ఘనశ్యాం దాస్ బిర్లా

భారతీయ వ్యాపారవేత్త

జె. డి. బిర్లాగా పేరు గాంచిన ఘన్ శ్యామ్ దాస్ బిర్లా భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని. ఆయన 1894 ఏప్రిల్ 10 వతేదీన పిలాని గ్రామంలో పుట్టాడు.

ఘన్‌శ్యామ్ దాస్ బిర్లా
ఘన్‌శ్యామ్‌ దాస్ బిర్లా
జననం(1894-04-10)1894 ఏప్రిల్ 10
పిలాని గ్రామం,
మరణం1983 జూన్ 11(1983-06-11) (వయసు: 89)
ఇతర పేర్లుజె. డి. బిర్లా
వృత్తిపారిశ్రామిక వేత్త
వీటికి ప్రసిద్ధిహిందుస్తాన్ మోటార్స్ స్థాపకుడు
యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యుకో/UCO) ప్రారంభకుడు.
తల్లిదండ్రులు

బాల్యం

మార్చు

ఘన్ శ్యామ్ దాస్ తాతగారైన శివనారాయణ బిర్లా పిలాని ప్రాంతంలో పెద్ద వ్యాపారి. ఇతడు తరువాతి కాలంలో కలకత్తా వెళ్ళి బట్టల వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారం పుంజుకొన్న తరువాత పిలాని గ్రామంలో ఒక హవేలీ నిర్మించాడు. ఇప్పటికీ ఉన్న దానిని బిర్లా హవేలి అంటున్నారు. అతడు నవల్గర్ కుటుంబం నుండి ఘన్ శ్యామ్ దాస్ తండ్రి అయిన బలాదియోదాస్‌ను పెంపకానికి తెచ్చుకొన్నాడు.

వ్యాపారం

మార్చు

ఘన్ శ్యామ్ కూడా తాత తండ్రుల వలే కలకత్తా వెళ్ళి బట్టల వర్తకం సాగించాడు. దానితో పాటు వస్తుతయారీ యూనిట్లను దేశం నలుమూలలా స్థాపించాడు. 50 లక్షల పెట్టుబడి దాటిన తరువాత తన సోదరులతో కలిసి 1919లో గ్వాలియర్ పట్టణంలో సొంతానికి మిల్లు స్థాపించాడు. తరువాత బిర్లా రాజకీయాలలో రాణించాడు. 1926లో బ్రిటిష్ వారి హయాంలో శాసనసభకు వెళ్ళాడు. తరువాత కార్ల వ్యాపారంలో ప్రవేశించి 1940 లో హిందుస్తాన్ మోటార్స్ అనే సంస్థను స్థాపించాడు. దీని తరువాత సిమెంట్, ఇనుము, రసాయనాలు, ప్లాస్టిక్ పరిశ్రమలలో రాణించాడు. 1943 ప్రాంతంలో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యుకో/UCO) అనే సంస్థను కలకత్తాలో ప్రారంభించాడు. 1983 లో తన 90 వ ఏట మరణించాడు.

అవార్డులు, సత్కారాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇతర విశేషాలు

మార్చు