నకాషీ

(గినియార్ నుండి దారిమార్పు చెందింది)

నకాషీ అనేది తెలంగాణలో ఉండే ఒక కులం. ఈ కులస్థులు చంద్ర వంశ క్షత్రియులు. నవాబుల దండయాత్రల వల్ల దక్షిణ భారతదేశానికి వలసలు వచ్చారు! తెలంగాణలో 50 వేల మంది వరకూ ఉన్న నకాషీలను శ్రీ సోమ వంశ ఆర్యక్షత్రియ ,ఆర్యక్షత్రియ, జీనిగర్, చిత్తారి, చిత్రకార్‌ అని కూడా పిలుస్తారు.

దక్షిణ భారతదేశానికి చెందిన కులాలు, ఆదివాసీల గురించిన పుస్తకం

వృత్తి, సామాజిక జీవితం

మార్చు

ఆర్య క్షత్రియ కులంలో నాలుగు తెగలు ఉన్నాయి. 1.జీనిగరి 2.చిత్తారి 3.చిత్రకార 4.నకాష్. ఈ నాలుగింటిలో చివరాఖరి తెగగా ఈ నకాష్ చెప్పవచ్చు. ఈ కొంతమందిని నకాష్ వారిగా పేర్కొనబడ్డారు. కేవలం తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే వీళ్ళను నకాష్ గా వ్యవహరింపబడుతారు. మిగిలిన వాళ్ళను జీనిగర్లుగా చిత్తారి వారుగా చిత్రకార వారిగా పేర్కొనబడుతారు. ప్రస్తుతం బొమ్మల తయారీ పనిలో ప్రావీణ్యం పొంది, నిర్మల్‌ పెయింటింగులు, బొమ్మల రూపశిల్పుగా రాష్ర్టంలో 50 వేల మంది మాత్రమే ఉన్న నకాషీలను శ్రీ సోమ వంశ ఆర్యక్షత్రియ ,ఆర్యక్షత్రియ ,జీనిగర్,చిత్తారి,చిత్రకార్‌ అని కూడా పిలుస్తారు. వీరు ద్విజులు ఒడుగు(జంథ్యం) వీరికి తప్పనిసరి. వీరి ప్రధాన కుల దైవం " మాత నిమిషాంబ దేవి " బ్రాహ్మణులకు మాదిరిగా వీళ్లకు ఋషి పేర్లు గోత్రాలుగా వస్తాయి. ఆత్రేయ,భరద్వాజ,కౌండిన్య,విశ్వామిత్ర,కశ్యప,సనకసనందన,వశిష్ఠ,శాండిల్య వంటి అనేక గోత్రాలు వీరికి ఉన్నాయ్.వీరు బీ.సీ-బి గ్రూపులో రెండవ కులం/వర్గానికి చెందుతారు.కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారు చేస్తారు. అంతేకాక అక్కడక్కడా శిక్షణ కేంద్రాలు నెలకొల్పి ఇతరులకు కూడా ఈ కళను నేర్పిస్తున్నారు. తాము సృజించిన కళారూపాలు తమ సొసైటీ ద్వారా మార్కెట్‌ చేస్తారు. ఏడాది పొడుగునా బొమ్మలు, పెయింటింగ్స్ రూపొందించడంతోపాటు గణేష్‌ ఉత్సవాలకు మట్టిబొమ్మలు తయారుచేసి పర్యావరణ కాలుష్యాన్ని దూరంచేసే ప్రయత్నం చేస్తారు. వీరి పూర్వీకులు మహారాష్ర్టకు చెందినవారు. మూడు శతాబ్దాల కిందటే వీరు నిర్మల్‌ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో అడవులలో పెరిగే `పొనికి' అనే చెట్టు చెక్కకు నగిషీలు చెక్కి నకాషీలు కొయ్య బొమ్మలు తయారు చేస్తారు. ఈ చెట్లు అంతరించిపోయే దశకు చేరుకోవటంతో కర్ర దొరకటం ప్రస్తుతం కష్టమవుతోంది. పొనికి చెట్లను నరికితే అటవీ శాఖ అధికారులు కేసులు పెడతారు. అడవిలో తిరిగి ఎక్కడన్నా ఎండిపోయిన చెట్లు కనిపిస్తే అధికారులకు చూపి వారి అనుమతితో సొసైటీ ద్వారా వీరు ఆ చెట్లను నరికించి తెస్తారు. ఇందుకు వీరు పన్ను చెల్లించాలి. నిర్మల్‌కు దూరంగాఉన్న జన్నారం, ఉట్నూరు ప్రాంతాలే కాదు బెల్లంపల్లి, నెన్నెల, భీమారం, రాయదరి, తదితరప్రాంతాల నుంచి తెప్పించుకునే ఈ కరక్రు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అటవీశాఖ కూడా ఈ చెట్లను పెంచేందుకు పరిశోధనలు చేస్తోంది. కాగా, ఉన్న చెట్లను మత్యకారులు నరికి తెప్పలు తయారు చేస్తున్నారు. పొనికి చెక్క బొమ్మలు తయారుచేసే వృత్తిపై ఆధారపడి ప్రస్తుతం 150 కుటుంబాలు నిర్మల్‌ ప్రాంతంలో జీవిస్తున్నాయి. బొమ్మల తయారీకి వీరు యంత్రాల్ని వాడరు. వీరి కుటుంబాల్లో మహిళలు, చిన్న పిల్లలు సైతం బొమ్మల తయారీకి సహకరిస్తారు. తయారైన విడిభాగాలను అతికించటానికి చింతపిక్కల అబంలిని ఉపయోగిస్తారు. పొనికి చెక్క లభిస్తే నెలకు 50 బొమ్మలు తయరుచేస్తారు.రంగులు అద్ది వీరి సహకార సంఘం ద్వారా మార్కెట్‌ చేస్తే మూడువేల రూపాయలు లభిస్తాయి. సొసైటీ ద్వారానే కాకుండా వీరు తాము తయారు చేసిన బొమ్మల్ని అమ్ముకోవటానికి ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగితే అక్కడికి వెళ్ళి మార్కెట్‌ చేస్తున్నారు.

సమస్యలు

మార్చు

నిర్మల్‌ పెయింటింగ్‌‌కు దేశ విదేశాలలో ఎంతో పేరుంది. షో రూమ్‌ల ద్వారా వీటి మార్కెట్‌కు ప్రభుత్వం సహకరిస్తోంది. అయితే ఈ కళాఖండాలు ఖరీదైనవి కావడంతో కొనేవారు తక్కువ. అందుకే నకాషీలు ఇతరత్రా వృత్తులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు వచ్చిన ఫ్లెక్లీలు కూడా వీరి వృత్తిని దెబ్బతిస్తున్నాయి. కొందరు ఖమ్మం జిల్లాకు వెళ్లి కార్పెంటర్లుగా జీవనం సాగిస్తున్నారు. విదేశీ ఫర్నిచర్‌ దిగుమతి, రెడీమేడ్‌ ఫర్నిచర్‌ షాపుల సంఖ్య పెరగటంతో నకాషీల వృత్తి దెబ్బతింది. కొందరు కార్లకు పెయింట్‌ వేయడం, ఇంకొందరు దర్జీపని చేపట్టినా అక్కడా యంత్రాల రెడీమేడ్‌ షాపులు రాకతో వీరికీ పనులు కరువయ్యాయి. చివరకు మట్టి, రంపపు పొట్టు కలిపి అరటి, సీతాఫలం, ఆపిల్‌ వంటి బొమ్మలను తయారుచేసి తోపుడు బళ్లపై అమ్ముతున్నారు.`నకాషీ కులస్థులు నేటికీ సంచార జాతిగా జీవిస్తున్నారు.కనుక బీసీ-బి గ్రూప్‌నుంచి బీసీ -ఏగ్రూప్‌లోకి మార్చాలని వీరు కోరుతున్నారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నకాషీ&oldid=4308575" నుండి వెలికితీశారు