గతం( 2020 సినిమా)

'గతం' 2020లో తెలుగులో వచ్చిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా. ఈ చిత్రానికి కిరణ్‌ కొండమడుగుల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భార్గవ పోలుదాసు, రాకేశ్‌ గలేభె, పూజిత కురపర్తి ముఖ్యపాత్రల్లో నటించారు. కోవిడ్‌ నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో 6 నవంబర్ 2020న ఓటిటిలో అమెజాన్‌ ప్రైమ్‌లో విడులైంది. ఈ చిత్రాన్ని 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI) లోని ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించే 23 భారతీయ చిత్రాల జాబితాలో తెలుగు నుండి ఎంపికైన ఏకైక సినిమాగా 'గతం' నిలిచింది.[1]

గతం
Gatham.jpg
దర్శకత్వంకిరణ్‌ కొండమడుగుల
స్క్రీన్‌ప్లేకిరణ్‌ కొండమడుగుల
కథకిరణ్‌ కొండమడుగుల
నిర్మాత
 • భార్గవ పోలుదాసు
 • హర్ష ప్రతాప్
 • సృజన్ యర్రబోలు
నటవర్గం
 • భార్గవ పోలుదాసు
 • రాకేశ్‌ గలేభె
 • పూజిత కురపర్తి
ఛాయాగ్రహణంమనోజ్‌ రెడ్డి
కూర్పుజి.ఎస్
సంగీతంశ్రీ చరణ్‌ పాకాల
నిర్మాణ
సంస్థలు
ఆఫ్‌ బీట్‌ ఫిలింస్
ఎస్‌ ఒరిజినల్స్
పంపిణీదారులుఅమెజాన్ ప్రైమ్
విడుదల తేదీలు
2020 నవంబరు 6 (2020-11-06)
నిడివి
102 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్$155,000

కథసవరించు

అమెరికాలోని ఓ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరుగుతాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషి(రాకేశ్‌) మంచం మీద కోమాలో నుంచి లేచి, గతం మర్చిపోయిన ఓ అబ్బాయి ప్రియురాలిగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించే అదితి (పూజిత). గతాన్ని తెలుసుకోవడానికంటూ వారిద్దరూ కారులో బయలుదేరతారు. మార్గమధ్యంలో, చిమ్మచీకటిలో కారు బ్రేక్‌డౌన్‌ అయి ఆగిపోతే, అపరిచిత వ్యక్తి అర్జున్‌ (భార్గవ పోలుదాసు) తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ జంటకు ఎదురైన విచిత్రమైన అనుభవాలు ఏమిటి, మర్చిపోయిన ఆ గతం ఏమిటి, ఆ గతానికీ ఈ వ్యక్తులకూ సంబంధం ఏమిటన్నది కథ. [2][3]

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరుసవరించు

 • భార్గవ పోలుదాసు - అర్జున్
 • రాకేశ్‌ గలేభె - రిషి
 • పూజిత కురపర్తి - మీరా
 • తిరుముడి తులసిరామన్ -రమేష్
 • హర్ష ప్రతాప్ - హర్ష
 • ఉప్పులూరి - డా.శ్రీకాంత్
 • సోప్ పుచ్లే - సారా పీటర్స్
 • రఘు గోపాల్ - లక్ష్మణ్
 • ప్రసాద్ రాణి - డా. విశ్వ


మూలాలుసవరించు

 1. "Acclaimed Telugu film "Gatham" bags Panorama award: To be screened at IFFI - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-23.
 2. ఆంధ్రజ్యోతి (7 November 2020). "'గతం' మూవీ రివ్యూ". Archived from the original on 26 జనవరి 2021. Retrieved 14 April 2021.
 3. సాక్షి, హోం సినిమా (7 November 2020). "'గతం'... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం!". Sakshi. Archived from the original on 7 నవంబరు 2020. Retrieved 14 April 2021.