గాంధీ స్మృతి

భారతదేశంలోని న్యూఢిల్లీలోని మహాత్మా గాంధీ మ్యూజియం మరియు మరణ స్థలం

గాంధీ స్మృతి దేశ రాజధాని కొత్త ఢిల్లీలో ఉన్న మ్యూజియం. మహాత్మా గాంధీ తన మరణం జనవరి 30, 1948 ముందు ఉన్న 144 రోజులు ఈ భవనంలోనే గడిపాడు. ఈ భవనాన్ని బిర్లా హౌస్, బిర్లా భవన్ అని కూడా పిలుస్తారు.[1]

గాంధీ స్మృతి, న్యూఢిల్లీ

చరిత్ర

మార్చు

ఈ భవనాన్ని ఘనశ్యాం దాస్ బిర్లా 1928లో 12 గదులతో నిర్మించాడు. ఈ భవనానికి తరచు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్శించేవారు. మహాత్మా గాంధీ తన చివరి రోజులు సెప్టెంబర్ 9, 1947 నుంచి 1948 జనవరి 30 వరకు ఈ భవనంలోనే గడిపాడు.

మరిన్ని విశేషాలు

మార్చు

గాంధీ మరణాతరం అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రు ఈ భవనాన్ని గాంధీ గుర్తుగా ఒక స్మృతి భవనంగా మార్చడం కోసం ఘనశ్యాం దాస్ బిర్లాకి లేఖ రాసాడు. కానీ ఈ భవనం మీద ఉన్న జ్ఞాపకాల కోసం ఆ లేఖను ఆయన తిరస్కరించాడు. 1971లో ఘనశ్యాం దాస్ బిర్లా రెండవ కుమారుడు కృష్ణ కుమార్ బిర్లా నుంచి భారత ప్రభుత్వం అనేక సంభాషణల తరువాత ఈ భవనాన్ని 5.4 మిల్లియన్లతో సహా ఏడు ఎకరాల భూమి ఇచ్చి భారత ప్రభుత్వం ఈ భవనాన్ని ఆధీనంలోకి తీసుకుంది.

మ్యూజియం

మార్చు

ఈ మ్యూజియాన్ని ఆగస్టు 15, 1973 న గాంధీ గుర్తుగా ఈ భవనానికి గాంధీ స్మృతిగా నామకరణం చేసారు. ఈ మ్యూజియాన్ని సోమవారం మినహాయిస్తే అన్ని రోజులు సందర్శకులను అనుమతిస్తారు.[2]

మూలాలు

మార్చు
  1. "The Eternal Gandhi". Sacred World. Archived from the original on 3 మార్చి 2019. Retrieved 3 August 2019.
  2. "Gandhi Smriti and Darshan Samiti Delhi". KahaJaun. Retrieved 3 August 2019.