గిల్బర్ట్ మెండోంకా
గిల్బర్ట్ జాన్ మెండోంకా (జననం 9 అక్టోబర్ 1952) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మీరా భయందర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
నరేంద్ర మెహతా | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
తరువాత | నరేంద్ర మెహతా | ||
---|---|---|---|
నియోజకవర్గం | మీరా భయందర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుగిల్బర్ట్ మెండోంకా 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మీరా-భయందర్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై, 1990లో మీరా-భయందర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మీరా భయందర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మెహతాపై 10604 ఓట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మెహతా చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Mira Bhayandar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.