గీతాంజలి (2014 సినిమా)

గీతాంజలి 2014 ఆగస్టు 8న విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు.

గీతాంజలి [1][2]
దర్శకత్వంరాజ్ కిరణ్
రచనకోన వెంకట్
నిర్మాతఎంవీవీ సత్యనారాయణ
తారాగణంశ్రీనివాస్ రెడ్డి
బ్రహ్మానందం
రావు రమేశ్
అంజలి
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
సంగీతంప్రవీణ్ లక్కరాజు
విడుదల తేదీ
2014 ఆగస్టు 8 (2014-08-08)
దేశంభారత్
భాషతెలుగు

కథ సవరించు

దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారాలి అనె లక్క్ష్యాంతొ నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాదు చేరుకుంటాడు. తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ శ్మశానానికి సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. నందిగామ నుంచి హైదరాబాదు ప్రయాణంలో ఇష్టపడిన అంజలి అనే అమ్మాయి తరచుగా ఆ ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది.

దిల్‌రాజు క్రియేటివ్ టీమ్ అని చెప్పిశ్రీనివాస్‌ను సత్యం రాజేశ్, జబర్ధస్త్ శంకర్‌లు బురిడీ కొట్టించి ఆ ఫ్లాట్‌లో చేరుతారు. అలా ఫ్లాట్‌లో చేరిన వారికి దెయ్యం రూపంలో ఎదురైన అనుభావాలేమిటి? శ్రీనివాస్‌రెడ్డి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అంజలికి ఆఫ్లాట్‌కు సంబంధమేమిటి? ఆ ఫ్లాట్‌లో యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆఫ్లాట్‌లో నిజంగా దెయ్యం ఉందా? అనే ప్రశ్నలకు కామెడీ టచ్ చేసి హారర్ రూపంలో అందించిన సమాధానమే ’గీతాంజలి’.

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

మూలాలు సవరించు

  1. "Geethanjali 2014th Movie Review". filmcircle.com. 9 August 2014. Archived from the original on 9 August 2014. Retrieved 9 August 2014.
  2. "Geethanjali 2014th Movie Review". ApToday. 9 August 2014. Archived from the original on 11 August 2014. Retrieved 9 August 2014.

బయటి లంకెలు సవరించు