గణేశన్ వెంకటరామన్

భారతీయ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, విద్యావేత్త

గణేశన్ వెంకటరామన్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త, రచయిత. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్.[1] ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ[2] ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్[3] లకు ఫెలోషిప్‌కు ఎంపికయ్యాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్, సర్ సి.వి.రామన్ ప్రైజ్, ఇందిరాగాంధీ ప్రైజ్ లను అందుకున్నాడు.[2] 1991లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.[4]

Ganeshan Venkataraman
జననం6 October 1932
ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా,
వృత్తిCondensed matter physicist
Writer
పురస్కారాలుపద్మశ్రీ
UGC సర్ సి.వి.రామన్ పురస్కారం
INSA ఇందిరా గాంధీ బహుమతి

జీవిత విశేషాలు

మార్చు

వెంకటరామన్ అక్టోబరు 6, 1932 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జన్మిచాడు.[3] పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత ఆయన భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC) లో చేరాడు. కల్పాక్కం లోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్[5] లో పనిచేసాడు. అక్కడ ఆయన ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రమెంటేషన్ గ్రూపుకు డైరక్టరుగా ఉన్నాడు.[2] "కండెన్సేషన్ మేటర్ ఫిజిక్స్" పై పరిశోధనలు చేసి, 1966లో ముంబై విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి అందుకున్నాడు.[2] తరువాత ఆయన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంటు ఆర్గనైజెషన్ (డి.ఆర్.డి.ఒ) యొక్క అడ్వాన్స్‌డ్ న్యూమెరికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ గ్రూపుకు డైరక్టరుగా నియమితు డైనాడు.[2] ప్రభుత్వ ఉద్యోగంలో పదవీవిరమణ చేసిన తదుపరి ఆయన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఉప కులపతిగా తన సేవల నందించాడు.[1]

వెంకటరామన్ డి.ఆర్.డి.ఓ లో ప్రొఫెసర్ గా ఉన్న కాలంలో ఆయన అనేక పరిశోధనలు చేసాడు. వాటిలో న్యూట్రాన్ల పరిక్షేపణ, లాటిస్ డైనమిక్స్, పదార్థ యాంత్రిక ధర్మాలు, స్పటిక రహిత స్థితి వంటివి ముఖ్యమైనవి. ఆయన పరిశోధనలు అతి పెద్ద స్థాయిలో ఉన్న తార్కిక వలయాలు, సాంకేతిక బదిలీ వంటి అంశాలలో ఉపయోగపడ్డాయి.

డైనమిక్స్ ఆఫ్ పెర్‌ఫెక్ట్ క్రిస్టల్స్, బియాండ్ ద క్రిస్టల్ స్టేట్ వంటి గ్రంథాలతో పాటు అనేక పుస్తకాలు ప్రచురించాడు. అవి: జర్నీ ఇన్‌టు లైన్(సి.వి.రామన్ యొక్క జీవిత చరిత్ర),[6] ఎ హాట్ స్టోరీ,[1] భాబా అండ్ హిజ్ మాగ్నటిక్ ఆబ్‌సెషన్స్ [7] సాహా అండ్ హిస్ ఫార్ములా.[5] భౌతికశాస్త్ర పత్రిక[2] "ప్రమాణ" కు సంపాదకవర్గ సభ్యునిగా కూడా పనిచేసాడు.[8] అనేక కీలక అంశాలను ఉపన్యాసాల రూపంలో తెలియజేసాడు.[9][10]

1974లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎంపిక చేసింది.[3] ఆయనకు జవహర్ లాల్ నెహ్రూ ఫెలోషిప్ (1984–86), మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ [2] లు లభించాయి. భారత ప్రభుత్వం ఆయనకు 1991లో భారత నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.[4] అదే సంవత్సరం ఆయనకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ నుండి సి.వి.రామన్ పురస్కారం లభించింది.[2] శాస్త్ర విజ్ఞానాన్ని విస్తృత పరుస్తున్నందుకు గాను 1994 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇందిరాగాంధీ ప్రైజ్ యిచ్చి సత్కరించింది.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 G. Venkataraman (1993). A Hot Story. Universities Press. p. 134. ISBN 9788173710100.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 "INSA profile". Indian National Science Academy. 2015. Archived from the original on 2016-08-13. Retrieved 2018-01-18.
  3. 3.0 3.1 3.2 "IAS Fellow". Indian Academy of Sciences. 2015. Retrieved October 2, 2015.
  4. 4.0 4.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved 2018-01-18.
  5. 5.0 5.1 Ganeshan Venkataraman (1995). Saha and His Formula. Universities Press. p. 194. ISBN 9788173710179.
  6. Ganeshan Venkataraman (1988). Journey into light: life and science of C.V. Raman. Indian Academy of Sciences. p. 570. ISBN 9788185324005.
  7. Ganeshan Venkataraman (1994). Bhabha and His Magnificent Obsessions. Universities Press. p. 209. ISBN 9788173710070.
  8. "Pramana". Springer. 2015. Retrieved October 2, 2015.
  9. "Prof Ganesan Venkataraman, Honorary Professor at the Sri Sathya Sai Institute of Higher Learning Delivers 3rd Dr. Kulwant Rai Memorial Lecture". Sify. 15 November 2013. Archived from the original on 23 ఫిబ్రవరి 2018. Retrieved October 2, 2015.
  10. "The Telegraph news". The Telegraph. 11 November 2013. Archived from the original on 4 మార్చి 2016. Retrieved October 2, 2015.

ఎంపిక చేసిన గ్రంథములు

మార్చు