గాజు బల్లి

(గాజు పాము నుండి దారిమార్పు చెందింది)

గాజు బల్లులు లేదా గాజు పాములు, ఓఫిసారస్ (Ophisaurus) ప్రజాతికి చెందిన సరీసృపాలు. బయటికి పాముల (snakes) వలె కనిపించినా నిజానికి ఇవి బల్లులు(lizards). వీటిలో చాలా జాతులలో బల్లులవలె కాళ్ళుండవు, తల ఆకారం, కదిలే కనురెప్పలు, బాహ్యచెవి రంధ్రం కలిగివుంటాయి. కొన్ని జాతులలో చిన్న బొడిపి మాదిరిగా ఉండే చిన్న కాళ్ళుంటాయి. ఈ జంతువులను అతుకుల పాములు (Jointed Snakes) అని కూడా అంటారు. ఇవి ఇంచుమించు 4 అడుగుల పొడవుగా కూడా ఉంటాయి; మూడొంతులు తోక భాగమే ఉంటుంది. గాజు బల్లులు ముఖ్యంగా కీటకాలను తిని జీవిస్తాయి.

గాజు బల్లి
Eastern glass lizard (Ophisaurus ventralis)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
ఒఫిసారస్

Daudin, 1803[1]
జాతులు

See text.

వీటి శరీరం సులువుగా ముక్కలైపోతుంది అందువల్లనే 'గాజు బల్లి' అనే పేరు వచ్చింది. మిగిలిన బల్లుల వలెనే కదిలే తోకను విసర్జించి శత్రువుల నుండి తప్పించుకుంటాయి. కొత్తగా తయారైన తోక చిన్నదిగా ఉంటుంది.

అత్యధిక సంఖ్యలోని జాతులు ఆసియాలో భారతదేశం నుండి చైనా, ఇండోనేషియా వరకు వ్యాపించాయి.

వర్గీకరణ

మార్చు

ప్రజాతి ఓఫిసారస్

  • Ophisaurus apodus: Scheltopusik
  • Ophisaurus attenuatus: Slender glass lizard
  • Ophisaurus buettikoferi: బోర్నియో గాజు బల్లి
  • Ophisaurus ceroni: Ceron's glass lizard
  • Ophisaurus compressus: Island glass lizard
  • Ophisaurus formosensis: ఫార్మోసాన్ గాజు బల్లి
  • Ophisaurus gracilis: బర్మీస్ గాజు బల్లి
  • Ophisaurus hainanensis
  • Ophisaurus harti: చైనీస్ గాజు బల్లి
  • Ophisaurus incomptus
  • Ophisaurus koellikeri: మొరాకన్ గాజు బల్లి
  • Ophisaurus mimicus: Mimic glass lizard
  • Ophisaurus sokolovi
  • Ophisaurus ventralis: తూర్పు గాజు బల్లి
  • Ophisaurus wegneri: సుమత్రా గాజు బల్లి

మూలాలు

మార్చు