గిరిలాల్ జైన్

టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడు

గిరిలాల్ జైన్ (1924 - 19 జూలై 1993) ఒక భారతీయ పాత్రికేయుడు. అతను 1978 నుండి 1988 వరకు టైమ్స్ ఆఫ్ ఇండియాకు సంపాదకుడిగా పనిచేశాడు. అతను హిందూ జాతీయవాదం పట్ల సానుభూతిపరుడు, ఈ అంశంపై పుస్తకాలను కూడా రచించాడు, వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది, ది హిందూ ఫినామినన్, ఇది ఇతని మరణానంతరం ప్రచురించబడింది.[1]

గిరిలాల్ జైన్
జననం1924
మరణం19 జులై 1993
(వయస్సు 69)
వృత్తిపాత్రికేయుడు

భారత ప్రభుత్వం అతనికి 1989లో పద్మ భూషణ్ గౌరవ పురస్కారాన్ని అందించింది.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

గిరిలాల్ జైన్ ఢిల్లీకి ఆగ్నేయంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో ఉన్న ఒక గ్రామీణ కుటుంబంలో జన్మించాడు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. అతను 1951లో సుదర్శన్ జైన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, వీరిలో చరిత్రకారిణి మీనాక్షి జైన్, కాలమిస్ట్ సంధ్యా జైన్ ఉన్నారు. అతని కుమారుడు సునీల్ జైన్ జర్నలిస్టు, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ ఎడిటర్. సునీల్ జైన్ 15 మే 2021న 58 సంవత్సరాల వయస్సులో COVID-19 నుండి వచ్చిన సమస్యల కారణంగా మరణించాడు.[3]

గిరిలాల్ జైన్ 19 జూలై 1993న తన 69వ ఏట మరణించాడు.[4]

విమర్శలు

మార్చు

కుష్వంత్ సింగ్ తన కెరీర్ చివరలో, గిరిలాల్ జైన్ రచనలు "ముస్లిం వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక, సిక్కు వ్యతిరేక పక్షపాతాన్ని" చూపించాయని వ్రాశాడు. అతని హిందుత్వ సానుభూతి ఫలితంగా జైన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్‌గా తొలగించబడినట్లు నివేదించబడింది.

పదవీ విరమణ తర్వాత, అతను హిందుత్వ సంస్థలకు మరింత మద్దతుదారుగా మారాడు, అతని కుమార్తె మీనాక్షి జైన్ మరణానంతరం సవరించి ప్రచురించిన ది హిందూ ఫినామినాన్ అనే పుస్తకాన్ని రాసింది.

అయోధ్య

మార్చు

హిందువుల స్వీయ-పునరుద్ధరణ, స్వీయ-ధృవీకరణ ప్రక్రియలో భాగంగా అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమాన్ని గిరిలాల్ జైన్ స్వాగతించాడు.

జవహర్‌లాల్ నెహ్రూ రూపొందించిన రాజకీయ-ఆర్థిక క్రమం దాని మూలపురుషుడైన మార్క్సిస్ట్-లెనినిస్ట్-స్టాలినిస్ట్ క్రమం వలెనే చివరి దశలో ఉందని అతను నమ్మాడు.

మూలాలు

మార్చు
  1. Singh, Khushwant (August 31, 1994). "Book review: Girilal Jain's 'The Hindu Phenomenon'". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-10-08.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.
  3. "Financial Express managing editor Sunil Jain passes away". 15 May 2021.
  4. "Girilal Jain, 69, Editor; Backed Indira Gandhi". The New York Times. 1993-07-26.