కమిటీ ఏర్పడింది. 1836లో ఈ కమిటీ విధులను "దేశీయ విద్యా కమిటీ" స్వీకరించింది. ఈ కమిటీ ఆనాటి మద్రాసు గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్‌స్టోన్‌కు 19 తీర్మానాలను సిఫార్సు చేయగా వాటిని ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకుంది.[1]

ఎల్ఫిన్‌స్టోన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో గణితశాస్త్ర ప్రొఫెసర్ అయిన ఇ.బి.పావెల్‌ను ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేశాడు. పావెల్ దీనికి అంగీకరించి 1840 సెప్టెంబర్ 20న ముంబాయి చేరుకున్నాడు కానీ 24 నవంబరు వరకు మద్రాసు చేరుకోలేక పోయాడు. ఈలోగా కమిటీ కోల్‌కాతా హుగ్లీ కాలేజీ నుండి కూపర్‌ను నెలకు 400 రూపాయల వేతనంపై తాత్కాలికంగా ప్రిన్సిపాల్ పదవిని నిర్వహించవలసిందిగా ఆహ్వానించింది. అతడు దానికి అంగీకరించి చెన్నై వచ్చి 1840 అక్టోబర్ 15న ఎగ్మోర్‌లో ఎడిన్‌బరో హోం అనే అద్దె ఇంట్లో ప్రెసిడెన్సీ ప్రిపరేటరీ స్కూల్‌ను ప్రారంభించాడు. కూపర్ ప్రిపరేటరీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా కొద్ది నెలలు మాత్రం పనిచేసి ఇ.బి.పావెల్ వచ్చిన తరువాత కోల్‌కాతా తిరిగి వెళ్లిపోయాడు. ఏప్రిల్ 1841లో హైస్కూల్ ప్రారంభించబడింది. తరువాత ఇది 1841లో బ్రాడ్వేకు మార్చబడింది. [1]

ఈ పాఠశాలలు క్రమంగా ప్రెసిడెన్సీ కళాశాలగా ఎదిగింది. 1857లో మద్రాసు విశ్వవిద్యాలయం ఆరంభమైనప్పుడు ఈ కళాశాల దానికి అనుబంధ కళాశాలగా మారింది.[1]

1870లో ఈ కళాశాల ప్రస్తుతం వున్న ప్రాంతానికి అనగా మెరీనా బీచ్ ఎదురుగా కామరాజ్ సాలైకు మార్చబడింది.

కోర్సులు

మార్చు
 
ప్రెసిడెన్సీ కళాశాల మరో దృశ్యం

డిగ్రీ కోర్సులు

మార్చు
కళలు
  • చరిత్ర [ఇంగ్లీషు, తమిళం]
  • రాజకీయ శాస్త్రం [ఇంగ్లీషు, తమిళం]
  • ఆర్థిక శాస్త్రం [ఇంగ్లీషు, తమిళం]
  • ఆంగ్ల సాహిత్యం [ఇంగ్లీషు]
  • తమిళ సాహిత్యం [తమిళం]
  • తెలుగు సాహిత్యం [తెలుగు]
  • హిందీ సాహిత్యం [హిందీ]
  • మలయాళ సాహిత్యం [మలయాళం]
  • ఉర్దూ సాహిత్యం [ఉర్దూ]
శాస్త్రాలు
  • గణితం [ఇంగ్లీషు, తమిళం]
  • గణాంకశాస్త్రం [ఇంగ్లీషు]
  • భౌతికశాస్త్రం [ఇంగ్లీషు, తమిళం]
  • రసాయనశాస్త్రం [ఇంగ్లీషు, తమిళం]
  • వృక్షశాస్త్రం [ఇంగ్లీషు, తమిళం]
  • జంతుశాస్త్రం [ఇంగ్లీషు, తమిళం]
  • భూవిజ్ఞానశాస్త్రం [ఇంగ్లీషు]
  • భూగోళశాస్త్రం [ఇంగ్లీషు]
  • మనస్తత్వశాస్త్రం [ఇంగ్లీషు]
వాణిజ్యం
  • కార్పొరేట్ సెక్రెటరీ షిప్ [ఇంగ్లీషు]

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు

మార్చు
కళలు

చరిత్ర, రాజకీయశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థికశాస్త్రం, తమిళం, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం.

శాస్త్రాలు

కంప్యూటర్ సైన్స్, గణితం, గణాంకశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రం, భూగోళశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, అప్లైడ్ మైక్రోబయాలజీ

ఫిలాసఫీ

ఇంగ్లీషు, చరిత్ర, రాజకీయశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక శాస్త్రం, తమిళం, తెలుగు, సంస్కృతం, గణితశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భూగోళశాస్త్రం, వాణిజ్యశాస్త్రాలలో ఎం.ఫిల్. కోర్సులు ఉన్నాయి.

డాక్టరేటు కోర్సులు

మార్చు

గణితం, గణాంకశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రం, భూగోళశాస్త్రం,చరిత్ర, రాజకీయశాస్త్రం, ప్రజాపరిపాలన, ఆర్థికశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, ఇంగ్లీషు, తమిళం, సంస్కృతం, తెలుగు విభాగాలలో పి.హెచ్.డి. డిగ్రీ కొరకు పరిశోధనలు చేయడానికి ఈ కళాశాలలో సదుపాయాలున్నాయి.

పూర్వ అధ్యాపకులు

మార్చు

ప్రముఖులైన పూర్వవిద్యార్థులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "The History of Presidency College". archives.chennaionline.com. Archived from the original on 2009-11-13. Retrieved 2017-09-29.

బయటి లింకులు

మార్చు

మూస:తమిళనాడులోని జిల్లాలు