గరిక, ఒక చిన్న గడ్డి మొక్క .దీని వృక్షశాస్త్ర నామం సైనోడాన్ డాక్టిలాన్ (కుటుంబం: Poaceae) చెందింది అన్ని గడ్డి సైనోడాన్ లేదా గరిక కాదు. ఇది దర్భ/ ఇంపీరిటా లేదా కొన్ని సార్లు టైఫా ద్వారా భర్తీ చేయబడుతుంది.అవి తేలికపాటి అలర్జీని కలిగిస్తాయి.దీనిని సంస్కృతంలో దూర్వ అని పిలుస్తారు.

గరిక
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
సై. డాక్టిలాన్
Binomial name
సైనోడాన్ డాక్టిలాన్

గరిక పోచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా ఉండి 2-15 సెం.మీ. పొడవుండి అంచులు గరుకుగా ఉంటాయి.[1] ఒక్కొక్క కొమ్మ సుమారు 1-30 సెం.మీ. పొడుగ్గా పెరుగుతాయి. వీటి కాండం చదునుగా ఉంటుంది. కాండం చివర విత్తనాలు 2–6 గుత్తులుగా ఉంటాయి.వీటికి లోతైన వేర్లు ఉంటాయి, కరువు పరిస్థితులలో 2 మీటర్ల లోతుకు పోయి ఒక చాపలాగా తయారుచేస్తాయి. ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తిచెందుతుంది.

వైద్యరీత్యా ఉపయోగం మార్చు

దీని వేళ్లు కొన్ని రుగ్మతలకు నివారణగా వాడతారు.వేళ్లను శుబ్రపరచి ఎండబెట్టిన తరవాత పొడిగా చేసి గ్రీన్ టీ లాగా వాడితే అయాసం, మూత్రపిండాల వ్యాధితో భాధపడుతున్నవారికి ఉపశమనం కలిగిస్తుంది.దీనిని వినాయక పూజలో నాలుగవ పత్రిగా ఉపయోగిస్తారు.[2]

మూలాలు మార్చు

  1. Walker, Karen; Burrows, Geoff; McMahon, Lynne (2001). 'Bidgee bush : an identification guide to common native plant species of the south western slopes of New South Wales. Yarralumla, Australian Capital Territory: Greening Australia. p. 82. ISBN 1-875345-61-2.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  2. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=గరిక&oldid=3937935" నుండి వెలికితీశారు