కుష్వంత్ సింగ్

భారతదేశానికి చెందిన రచయిత, న్యాయవాది, దౌత్యవేత్త, విలేఖరి మరియు రాజకీయ నాయకులు (1915-2014)

కుష్వంత్ సింగ్ (ఫిబ్రవరి 2 1915మార్చి 20 2014) భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు.ఇండో-ఆగ్లియన్ రచయితగా కుష్వంత్ సింగ్ విశిష్ట లౌకిక వాదిగా సుపరిచితులు.[1] దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. సిక్కుల చరిత్ర, సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్, సునిశితమైన హాస్యానికి పెట్టింది పేరు.[2] తన హాస్యం, కవిత్వం పై ప్రేమ మూలంగా ఆయన యోగన పత్రికకు సంపాదకులుగానూ, "ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా", "ద నేషనల్ హెరాల్డ్",, "హిందూస్థాన్ టైమ్స్" లకు సంపాదకత్వం వహించారు. కుష్వంత్ సింగ్ పంజాబ్‌లో స్వర్ణ దేవాలయంనుంచి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జర్నేల్ సింగ్ భిందర్‌వాలేను తన రచనలతో నేరుగా ఢీకొన్నప్పటికీ 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వానికి దూరమయ్యారు ఆపరేషన్ బ్లూస్టార్‌కు నిరసనగా ఆయన తనకు ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్' పురస్కారాన్ని వాపసు చేసారు. తర్వాత ప్రభుత్వం 2007లో ఆయనకు ‘పద్మవిభూషణ్' అవార్డును ప్రకటించింది.[3]

కుష్వంత్ సింగ్
న్యూఢిల్లో లో కుష్వంత్ సింగ్
జననం
కుశాల్ సింగ్

(1915-02-02)1915 ఫిబ్రవరి 2
హదాలి, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్థాన్ లోని పంజాబ్)
మరణం2014 మార్చి 20(2014-03-20) (వయసు 99)
న్యూఢిల్లీ, ఇండియా
మరణ కారణంసాధారణ మరణము
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థసెయింట్.స్టీఫెన్ కళాశాల, న్యూఢిల్లీ,
కింగ్స్ కళాశాల, లండన్
వృత్తిజర్నలిస్టు, రచయిత, చరిత్రకారుడు.
జీవిత భాగస్వామికవాల్ మాలిక్
సంతకం

జీవిత విశేషాలు

మార్చు

ప్రారంభ జీవితం

మార్చు

సింగ్ భ్రిటిష్ ఇండియా లోని కుషాబ్ జిల్లాలోని హదాలీ లో జన్మించారు. ఆయన సిక్కు మతాఅనికి చెందినవారు. ఆయన తండ్రి "సర్ శోభా సింగ్" ఢిల్లీలోని ప్రముఖ నిర్మాణ శిల్పి. ఆయన మామగారు "సర్దార్ ఉజ్జల్ సింగ్" (1895-1983) పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు.

ఆయన న్యాయవాద కోర్సు చదువుటకు ముందు న్యూఢిల్లీ లోని మోడర్న్ స్కూల్ లోనూ, లాహోర్ లోని ప్రభుత్వ కళాశాలలోనూ, న్యూఢిల్లీ లోని సెయింట్ కాలేజీ లోనూ విద్యనభ్యసించారు.[4][5]

కెరీర్

మార్చు

కుష్వంత్ సింగ్ "యోజన"[6] అనే భారత ప్రభుత్వ జర్నల్; ది ఎల్లస్ట్రేటెద్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే వారపత్రిక;, రెండు ముఖ భారతీయ వార్తాపత్రికలైన "ది నేషనల్ హెరాల్డ్", "హిందూస్థాన్ టైమ్స్"కు సంపాదకత్వం వహించాడు.ఈ కాలంలో "ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ" పత్రిక భారత దేశ ప్రముఖ పత్రికగా 65,000 నుండి 400000 వరకు సర్క్యులేషన్ పెంచుకుంది.[7] 9 సంవత్సరాలు ఈ వీక్లీలో పనిచేసిన తరువాత జూలై 25 1978 న ఆ పత్రిక యాజమాన్యం తక్షమే వైదొలగాలని కోరింది.[7] సింగ్ ఆ పదవిని వదలిన తర్వాత ఆ స్థానంలో కొత్త సంపాదకుడు అదే దినం చేరాడు.ఈ వారపత్రిక పాఠకులను బాగా కోల్పోయింది.[8]

సింగ్ ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఆయన స్వహస్తాలతో రచనలు చేసేవాడని చెబుతారు. ఆయన పనులు రాజకీయ వ్యాఖ్యానం, సమకాలీన వ్యంగ్య రచనల నుండి ఉర్దూ కవిత్వం, సిక్కు మత గ్రంథాల యొక్క విశిష్ట అనువాదాల వరకు ఉండేవి.[ఆధారం చూపాలి] ఈ రచనలలో పేరు ఉన్నప్పటికీ తన కాలం "విత్ మాలిస్ టు వర్డ్స్ ఒన్ అండ్ ఆల్" క్రమం తప్పకుండా లౌకిక బోధనలు, శాంతి సందేశాలను కలిగి ఉండేవి. మిగిలిన రచయితలో ఆయన వ్యక్తిగతంగా ధైర్యసాహసాలున్న రచయిత. ఆయన ఉర్దూ, పంజాబీ భాషలలో కూడా తన రచనలను కొనసాగించారు.

ఆయన రాసిన చివరి పుస్తకం "ది గుడ్, ది బాడ్ అండ్ ది రెడిక్యులస్" 2013 అక్టోబరులో ప్రచురితమైనది. ఆ తర్వాత ఆయన రచనలలను ఆపివేసినారు.[9]

రాజకీయ జీవితం

మార్చు

1980 నుండి 1986 వరకు కుష్వంత్ సింగ్ భారత దేశ ఎగువ సభ అయిన రాజ్యసభలో సభ్యునిగా ఉన్నారు. ఆయన చేసిన దేశ సేవకు భారత ప్రభుత్వ విశిష్ట పురస్కారమైన పద్మభూషణ అవార్డు 1974 లో వచ్చింది.ఆయన భారత సైన్యం జరిపిన "ఆపరేషన్ బ్లూ స్టార్"కు నిరసించి ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.[10] In 2007, the Indian government awarded Khushwant Singh the Padma Vibhushan. ఒక ప్రముఖ వ్యక్తిగా సింగ్ నాటి ప్రధానమంత్రి ఇంధిరా గాంధీ పరిపాలనలో పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలకు అనుకూలంగా వ్యవహరించేవారు. ఆయన వ్యంగ్యంగా "ఎస్టాబ్లిష్ మెంట్ లిబరల్" అనేవారు.భారత రాజకీయ వ్యవస్థలో సింగ్ విశ్వాసం "సిక్కు వ్యతిరేక అల్లర్ల"కు లోనై తద్వారా ఇందిరాగాంధీ హత్యకు దారితీసిందని కాంగ్రెస్ వారి ద్వారా అరోపించబడింది.కానీ అతను భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఇచ్చిన హామీని దృఢసంకల్పంతో సానుకూల ఉన్నారు,[11] న్యూఢిల్లీ హై కోర్టు న్యాయవాది అయిన హె.ఎస్.ఫూల్కా ద్వారా ఆవిష్కరించబడిన సిటిజన్స్ జస్టిస్ కమిటీలో కూడా పనిచేశారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన "కవాల్ మాలిక్"ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు (రాహుల్ సింగ్) , ఒక కుమార్తె (మాలా). సినిమా నటి "అమృతా సింగ్" ఆయన సోదరుడు అయిన దల్జీత్ సింగ్, రుక్షసాన సుల్తానా ల కుమార్తె. ఆయన న్యూఢిల్లీ లోని ఖాన్ మార్కెట్ సమీపంలో గల "సుజన్ సింగ్ పార్క్" వద్ద ఉండేవారు. ఢిల్లోలో మొదటి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ఆయన తండ్రి ద్వారా 1945 లో కట్టించబడిన ఆ "సుజనా సింగ్ పార్క్"కు ఆయన తాత గారిపేరుతో వ్యవహరిస్తారు.[12] తన పెద్ద మేనకోడలు టిస్కా చోప్రా ఒక ప్రసిద్ధ TV, సినిమా నటి..[13]

ఆయన మార్చి 21 2014 న సాధారణ మరణాన్ని పొందారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు. ఆయన మరణానికి దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ సంతాపాన్ని తెలియజేశారు.[14] ఆయన అంత్య క్రియలు ఢిల్లీలోని "లోఢి శ్మశాన వాటిక"లో అదే దినం జరిగినవి.[1]

గౌరవాలు , అవార్డులు

మార్చు
 • రాక్‌ఫెల్లర్ గ్రాంట్,1966
 • పద్మ భూషణ (1974) (1974) ( ఆయన దానిని 1984 లో స్వర్ణ దేవాలయం, అమృత్ సర్ లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ కు నిరసనగా తిరస్కరించారు)
 • హానెస్ట్ మాన్ ఆఫ్ ది యియర్ , సులభ ఇంటర్నేషనల్ (2000)
 • పంజాబ్ రట్టన్ అవార్డు, పంజాభ్ ప్రభుత్వంచే (2006)
 • పద్మ విభూషణ, భారత ప్రభుత్వం చే (2007)
 • సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవర్డు, సాహిత్య అకాడమీ,ఇండియా వారిచే (2010)
 • ఆల్ ఇండియా మైనారిటిస్ ఫోరం అన్యుయల్ ఫెలోషిప్ అవార్డు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుండి (2012)

పుస్తకాలు

మార్చు

లఘు కథా సేకరణలు

మార్చు
 • The Mark of Vishnu and Other Stories. London, Saturn Press, 1950.
 • The Voice of God and Other Stories. Bombay, Jaico, 1957.
 • A Bride for the Sahib and Other Stories. New Delhi, Hind, 1967.
 • Black Jasmine. Bombay, Jaico, 1971
 • The Collected Stories. N.p., Ravi Dayal, 1989.
 • The Portrait of a Lady
 • The Strain
 • Success Mantra
 • A Love Affair In London
 • ना काहू से दोस्‍ती ना काहू से बैर

నాటకాలు

మార్చు

టెలివిజన్ డాక్యుమెంటరీ: Third World—Free Press (also presenter; Third Eye series), 1982 (UK).

ఇది కూడా చూడండి

మార్చు
 • కర్మ, కుష్వంత్ సింగ్ వారిస్న లఘు కథ

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 TNN (20 March 2014). "Khushwant Singh, journalist and writer, dies at 99". The Times of India. Retrieved 21 March 2014.
 2. తెలుగు ఒన్ ఇండియాలో
 3. తెలుగు ఇండియా.కాం
 4. Khushwant Singh, Forward, in Aditya Bhattacharjea and Lola Chatterjee (eds), The Fiction of St Stephen's
 5. Vinita Rani, “STYLE AND STRUCTURE IN THE SHORT STORIES OF KHUSHWANT SINGH. A CRITICAL STUDY”, PhD Thesis, http://mjpru.ac.in/PhdDetails/PhdEnglish/PhdData/Vinita.doc Archived 2012-08-12 at the Wayback Machine
 6. "Yojana". Archived from the original on 24 అక్టోబరు 2013. Retrieved 18 September 2013.
 7. 7.0 7.1 Khushwant Singh (1993). "Farewell to the Illustrated Weekly". In Nandini Mehta (ed.). Not a Nice Man To Know. Penguin Books. p. 8. On 25 July 1978, one week before he was to retire, he was abruptly asked to leave with immediate effect. Khushwant quietly got up, collected his umbrella, and without a word to his staff, left the office where he had worked for nine years, raising the Illustrated Weekly's circulation from 65,000 to 400000. The new editor was installed the same day, and ordered by the Weekly's management to kill the "Farewell" column.
 8. "Khushwant Singh's Journalism: The Illustrated Weekly of India". Sepiamutiny.com. Archived from the original on 2009-06-22. Retrieved 2009-08-09.
 9. "Veteran Writer and Novelist Khushwant Singh passes away at 99". news.biharprabha.com. Retrieved 20 March 2014.
 10. "Those who said no to top awards". The Times of India. 2008-01-20. Retrieved 2008-11-05.
 11. Singh, Khushwant, "Oh, That Other Hindu Riot Of Passage," Outlook Magazine, November, 07, 2004 , available at [1]
 12. "Making history with brick and mortar". Hindustan Times. September 15, 2011. Archived from the original on 2012-12-05. Retrieved 2014-03-21.
 13. "Grandniece Tisca Chopra remembers granduncle Khushwant Singh". IANS. news.biharprabha.com. Retrieved 20 March 2014.
 14. "President, Prime Minister of India condole Khushwant Singh's Demise". IANS. news.biharprabha.com. Retrieved 20 March 2014.
 15. Singh, Khushwant (1963). A History of the Sikhs. Princeton University Press.
 16. Singh, Khushwant (1966). A History of the Sikhs (2 ed.). Princeton University Press.
 17. Singh, Khushwant (2004). A History of the Sikhs: 1469-1838 (2, illustrated ed.). Oxford University Press. p. 434. ISBN 9780195673081. Retrieved 1 July 2009.
 18. Singh, Khushwant (2005). A History of the Sikhs: 1839-2004 (2, illustrated ed.). Oxford University Press. p. 547. ISBN 9780195673098. Retrieved 1 July 2009.

ఇతర లింకులు

మార్చు