గద్వాల పురపాలకసంఘం

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పురపాలకసంఘం

మహబూబ్ నగర్ జిల్లాలోని 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి. 1952లో స్థాపించబడిన ఈ పురపాలక సంఘము ప్రస్తుతం 6.14 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 2001 జనాభా లెక్కల ప్రకారము 53,601 జనసంఖ్యతో జిల్లాలో రెండవ పెద్ద పురపాలక సంఘముగా కొనసాగుతోంది. పురపాలక సంఘము పరిధిలో 9 రెవెన్యూ వార్డులు ఉండగా, 26 ఎన్నికల వార్డులు ఉన్నాయి. . ప్రారంభం నుండి మూడవగ్రేడు పురపాలక సంఘముగా ఉండగా, ఇటీవల ఫిబ్రవరి 2009లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా రెండవ గ్రేడు పురపాలక సంఘముగా అప్‌గ్రేడ్ చేయబడింది.

గద్వాల పురపాలక సంఘ కార్యాలయము

చరిత్ర

మార్చు

గద్వాల ఒక చారిత్రక పట్టణం. పూర్వపు హైదరాబాదు రాజ్యంలో గొప్ప సంస్థానముగా వెలుగొందిన ఈ పట్టణంలో సోమనాద్రి కట్టించిన చారిత్రక కోట పట్టణం మధ్యలో సందర్శకులను ఆకట్టుకుంటుంది. స్వాతంత్ర్యానంతరం 1952లో గద్వాలను మూడవ గ్రేడు పురపాలక సంఘముగా ఏర్పాటుచేశారు. ఇప్పటికీ ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘముగానే కొనసాగుతోంది.

నీటి సరఫరా

మార్చు

పురపాలక సంఘముచే పట్టణంలో 3.9 మిలియన్ గ్యాలన్ల నీటిసరఫరా జరుగుతోంది. పురపాలకసంఘ్అం పరిధిలో 4316 ఇంటినల్లాలు, 585 పబ్లిక్ నల్లాలు ఉన్నాయి. ఇవే కాకుండా పట్టణ పరిధిలో 162 చేతిపంపులు కూడా ఉన్నాయి. పట్టణంలో ఉన్న నీటి సరఫరా పైపు లైన్ పొడవు 48 కిలోమీటర్లు. ఇంటికి సరఫరా చేయబడే ప్రతి కనెక్షనుకు నెలసరు రూ.70/- నీటిరుసుము క్రింద పురపాలక సంఘము వసూలు చేస్తుంది.

రోడ్లు

మార్చు

పురపాలక సంఘం పరిధిలో 25 కిలోమీటర్ల పొడవు కల సిమెంటు రోడ్లు, 10 కిలోమీటర్ల పొడవు తారు రోడ్లు, 35 కిలోమీటర్ల పొడవు ఇతర రోడ్లు ఉన్నాయి.

మురికి కాల్వలు, పారిశుద్ధ్యం

మార్చు

పట్టణ పరిధిలో 120 కిలోమీటర్ల పొడవుకల పక్కా మురుగునీటి కాల్వలు, 60 కిలోమీటర్ల పొడవు కల కచ్చా మురికికాల్వలు ఉన్నాయి. ప్రతిరోజు దాదాపు 38 మెట్రిక్ టన్నుల చెత్తను పురపాలక సిబ్బందిచే తొలిగించివేస్తున్నారు. దీనికి గాను 2 మున్సిపల్ ట్రాక్టర్లు, 6 అద్దె ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు.

పట్టణ వీధి దీపముల ఏర్పాటు

మార్చు

పురపాలక సంఘము పరిధిలో ముఖ్యమైన కూడలిలలో 5 హైమాస్ట్ లైటింగ్ సదుపాయము ఉంది. 17 సెంట్రల్ లైటింగ్ స్తంభాలు ఉన్నాయి. 2400 ఫ్లోరొసెంట్ బల్బులే కాకుండా 36 ఎస్.వి.బల్బులు పట్టణంలో విద్యుత్తు స్తంభాలకు బిగించబడి ఉన్నాయి.

మురికివాడలు

మార్చు

రెవెన్యూ వార్డుల వారీగా జనాభా

మార్చు
రెవెన్యూ వార్డు సంఖ్య మహిళలు పురుషులు మొత్తం జనాభా
1 4959 5151 10110
2 1788 1858 3646
3 1358 1395 2753
4 1707 1774 3481
5 2221 2227 4448
6 3537 3267 6804
7 5269 4963 10232
8 3112 2850 5962
9 3112 2850 5962
మొత్తము 27014 26587 53601

అభివృద్ధి పనులు

మార్చు

గద్వాల పురపాలక సంఘముచే పట్టణ పరిధిలో ఇటీవలి కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు :

  • భూగర్భ డ్రైనేజీ : రూ.16 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టడమైనది. సిటీ ఛాలెంజ్ ఫండ్‌లో భాగంగా ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసింది.
  • ఔటర్ రింగ్ రోడ్డు : రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనుల సర్వే పూర్తీయినది. గద్వాల నుంచి రాయచూరు వెళ్ళడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది.
  • మురికి వాడల అభివృద్ధి : రూ.59 లక్షల వ్యయంతో మురికివాడలలో సిమెంటు రోడ్లు, మురుగునీటి కాల్వలు నిర్మించడమైనది.
  • పారిశుద్ధ్యం : రూ.5 లక్షల వ్యయంతో పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టినారు.
  • కమ్యూనిటీ భవనములు : ఎంపీలాడ్స్ పథకము నుంచి మంజూరు అయిన నిధులనుంచి రూ.13 లక్షల వ్యయంతో 2 కమ్యూఇటీ భవనములు నిర్మించారు.
  • దుకాణ సముదాయాల నిర్మాణము : చిన్న, మధ్య తరహా పట్టణంల సమీకృత అభివృద్ధి పథకపు నిధులనుంచి రూ.1.06 కోట్ల వ్యయంతో 107 దుకాణములను నిర్మించడం జరిగింది.
  • పేదవారికి తక్కువ ధరలో నల్లా కనెక్షన్లు : దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 335 కుటుంబాలకు కేవలం రూ.1200/- ధరావత్తుతో నూతనంగా నల్లా కనెక్షన్లు ఇవ్వబడింది.

ప్రధాన ఆదాయ వనరులు

మార్చు

గద్వాల పురపాలక సంఘపు ప్రధాన ఆదాయ వనరులు :

  • ఇంటిపన్నులు
  • నీటి రుసుము (నల్లా కనెక్షన్)
  • భవన నిర్మాణ అనుమతుల పీజు
  • లైసెన్స్ పీజు
  • పురపాలక సంఘపు దుకాణముల కిరాయలు
  • ప్రభుత్వము విడుదల చేసే వివిధ గ్రాంటులు
  • మార్కెట్ వేలములు

ఇటీవలి కాలంలో పనిచేసిన పురపాలక సంఘ కమీషనర్లు

మార్చు
క్ర.సం. కమీషనర్ పేరు కాలము
1 బాలరాజు (ఇంచార్జి) 24.07.2000 నుంచి 13.08.2000
2 ఎం.ఏ.అలీమ్ (ఇంచార్జి) 04.09.2000 నుంచి 22.12.2000
3 ఏ.ఏ.అజీజ్ 01.01.2001 నుంచి 03.04.2001
4 వి.రామకృష్ణారెడ్డి (ఇంచార్జి) 04.04.2001 నుంచి 09.07.2001
5 ఎన్.వాణిశ్రీ 10.07.2001 నుంచి 20.03.2002
6 ఎం.ఏ.అలీమ్ 21.03.2002 నుంచి 11.02.2004
7 బి.శ్రీనివాస్ 12.02.2004 నుంచి 28.02.2004
8 ఎం.ఏ.అలీమ్ 28.02.2004 నుంచి 31.10.2004
9 వి.శ్రీనివాసులు 17.10.2004 నుంచి 30.10.2004
10 ఎన్.వాణిశ్రీ 24.11.2004 నుంచి
11 హన్మంతు
12 పద్మావతి
13 ఖాజా హుస్సేన్ (ఇంచార్జీ)

పురపాలక సంఘపు కౌన్సిలర్లు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు