హిందూ మతంలో గణేశునికి (గణపతి) కు చెందిన భక్తి సాహిత్యంలో గణేశుని ముప్పై రెండు రూపాలు తరచుగా పేర్కొనబడ్డాయి.[1][2][3] వినాయక ఇతివృత్తం ప్రధానంగా ఉన్న గ్రంథాలలో ముద్గల పురాణము మొదటిది.[4]ముద్గల పురాణము, ఇతర గ్రంథాలలో గణేశుని వివిధరూపాల ప్రస్తావనలు, వర్ణనలు ఉన్నాయి. 19 వ శతాబ్దపు కన్నడ శ్రీ తత్త్వనిధిలో శివనిధి భాగంలో వివరణాత్మక వర్ణనలు చేర్చబడ్డాయి . నంజంగుడ్, చామరాజనగర్ (కర్ణాటక - మైసూర్ జిల్లా) లోని దేవాలయాలలో అక్కడి చక్రవర్తి ఆదేశాలతో ఈ ముప్పై రెండు రూపాలను చిత్రించారు ముప్పై రెండు ధ్యానశ్లోకాలు కూడా వ్రాశారు. ఈ శ్లోకాలు ముద్గాల పురాణానికి చెందినవని వచనం చెబుతోంది. (మార్టిన్ డ్యూబౌస్ట్ రాసిన పత్రాల ప్రకారం, శ్రీతత్వనిధి దక్షిణ భారతంలో ఇటీవలికాలంలో ప్రచురితమైనట్లు, ఈ పత్రాల్లో ఆ కాలంలో ఆయాప్రాంతాల్లో విరివిగా ఉన్న గణేశ రూపాలని పొందుపరిచినప్పటికీ, 4 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్న రెండు చేతుల, 9 వ, 10 వ శతాబ్దాలలో మధ్య భారతదేశంలో కనిపించిన పద్నాలుగు, ఇరవై చేతుల వినాయకుడిని వర్ణించలేదు.[5])
(రామచంద్రరావు) గణపతి ఆరాధనలో శ్రీతత్వనిధి లోని మొదటి పదహారు రూపాలు (షోడశ గణపతులు) చాలా ప్రాముఖ్యం చెందినవి. వాటిలో పదమూడవ, అంటే మహాగణపతి రూపాన్ని ఎక్కువగా పూజిస్తారు. ఈ రూపాన్ని తాంత్రికంగా కూడా పూజించే వారున్నారు. శక్తి-గణపతి, ఉచ్చిష్ట- గణపతి, లక్ష్మీ-గణపతి రూపాలు కూడా తాంత్రిక రహస్య ఆరాధనా రూపాలుగా పూజలు అందుకొంటున్నాయి.హేరంబ-గణపతి రూపం నేపాల్ లో ప్రసిద్ధి చెందింది.
చతుర్భుజుడు. తలపై చంద్రవంక గలదు. చేతులలో ఏకదంతము, అంకుశము, పాశము, మోదకము ధరించినవాడు. తన తుండము చివర దానిమ్మపండు ఉంది. పద్మాసనమున ఉన్నాడు. సర్వభూతములకు సుఖమును ప్రసాదించును.
ఆయన వామాంకమున శక్తి ఆసీనయై యున్నది. ఆమె చేతులలో పద్మము, ధ్వజము (పతాకము) ఉన్నాయి. ఆయన చతుర్భుజుడు. మూడు చేతులలో అంకుశము, మధుమత్కపాలము (మధువుతో నిండిన పుర్రె), పాశము ఉన్నాయి. ఆఐన నాలుగవ చేయి ఆమె తొడలమధ్య చేరియున్నది.
త్రిముఖుడు. షడ్భుజుడు. రెండు చేతులలో పదునైన అంకుశములను ధరించెను. ఒక చేత అక్షమాలను, ఒకచేత వరదముద్రను, ఒక చేత పాశమును, ఒక చేత అమృతభాండమును, మరొకచేత అభయముద్రను ధరించియున్నాడు. పద్మమధ్యమైన బంగారుఆసనముపై కూర్చొనియున్నాడు. ఒక్కొక్క ముఖమునందు తీక్ష్ణమైన మూడుకన్నులు గలవాడు.
ఆయన చతుర్భుజుడు. ఎర్రని పద్మమునందు కూర్చొని నీలివస్త్రములతో శోభించుచున్నాడు. ఆయన వామాంకమున కూర్చొన్న శక్తి పద్మహస్తయై సర్వాభరణములతో ప్రకాశించుచున్నది.
కష్టములను తొలగించువాడు. వరద ముద్ర, పాశము, అంకుశము, పాయసపాత్ర ధరించినవాడు. (పాఠాంతరము: వరదముద్ర, పాయసపాత్ర బదులుగా ఏకదంతము, వెలగపండు చెప్పబడినవి)
↑శ్రీ తత్వనిధి నుండి 32 గణపతి చిత్రాలు రంగు పునరుత్పత్తి కోసం చూడండి: రావు, పిపి. వై-ix.
↑మైసూర్ అసలైన వాటిలో వ్యక్తిగత పరిశీలన ఆధారంగా గణపతి రూపాల వివరణ కోసం, చూడండి: మార్టిన్-డబస్ట్, పేజీలు 120-123, 376.
↑శ్రీతత్వనిధిలో కనిపించే సంస్కృత వర్ణనలతో సహా 32 ధ్యాన రూపాల లైన్ డ్రాయింగ్లు ఇవ్వబడ్డాయి: గణేశా యొక్క గ్లోరీ (సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్: బాంబే, 1995), పేజీలు 85-118. చిత్రాల యొక్క అదే సమితి కానీ కొన్ని ప్రత్యామ్నాయాలు క్రమంలో , నామకరణం జాన్ A. గ్రైమ్స్, గణపతి: సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్, సునీ సిరీస్ ఇన్ రిలిజియస్ స్టడీస్ (యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రెస్: అల్బానీ, 1995)
గణేశుని కీర్తి, బాంబే: సెంట్రల్ చిన్మాయ మిషన్ ట్రస్ట్
మైసూర్ రాయల్ ఫ్యామిలీ, వార్షిక చారిత్రక అంశాలు పార్ట్ II, మైసూర్: గవర్నమెంట్ బ్రాంచ్ ప్రెస్, 1922
గోపాల్, ఆర్ ; ప్రసాద్, ఎస్, నరేంద్ర (2004), mummaDi kruShNarAja oDeyaru - ఒందు చారిత్రక అధ్యయన (ముమ్మడి కృష్ణరాజ వడయార్ - ఒక చారిత్రాత్మక అధ్యయనం) కర్ణాటక: డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్
గ్రీమ్స్, జాన్ ఎ (1995) గణపతి: సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్. SUNY సిరీస్ ఇన్ రిలిజియస్ స్టడీస్ అల్బానీ: స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రెస్ పేజీలు 52, 59-60 ISBN 0-7914-2440-5
హీరాస్, హెచ్ (1972) గణపతి సమస్య ఢిల్లీ: ఇండొలాజికల్ బుక్ హౌస్
మార్టిన్-డ్యూబౌస్ట్, పాల్ (1997) గణేశ : ది ఎన్చంటర్ ఆఫ్ ది త్రీ వరల్డ్స్, ముంబై: ప్రాజెక్ట్ ఫర్ ఇండియన్ కల్చరల్ స్టడీస్ ISBN 81-900184-3-4
రామచంద్రరావు, ఎస్ కే (1992) ది కంపెన్ధియం ఆన్ గణేశ ఢిల్లీ: శ్రీ సద్గ్గురు పబ్లికేషన్స్ ISBN 81-7030-828-3 శ్రీ తత్వనిధి నుండి పునరుత్పత్తి చేయబడిన 32 గణపతి రూపాల రంగు ప్లేట్ పునరుత్పత్తులను కలిగి ఉంటుంది
థాపన్, అనిత రైనా (1997) అండర్స్టాండింగ్ గణపతి : ఇంసైట్స్ ఇంటు ది డైనమిక్స్ ఆఫ్ ఏ కల్ట్, న్యూఢిల్లీ: మనోహర్ పబ్లిషర్స్ ISBN 81-7304-195-4
వొడయార్, ముమ్మడి కృష్ణరాజ (1997) శ్రీతత్వనిధి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్ విశ్వవిద్యాలయం