నరేంద్ర మెహతా (జననం 25 సెప్టెంబర్ 1972) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన మహారాష్ట్ర శాసనసభకు మీరా భయందర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

నరేంద్ర మెహతా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు గీతా భరత్ జైన్
నియోజకవర్గం మీరా భయందర్

పదవీ కాలం
2014 – 2019
ముందు గిల్బర్ట్ మెండోంకా
తరువాత గీతా భరత్ జైన్
నియోజకవర్గం మీరా భయందర్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-09-25) 1972 సెప్టెంబరు 25 (వయసు 52)
దేసూరి, పాలి, రాజస్థాన్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుమన్ మెహతా
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

నరేంద్ర మెహతా 1997లో భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికై, తర్వాత మేయర్‌గా పని చేశాడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మీరా భయందర్ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి గిల్బర్ట్ మెండోంకా చేతిలో 10604 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. నరేంద్ర మెహతా 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి గిల్బర్ట్ మెండోంకాపై 32,292 ఓట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

నరేంద్ర మెహతా 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మీరా భయందర్ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గీతా భరత్ జైన్ చేతిలో 15,535 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సయ్యద్ ముజఫర్ హుస్సేన్ పై 60,433 ఓట్ల గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. "Who is Narendra Mehta? Meet BJP candidate from Mira Bhayandar who lost to Geeta Jain in 2019 Maharashtra polls" (in ఇంగ్లీష్). Mint. 29 October 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.
  2. "Mira Bhayandar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  5. "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
  6. "Maharastra Assembly Election Results 2024 - Mira-Bhayandar" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.
  7. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)