గాంధీ స్టేడియం (పంజాబీ: ਗਾਂਧੀ ਸਟੇਡਿਯਮ) లేదా బర్ల్‌టన్ పార్కు లేదా బి.ఎస్.బేడీ స్టేడియం క్రికెట్ మ్యాచ్‌లు ఆడటానికి ఉపయోగపడుతుంది. [1] 2017 ఆగస్టు 19 నాటికి ఇక్కడ 1 టెస్టు, 3 ఒన్‌ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి.

గాంధీ స్టేడియం
బర్ల్‌టన్ పార్కు
బి.ఎస్.స్టేడియం
Gandhi stadium.jpg
మైదాన సమాచారం
ప్రదేశంజలంధర్, పంజాబ్, భారతదేశం
భౌగోళికాంశాలు31°20′41″N 75°33′38.07″E / 31.34472°N 75.5605750°E / 31.34472; 75.5605750Coordinates: 31°20′41″N 75°33′38.07″E / 31.34472°N 75.5605750°E / 31.34472; 75.5605750
సామర్థ్యం (కెపాసిటీ)16,000
చివరి పేర్లు (ఎండ్ నేమ్స్)
పెవిలియన్ ఎండ్
స్టేడియం ఎండ్
అంతర్జాతీయ సమాచారం
టెస్టు మాత్రమే24 సెప్టెంబరు 1983:
 భారతదేశం v  పాకిస్తాన్
మొదటి ODI20 డిసెంబరు 1981:
 భారతదేశం v  ఇంగ్లాండు
చివరి ODI20 ఫిబ్రవరి 1994:
 భారతదేశం v  శ్రీలంక
జట్టు సమాచారం
పంజాబ్ (1952 – 2000)
ఉత్తర జోన్ (1961 – 1979)
As of 16 డిసెంబరు 2007
Source: CricketArchive

చరిత్రసవరించు

ఈ స్టేడియం 1955లోనిర్మించబడి దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. ఇది భారత దేశవాళీ క్రికెట్ జట్టులైన పంజాబ్, నార్త్ జోన్ లకు వేదిక అయింది. ఈ స్టేడియం భరతదేశంతో ఒక టెస్టు మ్యాచ్, మూడు ఒన్‌ డే మ్యాచ్‌లకు ఆడటానికి పాకిస్థాన్ కు ఆతిధ్యం యిచ్చింది. ఈ మ్యాచ్‌లలో భారతదేశం విజయం సాధించింది.

చండీగఢ్ బయట మొహాలి క్రికెట్ స్టేడియం రావడంతో, పంజాబ్ రాష్ట్రంలోని ఇతర స్టేడియంలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వటానికి అవకాశమిచ్చుటకు యిష్టపడవు.

ఈ స్టేడియంలో టెస్టు క్రికెట్ లో అత్యధిక స్కోరు పాకిస్థాన్‌తో ఆడిన భారత దేశం చేసిన 374. అధిక పరుగులు చేసిన క్రీడాకారుడు "ఆన్ష్‌మన్ గేక్‌వాడ్"(201 పరుగులు), వసీం రాజా (125 పరుగులు), జావేద్ మియాందాద్ (66 పరుగులు). అధిక వికెట్లు తీసుకున్న క్రీడాకారులు వసీం రాజా, కపిల్ దేవ్ ( 4 వికెట్లు), వారితో రవిశాస్త్రి ( 3 వికెట్లు) తీసుకున్నారు. ఒన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లలో అత్యధిక స్కోరు పాకిస్థాన్ పై వెస్ట్‌ ఇండీస్ చేసిన 226 పరుగులు. అధిక పరుగులు చేసినవారు దిలీప్ వెంగ్‌సర్కార్ (88 పరుగులు), రిచే రిచర్డ్‌సన్ (77 పరుగులు), ఆమేర్ మాలిక్ (77 పరుగులు). అధిక వికెట్లు తీసుకున్నవారు వెంకటపతి రాజు (3 వికెట్లు), గ్రాహం గూచ్ ( 2 వికెట్లు), కపిల్ దేవ్ (2 వికెట్లు)

కూల్చివేత, పునర్నిర్మాణంసవరించు

ప్రస్తుతం జలంధర్ నగరంలో క్రీడా సముదాయం కట్టాలనే ప్రణాళిక ఉన్నది. ఈ క్రికెట్ మైదానాన్ని పునర్నిర్మించి అంతర్జాతీయ స్థాయిలోనికి మారాలని ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. అన్ని స్టాండ్లను కూల్చివేశారు. అయితే, కొన్ని చట్టపరమైన సమస్యలు కారణంగా, ఈ ప్రాజెక్ట్ కొంతకాలం నిలిపివేయబడింది. కొన్ని నెలల తరువాత కొంత పునర్నిర్మాణం కనిపించింది. ప్రధాన పిచ్ కూడా పునర్నిర్మించబడుతున్నందున, ఈ స్టేడియం ప్రస్తుతం ఏ మ్యాచ్లను ఆతిథ్యమివ్వడంలేదు. జూనియర్ క్రికెటర్ల అభ్యాసన సెషన్లు నిలిపివేయబడలేదు.[2]

మూలాలుసవరించు

ఇతర లంకెలుసవరించు