<< ఫిబ్రవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
2020

ఫిబ్రవరి (February), సంవత్సరములోని రెండవ నెల. 28 రోజులుండే ఈ నెల మిగతా అన్ని నెలల కన్నా చిన్నది. లీపు సంవత్సరములో మాత్రం ఈ నెలలో 29 రోజులు ఉంటాయి.

కొన్నివేల యేండ్లకుముందు ఫిబ్రవరినెల కడపటి నెలగా ఉండేది. ఆతరువాత కొంతకాలనికి రెండవనెలగా మారింది. క్రీ.పూ. 450 పూర్వము అది తిరిగి కడపతినెలగా మారి మరల కొంత కాలానికి రెండవనెలగా మారిందట. రోమనులు లూపర్కస్ (Lupercus) అనే ఒక దేవత పేరిట ఒక పండుగ చేసుకోవటము మామూలు, ఆపండుగ పేరు ఫెబ్రువా (Februa). అది ఈనెలలోనే జరుగుతూ ఉంటుంది గాబట్టి ఈనెలకు ఫెబ్రువరి అని పేరువచ్చింది. ఈనెల అంతా ఆదేశీయులు రాత్రిళ్ళు ఉపవాసము ఉండి పూజలు చేస్తూ ఆత్మశుద్ధి చేసుకుంటారట.

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిబ్రవరి&oldid=1312247" నుండి వెలికితీశారు