గర్భాశయ గ్రీవము

గర్భాశయ గ్రీవము (cervix (from the Latin cervix uteri, meaning "neck of the womb") గర్భాశయముపు క్రింది భాగంలోని సన్నని భాగము. ఇది యోని లోనికి బుడిపి మాదిరిగా పొడుచుకొని వుంటుంది. సగం భాగం వైద్య పరీక్షలకు అనుకూలంగా ఉండే పై అర్థభాగం దాగివుంటుంది.

గర్భాశయ గ్రీవము
Schematic frontal view of female anatomy
లాటిన్ cervix uteri
ధమని vaginal artery, uterine artery
Precursor Müllerian duct
MeSH Cervix+uteri

నిర్మాణం మార్చు

 
గర్భాశయ గ్రీవం, శ్లేష్మముతో (The cervix with cervical mucous‎)
 
గర్భాశయ గ్రీవ బాహ్యద్వారము (The cervical os)

బహిర్గ్రీవం మార్చు

యోనిలోనికి పొడుచుకొని వచ్చు గర్భాశయగ్రీవ భాగంను యోనిభాగం లేక బహిర్గ్రీవంగా (ఎక్టోసెర్విక్స్) పరిగణిస్తారు. సగటున వయోజనులలో ఈ భాగం 3 సె.మీ. పొడవు, 2.5 సె.మీ వెడల్పు కలిగి దీర్ఘవృత్తాకారపు కుంభాకారంలో కనిపిస్తుంది. దీని మధ్యలో గర్భాశయ బాహ్య ద్వారం ( ఎక్స్ టెర్నల్ ఆస్) ఉంటుంది. బాహ్యద్వారం ముందు వెనుకల పెదవులు ఉంటాయి.

బాహ్య ద్వారం మార్చు

బహిర్గ్రీవపు బాహ్యద్వారంను బాహ్యాస్యం (external os) అని కూడా అంటారు. బాహ్యద్వారపు ఆకారం, పరిమాణం వయస్సుబట్టీ, వినాళగ్రంథి స్రావాల బట్టీ , ఆ స్త్రీకి యోని ద్వారా కాన్పు అయిందో లేదో దానిబట్టీ మారుతాయి. యోనిద్వారా కాన్పు అవని స్త్రీలలో బాహ్యద్వారం చిన్నదై గుండ్రముగా ఉంటుంది. యోని ద్వారా కాన్పయిన స్త్రీలలో బహిర్గ్రీవం మందంగా ఉంటుంది. బాహ్యద్వారం వెడల్పుగా చీలికవలె విచ్చుకొని ఉంటుంది.

గర్భాశయ మార్గం మార్చు

బాహ్యద్వారం నుండి గర్భాశయ కుహరంలోనికి వెళ్ళే గర్భాశయ మార్గంను గ్రీవాంతర కుల్య లేక గ్రీవాంతరపు కాలువగా (ఎండోసెర్వైకల్ కెనాల్) కూడ వర్ణించవచ్చు. గర్భాశయ మార్గం పొడవు, వెడల్పు గర్భాశయ గ్రీవంపై ఆధారపడుతాయి. సంతానోత్పత్తి వయస్సులో ఉన్న స్త్రీలలో గర్భాశయ మార్గం ముందు వెనుకలకు అణచబడినప్పుడు 7-8 మి.మీ గరిష్టపు వెడల్పు కలిగి ఉంటుంది

అంతర్ద్వారం మార్చు

గర్భాశయ మార్గం గర్భాశయ కుహరంలోనికి అంతర్ద్వారం, లేక అంతరాస్యం (internal os) ద్వారా తెఱుచుకొని అంతమవుతుంది.

వ్యాధులు మార్చు

  • గర్భాశయ గ్రీవపు సూక్ష్మజీవుల ఆక్రమణ వ్యాధిని గ్రీవతాపం (Cervicitis) అంటారు.
  • కర్కటవ్రణం (పుట్టకురుపు) లేక కాన్సర్

బయటి లింకులు మార్చు

  • My Beautiful Cervix—site with a series of photographs illustrating the cervix over a menstrual cycle