గాంధీ జయంతి

మహాత్మాగాంధీ జన్మదిన సందర్భంగా ఆచరించే జాతీయ సెలవు

అక్టోబరు 2న భారత దేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే)

గాంధీ జయంతి
గాంధీ జయంతి
విజయవాడ లోని ఘంటసాల సంగీత కళాశాల లో గాంధీ విగ్రహం
జరుపుకొనేవారుభారతదేశం
ప్రాముఖ్యతభారత స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీ సేవలకు గుర్తింపు.
జరుపుకొనే రోజు2 అక్టోబరు
వేడుకలుసామాజిక, చారిత్రిక దినోత్సవం
సంబంధిత పండుగఅంతర్జాతీయ అహింసా దినోత్సవం
గణతంత్ర దినోత్సవం

15 జూన్ 2007ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం"గా ప్రకటించింది.[1]

వేడుకలు

భారత దేశంలో నాయకులు, విద్యార్థులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన రాజ్ ఘాట్ (కొత్త ఢిల్లీ) లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.[2] గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితంగా ఇష్ట పడిన రఘుపతి రాఘవ రాజారామ్ గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు.

మూలాలుసవరించు

  1. Chaudhury, Nilova (15 June 2007). "October 2 is global non-violence day". hindustantimes.com. Hindustan Times. Retrieved 2007-06-15. CS1 maint: discouraged parameter (link)
  2. Gandhi Jayanti Webpage from Simon Fraser University, URL accessed April 15, 2006

బయటి లింకులుసవరించు