Portrait of Indian playback singer Geeta Dutt.jpg

గీతా దత్ (బంగ్లా: গীতা দত্ত, గీతా ఘోష్ రాయ్ చౌదరీ గా జన్మించారు) (నవంబర్ 23, 1930జూలై 20, 1972) 1950లు మరియు 60లలో హిందీ చలన చిత్ర గీతాలు ఆలపించిన భారతీయ నేపథ్య గాయకురాలు, మరియు ఆధునిక బెంగాలీ గీతాలను ఆలపించిన గాయకురాలు కూడా.

Geeta Dutt
జన్మనామం Geeta Ghosh Roy Chowdhury
జననం (1930-11-23) 1930 నవంబరు 23
ప్రాంతము Faridpur, Bangladesh
మరణం 1972 జూలై 20 (1972-07-20)(వయసు 41)
సంగీత రీతి playback singing
వృత్తి Singer
వాయిద్యం Vocalist
క్రియాశీలక సంవత్సరాలు 1946–1971

ప్రారంభ జీవితంసవరించు

గీతా దత్ 1930లో ఫరీద్‌పూర్ (అప్పట్లో భారతదేశంలో భాగమైన బెంగాల్‌లో ఉండేది; ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భాగంగా ఉంది) లోని ఒక ధనిక జమిందార్ల కుటుంబంలో గీతా ఘోష్ రాయ్ చౌదరీగా జన్మించారు. ఆమెకు పన్నెండేళ్ల వయసులో అంటే, 1942లో, ఆమె తల్లితండ్రులు బాంబే (ప్రస్తుతం ముంబై) లోని దాదర్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌కు తమ మకాం మార్చారు. అక్కడ, స్వరకర్త/సంగీత దర్శకుడు అయిన హనుమాన్ ప్రసాద్ ఒకసారి అనుకోకుండా ఆమె పాటని వినడంతో పాటు ఆమె స్వరంలోని మాధుర్యానికి ఆయన ఎంతో ముగ్థులయ్యారు. దీంతో గాయనిగా ఆమెకు శిక్షణ అందించేందుకు ఆయన ముందుకు వచ్చారు. అటుపై భక్త ప్రహ్లాద (1946) చిత్రంలోని ఒక కోరస్ (బృంద గానం) గీతం ద్వారా ఆమెను వెండితెరకు పరిచయం చేశారు, ఈ కోరస్ గీతంలో భాగంగా ఆమె కేవలం రెండు పంక్తులు మాత్రమే ఆలపించారు. అయితే, ఆమె ఆలపించిన ఆ రెండు పంక్తులే సినీరంగంలో ఆమె నిలదొక్కుకునేందుకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాతి సంవత్సరం, నేపథ్య గాయనిగా ఆమె దో భాయి చిత్రం ద్వారా ఒక పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకున్నారు, దీంతోపాటు ఆ చిత్రం కోసం గీతా రాయ్ ఆలపించిన గీతాలు ఆమెను ఒక అగ్రశ్రేణి నేపథ్య గాయకురాలిగా ముందు వరుసలో నిలబెట్టాయి.[1]

వృత్తి జీవితంసవరించు

గీతా రాయ్ గురించి ఇక్కడ ఉన్న ఈ వ్యాసాన్ని సంగీతాభిమానిగా చిరకాల అనుభవం కలిగిన నాసిర్ అలీ రాశారు:[2]

పందొమ్మిదివందల నలభైలకు చెందిన గీతా రాయ్ గురించి తెలుసుకునేందుకు మనల్ని మనం పరిమితం చేసుకున్నప్పటికీ, కనీసం కౌమార ప్రాయం కూడా దాటక ముందే ఎవరికీ తెలియని ఒక అనామక బాలిక స్థాయి నుంచి లక్షలాది మంది ఆరాధించే ఒక ఆదర్శమూర్తి స్థాయికి ఆమె చేరుకున్న వైనం గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి గురికాకుండా ఉండలేం.

దేవేంద్రనాథ్ ఘోష్ రాయ్ చౌదరికి చెందిన జమిందారీ కుటుంబ వారసురాలైన ఆమె, అమియా దేవి కడుపున పదిమంది సంతానంలో ఒకరిగా 1930 నవంబర్ 23న సెంట్రల్ బెంగాల్‌లోని ఫరీద్‌పూర్‌లో జన్మించారనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. పుట్టిన ఊరిని మరియు ఇతర ఆస్తులను విడిచిపెట్టి నలభైల ప్రారంభంలో కలకట్టాకు చేరిన గీతా రాయ్ కుటుంబం, అటు తర్వాత 1942లో బాంబే (ప్రస్తుతం ముంబై) కి చేరింది. పరిస్థితుల ప్రాబల్యం కారణంగానే అప్పట్లో ఆ కుటుంబం అలా చేయాల్సి వచ్చింది తప్ప దీర్ఘకాల అన్వేషణలో భాగంగా మాత్రం కాదు. బ్రిటీష్ పాలన కాలంలో బెంగాల్ ఒక అద్వితీయమైన జాతీయవాద కేంద్రంగా ఉండేది. 1905లో లార్డ్ కర్జన్ ద్వారా ఆ ప్రాంతం పశ్చిమ బెంగాల్ గాను, తూర్పు బెంగాల్ గానూ విభజించబడింది. అయితే, 1911లో ఆ రెండు ప్రాంతాలను మళ్లీ ఒకటిగా చేశారు.అలాగే రాజధానిని ఢిల్లీకి మార్చడంతో పాటు బీహార్ మరియు ఒరిస్సాలను ప్రత్యేక రాష్ట్రాలుగా సృష్టించడం కూడా జరిగింది. అయితే, 1947లో పాకిస్థాన్‌ను ఏర్పాటు చేసిన సమయంలో బెంగాల్ చివరిసారి విభజనకు గురైంది. ఇందులో భాగంగా అత్యధిక ముస్లిం జనాభాకు ఆలవాలమైన బెంగాల్‌లోని తూర్పు భాగం తూర్పు పాకిస్థాన్‌గా ఏర్పాటైంది. అటుపై 1971లో ఈ ప్రాంతం పాకిస్థాన్ నుంచి కూడా విముక్తం పొంది బంగ్లా దేశ్‌గా అవతరించింది. ఇక గీతా రాయ్ జన్మించిన ఫరీద్‌పూర్ ప్రాంతం అదిల్‌పూర్ (లేదా ఇదిల్‌పూర్) కు చెందిన ఒక పరగానా, ఇది బెంగాల్‌లో ఒక భాగంగా ఉండేది.

నలభైల ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా అధ్వానమైన పరిస్థితులు చోటు చేసుకోవడమే కాకుండా ప్రత్యేకించి భారతదేశంలో అత్యంత అధ్వానమైన పరిస్థితులు నెలకొని ఉండేది. ఆ సమయంలో జపాన్ వారు భారతదేశంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించడమే కాకుండా 1942లో వారు బర్మాను ఆక్రమించారు. ఆ సమయంలో "భూ దహన" విధానాన్ని అమలు చేసిన బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం, జపాన్ వారికి ఆహార పదార్ధాల సరఫరా అపివేసేందుకు ఈ విధానాన్ని చిట్టగాంగ్ వద్ద ప్రారంభించింది. 1943లో, బెంగాల్‌లో కనీవిని ఎరుగని భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడడంతో 3.5 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం కరువు కారణంగా మృతి చెందిన వారిని సమీపాన ఉన్న గ్రామాలకు తరలించేవారు. మరోవైపు జపాన్ వారు తమ భూభాగంలోకి అడుగుపెట్టడంతో గ్రామాల్లోను మరియు ప్రాచీన ప్రాంతాల్లోనూ నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచి నిష్క్రమించడం ప్రారంభించారు. అలా గ్రామాలను విడిచిపెట్టినవారంతా నగరాల వైపు తమ పయనాన్ని సాగించారు. ఆ సమయంలో సమైక్యంగా ఉన్న బెంగాల్‌కు కలకట్టా (ప్రస్తుతం కోల్‌కతా) రాజధానిగా ఉండేది. గ్రామాలను విడిచి పెట్టిన లక్షలాది శరణార్థులు నగరాలకు, ప్రత్యేకించి కలకట్టాకు చేరుకోవడం ప్రారంభం కావడానికి కేవలం కొద్దిరోజుల ముందు గీతా రాయ్ కుటుంబం కలకట్టాకు వలస రావడానికి బహుశా బెంగాల్‌లో ఏర్పడిన ఆనాటి దుర్భర పరిస్థితులే కారణం కావచ్చు. అలా ఆ రోజుల్లో ఫరీద్‌పూర్ నుంచి వలస వచ్చిన వారిలో విద్యావేత్త మరియు రచయిత అయిన కాజీ అబ్దుల్ వాదద్, రాజకీయవేత్త, విద్యావేత్త, రచయిత అయిన అయిన హుమయున్ కబీర్, కవి అయిన సునీల్ గంగోపాధ్యాయలతో సహా మరెందరో ప్రముఖులు కూడా ఉన్నారు.

ఈ రకమైన పరిస్థితుల మధ్య కలకట్టా సైతం శాంతి మరియు భద్రతకు అనువైన ప్రదేశంగా భరోసా ఇవ్వలేక పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే భారతదేశంలోకెల్లా అత్యంత భరోసా కలిగిన నగరంగా బాంబే వృద్ధి చెందడం ప్రారంభమైంది, "సోన్ కి చిదియా", "ది గోల్డెన్ బర్డ్" లేదా ఎల్ డొరాడో అని సైతం కొంతమంది ఈ నగరం గురించి సంబోధించే వారు. మరోవైపు 1943 నాటికి, వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుతో సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త థియేటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో, సొంతంగా సినిమా స్టూడియోలను నిర్మించిన వారు స్వతంత్రంగా సినిమాలు రూపొందించేందుకు ఈ పరిస్థితి వారికొక వరంగా మారింది. అదేసమయంలో సర్వజనీన స్వభావం కలిగిన బాంబే వైపుగా దేశంలోని పశ్చిమ భాగానికి చెందిన అనేక మంది కళాకారులు దృష్టిసారించారు. దీంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి, ముఖ్యంగా పంజాబ్, యునైటెడ్ ప్రొవియెన్స్ (UP) మరియు బెంగాల్ నుంచి వచ్చిన అనేక మందికి బాంబే ఒక ప్రధాన స్థావరంగా తయారైంది. లయబద్ధమైన డోలక్ స్వేచ్ఛతో సహా UP మరియు రాజస్థాన్‌లకు చెందిన జానపద-రాగాలు, బెంగాల్‌కు చెందిన రవీంద్ర సంగీత్ మరియు పంజాబ్‌కు చెందిన హీర్, భాంగ్రా-ఆధారిత పాటలను సైతం ఆనాటి బాంబే సాదరంగా ఆహ్వానించింది. అంతేకాదు చూపుకు నోచుకోని ప్రఖ్యాత గాయకుడు, నటుడు అయిన K.C. డే సైతం 1942లో తాత్కాలికంగా తన మకాంను బాంబేకు మార్చారు. ఇలాంటి తరుణంలోనే పరిస్థితుల కారణంగా ఇబ్బందులకు గురైన గీతా రాయ్ కుటుంబం అదృష్టం కొద్దీ చిత్ర పరిశ్రమ కార్యకలాపాలకు కేంద్రమైన దాదర్‌లో సొంత ఇంటిని కొనుగోలు చేసింది. ఆ సమయంలో గీత వయసు కేవలం పన్నెండేళ్లు.

ఆ తర్వాత, మూడు-నాలుగేళ్ల పాటు ఒక సాధాసీధా అమ్మాయి లాగే గీత కూడా తన పాఠశాల చదువును కొనసాగించింది. అప్పట్లో ఆమె చదివిన బెంగాలీ హైస్కూల్‌ను ఆమె ఎన్నటికీ మర్చిపోలేదు: గీతా రాయ్ లేదా గీతా దత్‌గా పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత కూడా ఆ పాఠశాలలో జరిగే దుర్గా పూజకు ఆమె తప్పకుండా హాజరయ్యేవారు. 1971 వరకు అంటే, 1972లో ఆమె మరణించడానికి ముందు ఏడాది వరకు ఆమె ఎప్పుడు కూడా ఈ పూజకు హాజరు కాకపోవడం జరగలేదు! ఒక అమ్మాయిగా, అదృష్టం కొద్దీ విభిన్న వర్గాలకు చెందిన వారితో కలిసి ప్రయాణించడం వల్ల ఆమె హిందీ భాషా ప్రావీణ్యం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడింది. అయితే, పాటకే ఆమె ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు. పాడడాన్ని ఆమె ఎంతగా ప్రేమించే వారంటే, ఫరీద్‌పూర్‌లో ఉన్నప్పుడు సైతం కుటుంబ బంధువైన హరేంద్రనాథ్ నంది ద్వారా ఆమె ప్రాథమిక స్థాయి సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఆమె తన స్వగ్రామంలో ఉన్న సమయంలో గ్రామఫోన్ రికార్డులు మరియు సినిమాల నుంచి పాటలను నేర్చుకోవడంతో పాటు జానపద గీతాలు మరియు సంగీతాన్ని కూడా ఒంటబట్టించుకున్నారు. దాదర్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన గీతా రాయ్ మరియు లతా మంగేష్కర్‌ల వృత్తి జీవితం యాదృచ్ఛికంగా ఒకే రకమైన సంఘటనతో ప్రారంభమైంది: రైలులో తనలో తాను పాడుకుంటున్న లత పాట విని ప్రముఖ సంగీత దర్శకుడు గులాం హైదర్ ఆమెకు అవకాశం కల్పిస్తే, గీత తన నివాసంలో బాల్కనీలో నిల్చుని పాడుతున్న సమయంలో కింద వీధి వెంట వెళ్తున్న సంగీత దర్శకుడు పండిట్ హనుమాన్ ప్రసాద్ ఆ పాట విని ఆమెకు నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు. ఆ విధంగా గీతా దత్ మరియు లతా మంగేష్కర్‌లు ఇద్దరూ కూడా తమ వృత్తి జీవితం ప్రారంభంలో సంగీత దర్శకుల ద్వారా గుర్తించబడి అటు తర్వాత అంచెలంచెలుగా పైకి ఎదిగారు. అయితే, గీత విషయంలో ఈ రకమైన ఎదుగుదల అనేది చాలా తొందరగా అంటే, 1946లోనే చోటు చేసుకుంది!

ఈ క్రమంలో 1946వ సంవత్సరంలో పండిట్ హనుమాన్ ప్రసాద్ సంగీత సారథ్యంలో పౌరాణిక చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రం కోసం గీతా రాయ్ తొలిసారిగా నేపథ్య గాయనిగా మారారు. ఈ చిత్రం కోసం ఆమె ఆలపించిన అబ్ జానీ రే పెహచానీ రే; మరియు సునో సునో విన్టీ హమారీ అనే రెండు పంక్తులు ఆమెను ఏమాత్రం గుర్తింపు లేని ఒక పాఠశాల అమ్మాయి స్థాయి నుంచి ఒక గొప్ప నేపథ్యగాయని స్థాయికి తీసుకువెళ్లాయి. దీంతోపాటు సునో సునో హరికి లీల మరియు జాగ్ ఉతే హమ్ జాగ్ ఉతే అనే రెండు కోరస్ గీతాలను కూడా ఆమె పాడారు.

ఇక 1946లో విడుదలైన మరికొన్ని చిత్రాల్లో సైతం నేపథ్య గాయనిగా ఆమె తన ప్రతిభను చాటారు. హనుమాన్ ప్రసాద్ సంగీత సారథ్యంలో 1946లో నాలుగు చిత్రాలు విడుదల కాగా, వాటిలో రసీలి మరియు నై మా చిత్రాల కోసం గీతా రాయ్ రెండు పాటలను పాడారు. రసీలిలో నైనోన్ కి ప్యాలి సే హోటోన్ కి మదిర మరియు నేహ లగాకే ముఖ్ మోద్ గయా అనే పాటలను ఆలపించిన ఆమె, నై మా చిత్రం కోసం ప్రముఖ నేపథ్య గాయకుడు పారుల్ ఘోష్‌తో కలిసి ఆజా రీ నిందియా ఆజా అనే లాలిపాట లేదా ‘Lori' ను పాడారు.

1946 ప్రారంభంలో అసాధారణ సంగీత దర్శకుడు మాస్టర్ గులాం హైదర్ సంగీత సారథ్యంలో మెహతాబ్ (అటుపై ఆమె Mrs. సోహ్రాబ్ మోడీగా మారారు) నటించిన బైరామ్ ఖాన్ చిత్రం కోసం గీతా రాయ్ పాటలు పాడారు. ఇందులో భాగంగా వాలి సహాబ్ రాసిన జబ్ చాంద్ జవాన్ హోగా టాబ్ ఛాంద్‌నీ రాటోన్ మేన్ జన్నత్ కా సమా హోగా అనే పాటను ఆమె పాడారు. అప్పట్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేపథ్య గాయని శంషాద్ బేగంతో కలిసి గీతా రాయ్ ఈ పాటను పాడారు. షంషాద్ బేగం, గీతా రాయ్‌లు కలిసి పాడిన ఈ పాటలో గొంతు కలిపిన నసీమ్ బేగం మరియు మునవ్వర్‌లు అటు తర్వాత పాకిస్థాన్‌ చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయనిలుగా పేరు సాధించారు. ఈ సమయంలోనే శంషాద్ బేగంతో గీతా రాయ్ స్నేహబంధం బలపడడంతో పాటు శంషాద్ బేగాన్ని ఆమె "ఆపా" అని ఆప్యాయంగా పిలిచేవారు. ఈ రకమైన ఆప్యాయత కారణంగానే తాను కలిసి పనిచేసిన అత్యుత్తమ కళాకారుల్లో గీతా రాయ్ కూడా ఒకరని శంషాబాద్ ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

ఇక పాటల విషయానికి వస్తే సర్కస్ కింగ్ చిత్రం కోసం అభయంకర్ జోషి మరియు నాగేశ్వర్ రావ్‌ల ద్వయం స్వరపర్చిన ప్రీతి కిసీ కో నా ఛోడే పాటను గీతా రాయ్ ఆలపించారు. గీతా రాయ్‌కి సంబంధించి మొట్టమొదటగా విడుదలైన పాట ఇదేనన్నది కొందరి వాదన.

దీని తర్వాత కాశ్మీర్ కి కలి చిత్రం కోసం హే కిష్ణే మేరీ హస్రాతన్ మేన్ ఆగ్ పాటను ఆమె ఆలపించారు. ఈ పాటను స్వరపర్చిన మాస్టర్ వితాల్ ఈ చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించారు. ఇక ఈ చిత్రంలోనే హాయ్ ఇస్ ప్యార్ నే దీవానా అనే యుగళ గీతాన్ని ఆమె మాస్టర్ వితాల్‌తో కలిసి పాడారు.

రస్తాలో జాఫర్ ఖుర్షీద్ స్వరకల్పనలో గీతా రాయ్ పాడిన నయీ బహారెన్ ఆయీన్ అనే పాట ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఈ పాట మనకు పంకజ్ ముల్లిక్ ప్రఖ్యాత గీతం ఆయే బహర్ అహా అహా అహాను గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే, గీతా రాయ్ ఆలపించిన పాట సైతం అదే రకమైన పల్లవిని కలిగి ఉండడంతో పాటు దాని సంగీతం సైతం ఆ పాటలో లాగానే వేగంగా ఉంటుంది.

దిలీప్ కుమార్ నటించిన చిత్రంగా మనం గుర్తుచేసుకునే మిలాన్, నటుడు అభి భట్టాచార్యకు మొదటి హిందీ చిత్రం, ఇది 1946లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఖ్యాత బెంగాలీ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాల్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గీతా రాయ్ రెండు పాటలను పాడారు. అందులో ఒకటైన ఛాన్ మేన్ బజేగి బన్సూరియా అనే పాట మరుపురాని ఆ పాత మధురంగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో గీత పాడిన మరో పాట తుమ్హే సాజన్ మనాయేన్ తుమ్ రూత్ జానా అనే పల్లవితో సాగుతుంది. నిజానికి, మిలాన్‌కు బెంగాలీ రూపమైన నౌకా దూబి చిత్రం కోసం కూడా ఆమె రెండు గీతాలను పాడారు. అయితే ఈ పాటలకు సంబంధించిన రికార్డులు అంత సులభంగా లభించే పరిస్థితి లేదు.

దీని తర్వాతి సంవత్సరం కూడా గీతా రాయ్ వృత్తి జీవితం తీరిక లేకుండా గడిచింది. ఇందులో భాగంగా ఆమె 1947లో ఒక ఊపు ఊపిన నీల్ కమల్ (మధుబాల మరియు రాజ్‌కపూర్ జంటగా నటించిన చిత్రం) చిత్రం కోసం సంగీత దర్శకుడు బి. వాసుదేవ్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలను ఆలపించారు. కింద పేర్కొన్న పాటలు గీతా రాయ్ గళం నుంచి జాలువారాయి:

బోల్ బోల్ బాలమ్ భేదార్ది తేరీ క్యా మర్జి రే- రాజ్‌కుమార్ మరియు కోరస్‌తో కలిసి.

మా నే భేజా ధోర్ ఛరానే- రాజ్‌కుమార్ మరియు కోరస్‌తో కలిసి.

ఆంక్ జో దేఖే హై ధోకా ఖయే హై- ముకేశ్ మరియు రాజ్‌కుమార్‌తో కలిసి.

జవానీ అగార్ హూక్ దిల్ కి దబాయే- రాజ్‌కుమార్ మరియు కోరస్‌తో కలిసి.

బ్రిజ్ మేనీ ధూమ్ మాచే జా- రాజ్‌కుమార్ మరియు భట్కర్‌తో కలిసి.

ఆఘా-నర్మద-షాయిక్ ముక్తార్ నటించిన భూఖ్ చిత్రంలో శంషాద్ బేగంతో కలిసి గీతా రాయ్ ఒక యుగళ గీతాన్ని పాడారు: హే హసీనోన్ కే మేలే అల్బేలే అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. ఇక ఈ చిత్రంలో వినిపించే ఆంక్ మేన్ రయే కియాన్ ఆష్క్ అనే పాటను కూడా గీతా రాయ్ ఆలపించారు. అలాగే ఇస్ జాగ్ మేన్ ఘరీబోన్ కా నా కోయ్ తికానా అనే పాటను కూడా గీత ఈ చిత్రం కోసం పాడారు. ఈ చిత్రానికి అనిల్ బిస్వాస్ సంగీతాన్ని అందించారు.

1947లో విడుదలైన జాదూయ్ రతన్ (మంత్రాల రత్నం) చిత్రానికి చిత్రగుప్త సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం గీత కింది పాటలను ఆలపించారు:

నయనోన్ మేన్ ఆనా, మేరే మాన్ మేన్ సమానా అనే పాటను రాధా గోవింద్‌తో కలిసి ఆలపించారు.

మేరా నన్హా సా దిల్ పియా లూట్ లియో రే పాటను రాధా గోవింద్‌తో కలిసి ఆలపించారు.

వాహ్ రుట్ బాదల్ గయి, వాహ్ తరనా బాదల్ గయా – అనే పాటను ఆమె సోలోగా పాడారు.

విపరీత మనస్తత్వం కలిగిన ఒక సంగీత దర్శకుడిగా పేరుపొందిన సాజద్ హుస్సేన్, అప్పట్లో చాలామందిపై విమర్శలు ఎక్కుపెట్టేవారు. తానేమీ నౌషద్ రాగం "ఆప్ కో ఔర్ మెహంత్ కర్ని పడేగి" కాదని చెప్పడం ద్వారా లతా మంగేష్కర్‌ను చీవాట్లు పెట్టడం లేదా తలాత్ మహమ్మద్‌ని "ఘలాట్ మహమ్మద్‌"గా పేర్కొనడంతో పాటు మదన్ మోహన్‌ని గ్రంథ చోరుడని నిందించడం లాంటి విమర్శల ద్వారా ఆయన తన విపరీత మనస్తత్వాన్ని బయటపెట్టారు. అలాంటి సంగీత దర్శకుడు సైతం గీతా రాయ్ విషయంలో మొక్కవోని నమ్మకాన్ని కలిగి ఉండేవారు, అందుకు నిదర్శంగా ఆయన సంగీత దర్శకత్వం వహించిన కసమ్ చిత్రం కోసం ఐదు సోలో గీతాలను ఆలపించే అవకాశాన్ని గీతా రాయ్‌కి కల్పించారు. ఆ పాటలను కింద పేర్కొనడం జరిగింది:

వాహ్ జిస్కో మిటా బైతే.

దమన్ కో హాతే సే వాహ్ చుదా కర్ చలే గయే. సునా జా కోయ్ గీత్ ఏ దిల్ సునా జా.

ఏ దిల్ బాతే కిస్కో కరూన్ ప్యార్.

యా రాబ్ హమారీ ఆహ్ మేన్.

కొన్ని కచ్చితంగా నిర్థారించని ఆధారాల ప్రకారం ఈ చిత్రం విడుదల కాలేదు.

దీని తర్వాత మరో చిత్రమైన మేరే భగవాన్‌లోనూ సాజద్ హుస్సేన్ నాలుగు పాటలను గీతా రాయ్ చేత పాడించారు. అందులో రెండు పాటలు:

ఓ శ్యామ్ మీరా కే గిరిధారీ మరియు కోరస్.

ముజే బవ్రీ బవ్రీ లోగ్ కయేన్.

ప్రత్యేకించి ఇందులోని రెండో గీతం అత్యంత మధురంగా ఉండడంతో పాటు "సాజద్ శైలి"లో ప్రత్యేకంగా ఉంటుంది.

పెహ్‌లీ పెహ్‌చాన్ చిత్రానికి బులో C. రాణి/హన్స్‌రాజ్ బెహల్‌లు సంగీతాన్ని అందించారు. మెయిన్ హూన్ ఫూలోన్ కి రాణీ, కాన్టోన్ మేన్ రహ్‌నేవాలీ లాంటి గీతాలను రాణి స్వరపర్చారు. ఇక ముస్కురాతే హో కోన్, ఇత్‌రాతే హో కోన్ గీతాలను బెహల్ స్వరపర్చారు. వీటిని A.R. ఓజాతో కలిసి గీతా రాయ్ ఆలపించారు. అదే ఏడాది తోఫా చిత్రంలో గీతా రాయ్ ఒక విషాద గీతాన్ని ఆలపించారు: వాహ్ దిల్ గయా దిల్ కే సహారే చాలే గయే అంటూ సాగే ఈ గీతాన్ని M.A. రవూఫ్ స్వరపర్చారు. ఇది హృదయాన్ని ఆకట్టుకునే గీతం!

పై పాటలతో పాటు 1947లో రూపొందిన మరికొన్ని చిత్రాల్లోనూ గీతా రాయ్ కొన్ని పాటలను పాడారు:

ఫిల్మీస్టాన్ నిర్మించిన లీలా చిత్రం కోసం ఓయ్ రాజా మోహే అప్నీ బనా లే రే అనే పాటను గీత ఆలపించారు. ఈ చిత్రానికి C. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో బినాపాణితో కలిసి ఆమె ఒక యుగళ గీతాన్ని కూడా ఆలపించారు: మేరీ ఆంఖేన్ ఛామ్ ఛామ్..క్యా ఇసికా నామ్ అనే పల్లవితో ఆ పాట సాగుతుంది.

దీని తర్వాత మళ్లీ ఫిల్మీస్టాన్ నిర్మించిన షెహనాయ్ చిత్రంలోనూ గీతా రాయ్ పాటలు పాడారు. ఈ చిత్రానికి కూడా C. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసిర్ ఖాన్-రెహానాలు నటించారు. ఈ చిత్రంలో ఒక హాస్య గీతం ఉంది: జవానీకి రైల్ చలే జాయే రే అనే పల్లవితో సాగే ఈ పాటను ఒక ఉత్సవంలో భాగంగా జరిగే ప్రదర్శనలో నటించే పాత్రలపై చిత్రీకరించారు. గీతా రాయ్‌తో పాటు లతా మంగేష్కర్ మరియు చిటాల్కర్ (C.రామచంద్ర) మరియు కోరస్‌లు ఈ పాటను ఆలపించారు. చాద్‌తీ జవానీ మేన్ జూలో మేరీ రాణీ అంటూ సాగే మరో పాటను చిటాల్కర్ మరియు బీనాపాణీలతో కలిసి గీతా రాయ్ ఆలపించారు. ఆ రోజుల్లో ఈ పాట చాలా ప్రాచూర్యం పొందింది.

గీత్ గోవింద్‌ (1947) కోసం గైయన్ దత్ స్వరపరిచిన పాటలను గీతా రాయ్ మరియు G.M. దురానీలు ఆభాతో కలిసి రెండు త్రయాలుగా ఆలపించారు: చమ్కాత్ దమ్కాత్ దామినీ, మరియు వియోగన్ దీప్‌శిఖా సి జారే అనే పల్లవితో ఆ పాటులు సాగుతాయి.

అజీజ్ ఖాన్ సంగీతాన్ని అందించిన ఉతో జాగో చిత్రంలో హ్యాన్స్ హాన్స్ కే అనే పాటను గీతా రాయ్ ఆలపించారు.

1947లో వచ్చిన గావోన్ (గ్రామం) అనే చిత్రం కోసం కూడా గీతా రాయ్ కొన్ని పాటలు ఆలపించారు. ఖేమ్‌చంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని వతన్ కీ మాతీ హాత్ మేన్ లేకర్ అనే యుగళ గీతాన్ని గీతా రాయ్- ముకేశ్‌లు కలిసి ఆలపించారు.

S.D. బర్మన్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయమైన కొత్త సంగీత దర్శకుడి ఊహను సైతం గీతా రాయ్ స్వరం ఆక్రమించుకోగలిగింది. 1944లో సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం బాంబే చేరుకున్న ఆ సంగీత దర్శకుడు అప్పటికే రెండు చిత్రాలకు సంగీతాన్ని అందించి ఉన్నా ఆయన ప్రతిభ అప్పటికి పూర్తిగా వెలుగులోకి రాలేదు. అలాంటి సమయంలో S.D. బర్మన్ తన సంగీత దర్శకత్వంలో సిద్ధమవుతున్న డూ భాయ్ చిత్రంలోని తొమ్మిది పాటల్లో ఆరు పాటలను పాడే అవకాశాన్ని గీతా రాయ్‌కి కల్పించారు. వీటిలో నాలుగు సోలో గీతాలు కాగా రెండు యుగళ గీతాలు. మరోవైపు సంగీతంపై తనకు ఉన్న ప్రేమానురాగాలకు తోడు, మెట్రిక్యులేషన్ పరీక్షలకు కూడా సిద్ధం కావాలని గీత సంకల్పించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆ మరుసటి సంవత్సరమైన 1947లో ఆమెకు రెట్టింపు సంతోషాన్ని కలిగించే విషయాలు చోటు చేసుకున్నాయి: ఒక పక్క పరీక్షల్లో పాస్ అయిన ఆమె, 1947లో విడుదలైన డో భాయ్ చిత్రంలో పాడిన పాటలకు గాను బంగారు పతకాన్ని అందుకున్నారు.

డో భాయ్ చిత్రంలో గీతా రాయ్ కింద పేర్కొన్న గీతాలను పాడారు:

యాద్ కరోగే యాద్ కరోగే ఇక్ దిన్ హమ్‌కో యాద్ కరోగే;

ఆజ్ ప్రీత్ కా నాతా టూట్ గయా (G.M. దురానీతో కలిసి) ;

హమేన్ ఛోద్ కే పియా కిస్ దేస్ గయే.

మేరే పియా టాహ్ బేస్ పరదేశ్.

యాద్ రఖ్‌నా, యాద్ రఖ్‌నా.

మేరా సుందర్ సప్నా బీట్ గయా.

డో భాయ్ సంగీత విజయం (ప్రత్యేకించి "మేరా సుందర్ సప్నాబీట్ గయా" పాట) సాధించడంతో అప్పటివరకు ఉన్న నేపథ్యగాయనుల్లో గీతా రాయ్ అగ్రస్థానం దక్కించుకున్నారు.

దీని తర్వాత S.D. బర్మన్ సంగీత దర్శకత్వంలో 1947లో విడుదలైన దిల్ కి రాణి చిత్రంలోనూ గీత పాటలు పాడారు. మధుబాల-రాజ్‌కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఆయేంగే ఆయేంగే రే; క్యోన్ బలామ్ హంసే రూత్ గయే; బిగ్డీ హువీ తఖ్‌దీర్ మేరీ ఆకే బనా దే; ఆహా మేరే మోహన్ నే ముజ్‌కో బులాయా పాటలను గీత ఆలపించారు. దీంతోపాటు ఇద్దరు నేపథ్యగాయకులతో కలిసి ఆమె ఓ దునియా కే రెహ్‌నేవాలే బటా అనే పాటను ఆలపించారు. (ఈ చిత్రంలో ఈ పాట సోలో రూపంలోనూ కనిపించడంతో పాటు దానిని రాజ్ కపూర్ స్వయంగా పాడారు) .

మరోవైపు 1950లో బంగ్లా చిత్రం సమర్‌లో ఖేలా భంగర్ ఖేలా అనే పాట పాడే అవకాశాన్ని కూడా S.D. బర్మన్, గీతా రాయ్‌కి కల్పించారు. ఈ విధంగా బెంగాలీలోనూ పాడడం ప్రారంభించిన గీతా రాయ్ అప్పటినుంచి 1960ల రెండో అర్థభాగం వరకు దాన్ని కొనసాగించారు. S.D. బర్మన్ మరియు గీతా రాయ్-దత్‌ల బృందం కలిసి మొత్తం 70 మధురమైన పాటల –ను రూపొందించింది. ఇందులో ఒక ప్రసిద్దమైన హాస్య గీతం కూడా ఉంది, మేన్ తేరే ప్యార్ మేన్ కయా కయా నా బనా దిల్బార్ అంటూ సాగే ఈ పాటను 1964లో రూపొందించిన జిద్ది చిత్రంలో శోభా ఖోటే మరియు మహమ్మద్‌లపై చిత్రీకరించారు. మన్నా డేతో కలిసి గీతా రాయ్ ఈ పాటను పాడారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన సంగీత దర్శకత్వంలో 1947లో వచ్చిన చిత్తోర్ విజయ్ చిత్రం కోసం గీతా రాయ్ ఆలపించిన రెండు పాటలకు సంబంధించిన వివరాలు తగినంత మొత్తంలో లభ్యం కావడం లేదు. ఈ చిత్రంలో మధుబాల మరియు రాజ్ కపూర్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. సురేంద్ర మరియు వస్తిలు ఈ చిత్రంలో సహాయక పాత్రలు పోషించారు. ఇందులో హో రంగీలా హో రసీలా రఖే కా దిన్ ఆయే రే అంటూ సాగే యుగళ గీతాన్ని శంషాద్-గీత పాడారు.

కొందరు విమర్శకులు గీతా రాయ్ జీవితానికి, K.L. సైగల్ జీవితానికి మధ్య పోలికలు వెతికేందుకు ప్రయత్నించడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. అయితే, ఇద్దరూ కూడా మధ్యానికి బానిసై చివరకు కాలేయం దెబ్బతినడం ద్వారా మరణానికి దగ్గరయ్యారనే ఒకే ఒక్క అంశం ప్రాతిపదికగా వారిద్దరి మధ్య ఈ రకమైన పోలిక తేవడం అర్థ రహితమని నేను అనుకుంటాను. అవును, వారిద్దరూ నలభై ఏళ్ల లోపే మరణించిన మాట వాస్తవం. అయితే, సైగల్ సాబ్ లాగా పాట రికార్డు చేయాలంటే, "కాలీ పాంచ్" (మధ్యం సీసా) ఉండి తీరాల్సిన అగత్యమేదీ గీతా రాయ్ జీవితంలో చోటు చేసుకోలేదు. వ్యక్తిగతమైన బాధల ఫలితంగానే గీతా రాయ్ జీవితంలో మద్యం అలవాటు ప్రవేశించిందే తప్ప అలవాటుగానో లేకుంటే తగినంత ఆత్మవిశ్వాసం లేకపోవడం మూలంగానో ఆమె జీవితంలోకి మద్యం ప్రవేశించలేదు. అలాగే K.L. సైగల్ ఒక అద్వితీయమైన నటుడు-గాయకుడు. ఇక 1967లో వచ్చిన బంగ్లా చిత్రం బధు భరన్ చిత్రంలో ప్రదీప్ కుమార్‌‌తో ఆమె నటించినప్పటికీ గీతా రాయ్ వృత్తి రీత్యా నటి కాదు. బాజి (1951) చిత్రం నిర్మాణం సమయంలో గీతా రాయ్‌తో ప్రేమలో పడిన గురు దత్, 1953లో ఆమెను వివాహం చేసుకోవడమే కాకుండా, ఆమెను హీరోయిన్‌గా పెట్టి "గౌరి" అనే పేరుతో భారతదేశ తొలి సినిమా స్కోప్ చిత్రాన్ని నిర్మించనున్నట్టు 1957లో ప్రకటించారు. అయితే కొద్ది రోజుల షూటింగ్ అనంతరం ఆయన తన ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. అయినప్పటికీ, కాఘజ్ కీ పూల్ (1959) చిత్రం గురించి ఆలోచించినప్పుడెల్లా అది "గౌరీ" చిత్రానికి సంబంధించిన కథేననే ఆలోచన నాలో ఎందుకు చోటు చేసుకుంటుందో నాకు అర్థం కాదు. ఈ చిత్రంలో కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్ పాత్రలో వహీదా రెహ్మాన్ నటించారు. ఆ పాత్ర గీతా రాయ్‌కి ప్రతిరూపమా! ఆ సినిమా కథని మరొకసారి గుర్తు చేసుకుందామా? పెళ్లైన దర్శకుడు సురేష్ (గురు దత్ ఈ పాత్రని పోషించారు) కొత్తగా సినీ రంగంలోకి వచ్చిన శాంతి (వహీదా రెహ్మాన్ ఈ పాత్రను పోషించారు) తో ప్రేమలో పడతాడు. ఈ కారణంగా సురేష్ వ్యక్తిగత వైవాహిక జీవితం మరియు వృత్తి జీవితం రెండూ కూడా ముక్కలవుతుంది.

ఇక మనం గీతా రాయ్ ప్రారంభ జీవితాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే, ఆమె జీవిత గమనానికి మరియు అద్వితీయ గాయకుడు మహమ్మద్ రఫీ జీవితానికి మధ్య మనకు అనేక పోలికలు కన్పిస్తాయి: రఫీ విషయాన్నే తీసుకుంటే, ఆయన పుట్టిన గ్రామంలో ఒక ఫఖీర్ ఆలపించే పాటలు వినేందుకు ఆయన మక్కువ ప్రదర్శించేవారు; గీత విషయానికి వస్తే, గంగా నదికి దిగువన ఉండే పద్మా నదిపై పడవ నడిపే వ్యక్తి పాడే పడవ పాటలను వినేందుకు గంటలు తరబడి నది తీరంలో గడిపేవారు. ఈ రకమైన ప్రభావం ఆ ఇద్దరి జీవితాల్లోనూ ఒకేలా ఉండేది. వారిద్దరూ కూడా తాము వినే పాటల విషయంలో మైమరచిపోయేవారు, అంతేకాదు పాటను మరియు సంగీతాన్ని ప్రేమించేలా వారి హృదయంలో బలమైన కోరిక నాటుకోవడానికి ఈ అంశమే వారిద్దరి జీవితాల్లో ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. గీత, రఫీలు ఇద్దరూ కూడా నదులు కలిగిన ప్రదేశం నుంచి వచ్చినవారే: ఒకరేమో ఐదు నదులకు ఆలవాలమైన పంజాబ్‌కు చెందినవారైతే, మరొకరు అనేక ఉప నదులకు మూలమైన గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు కలిగిన ప్రాంతానికి చెందినవారు. ఒకరేమో పాకిస్థాన్‌లో భాగమైన లాహోర్ నుంచి తరలివచ్చిన వారు కాగా; మరొకరు తూర్పు పాకిస్థాన్‌లో భాగమైన స్వగ్రామం ఫరీద్‌ఫూర్ నుంచి వచ్చారు. 1971లో తూర్పు పాకిస్థాన్ విమోచన పొంది బంగ్లాదేశ్‌గా అవతరించిందనుకోండి. అయితే అది వేరే విషయం. గీత, రఫీలు ఇద్దరూ కూడా నలభైల ప్రారంభంలోనే బాంబే చేరడం కోసం వందలాది మైళ్లు ప్రయాణించారు, ఎందుకంటే బాంబేలో వారి కోసం బంగారు భవిష్యత్ చేతులు చాచి మరీ ఎదురు చూస్తోంది.

1946 ప్రారంభంలో మాన్ సరోవర్ కోసం మహమ్మద్ రఫీతో కలిసి గీతా రాయ్ పాటలు పాడారు: జై హింద్....సునో హింద్ హింద్ కి కహానియాన్ అంటూ సాగే ఈ దేశభక్తి గీతం, అటుపై వారిద్దరూ కలిసి పాడిన 150కి పైగా పాటలకు ఒక ప్రారంభ గీతంగా పరిణమించింది. ఈ పాటకు శంకర్ రావ్ వ్యాస్ సంగీతాన్ని అందించారు. .

అద్భుతమైన పాటలు కలిగిన సాజన్ (1947) చిత్రానికి C. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో గీతా రాయ్ పాడిన పాటలు:

హమ్ బంజారే సంఘ్ హమారే ధూమ్ మచాలే దున్యా...

ఇది చాలా వరకు జిప్పీ పాట లాగా ఉంటుంది. ఈ పాటలో గీతా రాయ్ స్వరం అత్యంత వైవిధ్యంగా ఉంటుంది (మహమ్మద్ రఫీ, లలితా దేయుల్కర్, C.రామచంద్ర స్వరాలతో పాటు కోరస్ కూడా ఈ పాటలో వినిపిస్తుంది) .

సంభాల్ సంభాల్ కే జైహో ఓ బంజారే దెల్లీ దూర్ హై....

ఇదొక దేశభక్తి గీతం, ఇందులో భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు విన్పించడంతో పాటు భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, "జవాహర్‌"గా కన్పిస్తారు.

ఇక 'నలభైల్లో' గీత-రఫీలు కలిసి పాడిన యుగళగీతాల గురించి మనం ఇప్పుడు కూడా ప్రస్తావించుకోవచ్చు. మహమ్మద్ రఫీ మరియు గీతా రాయ్-దత్‌లు జీవించి ఉన్నట్టైతే ఆ తర్వాతి దశాబ్దాల్లో కూడా కలిసి పాడి ఉండేవారేమో తెలియదు గానీ, ఉన్న ఆ కొద్ది కాలంలోనే వారు 162 విజయవంతమైన యుగళ గీతాలను తమ ఖాతాలో వేసుకున్నారు. గీతా రాయ్ కలిసి పాడిన నేపథ్య గాయకులందరిలో మహమ్మద్ రఫీతో కలిసి పాడిన యుగళ గీతాల సంఖ్యే ఎక్కువ.

1948లో చునారియా విడుదలైంది. ఈ చిత్రానికి హన్స్‌రాజ్ బెహ్ల్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కోసం ఫూల్ కో భూల్ కే లే బైతా ఖార్...తేరా కంటో సే హై ప్యార్ ప్యార్ లాంటి యుగళ గీతాలని గీతా రాయ్ మరియు మహమ్మద్ రఫీలు కలిసి ఆలపించారు. ఇదొక తత్వ సంబంధ గీతం, మెరిసేదంతా బంగారం కాదనే నిజాన్ని ఈ పాట నొక్కి చెబుతుంది. అందమైన ఆలాప్స్‌ని కలిగిన ఈ గీతాన్ని గీతా రాయ్ మరియు రఫీ సాబ్‌లు తమదైన ప్రతిభతో రక్తి కట్టించారు. మరోవైపు చునారియాలోని అద్భుతమైన సంగీతం హన్స్‌రాజ్ బెహ్ల్‌ని అప్పట్లో సినీ పరిశ్రమను ఏలిన ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలబెట్టింది. ఈ చిత్రంలోనూ గీతా రాయ్ ఒక హాస్య గీతాన్ని ఆలపించారు: ఓ మోటార్ వాలే బాబు అనే పల్లవితో ఈ హాస్య గీతం సాగుతుంది. అంతేకాకుండా నేపథ్య గాయని ఆశా భోంస్లే ఈ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. గీతా రాయ్ మరియు జోహ్‌రాజన్ అమబలవాలీలతో కలిసి ఆశా భోంస్లే ఈ చిత్రంలో తన స్వరాన్ని వినిపించారు. "సవాన్ ఆయా రే" అనే రెండు పంక్తులను ఆశా భోంస్లే ఈ చిత్రం కోసం పాడారు.

సంగీత దర్శకుడు అజీజ్ ఖాన్ (కొన్ని సమయాల్లో ఆయనను అజిజ్ హిందీగా కూడా పేర్కొంటుంటారు) మరియు ఖయ్యమ్ (అప్పట్లో సంగీత దర్శక ద్వయం శర్మాజీ-వర్మాజీలలో శర్మాజీ) లు సైతం గీతా రాయ్ స్వరంలోని మాధుర్యం నుంచి తప్పించుకోలేక పోయారు. హీర్ రంజా చిత్రంలోని మొత్తం పన్నెండు పాటల్లో ఖయ్యమ్ ఏడు పాటలను రికార్డ్ చేశారు. 1948లో విడుదలైన ఈచిత్రంలో ఖయ్యమ్ రికార్డు చేసిన ఏడు పాటల్లో ఆరు పాటలను గీతా రాయ్ ఆలపించారు. ఇందులో కొన్ని యుగళ గీతాలు కూడా ఉన్నాయి. ఆ పాటల వివరాలు:

దిల్ భుజా జాతా హై నషాద్ హువా జాతా హై :

ఇదొక విషాద గీతం, ప్రియుడిని కోల్పోయిన ప్రేయసి విషాదంలో మునిగిపోయిన సమయంలో ఈ పాటను పాడుతుంది. గీతా రాయ్ ఆలపించిన మిగిలిన పాటలతో పోలిస్తే ఇది కొంత వైవిధ్యంగా ఉంటుంది. అలాగే కొంత ఉచ్ఛ స్వరంలో కూడా ఉంటుంది. ఆమె ఈ పాటకు కొంత వైవిధ్యాన్ని జోడించారు - అయితే అది చాలా అద్భుతంగా వినిపించింది.

కఫాస్ కీ ఖ్యాయిద్ మేన్ హమ్‌కో హై యాదేన్ అషియాన్ బాఖీ- (G.M. దురానీతో కలిసి) :

G.M. దురానీతో కలిసి గీతా రాయ్ ఆలపించిన మానసికోద్వేక పాటల్లో ఇది కూడా ఒకటి, అంతేకాకుండా ఆనాటి ప్రచారకర్తల యొక్క వేర్పాటుకు సంబంధించి జ్ఞాపకాలను ఇది అందిస్తుంది. కఫాలు మరియు ఖ్యాయిద్‌ల ఉపయోగం గురించి ఇది పదేపదే చూపుతుంది.

ఉద్ పుద్ జానియా, గెయూన్ ఖండ్ ఖానియా:

గీతా రాయ్ పాడిన పంజాబీ పాటను మీరు వినాలనుకుంటే, ఈ పాట మీకు ఆ రకమైన అనుభూతిని చక్కగా అందిస్తుంది. ఈ పాట విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సర్ధుల్ క్వాత్రా లాంటి పంజాబీ సంగీత దర్శకులు పంజాబీ శ్రావ్యతను ఉపయోగించనప్పటికీ, ఈ పాటలో గీతా రాయ్ కనబర్చిన వైవిధ్యం అటు తర్వాతి సంవత్సరాల్లో పంజాబీ సినీ పరిశ్రమ ఆమె నైపుణ్యాన్ని విపరీతంగా ఉపయోగించుకునేందుకు ఈ పాట ఒక వేదికగా మారింది.

దిల్ యూన్ యూన్ కర్తా హై (నేపథ్య గాయకునితో కలిసి పాడిన యుగళ గీతం) :

గీతా రాయ్ స్వరంలోని చిలిపితనాన్ని రుచి చూపించిన ఈ నాలుగో పాట అత్యంత శృంగారభరితంగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గులాం హైదర్ ఆమె స్వరాన్ని తగిన విధంగా ఉపయోగించుకోలేదు. ఒకవేళ ఆయన ఈ పాటను వినడం మర్చిపోయారా? ఆమె ఆలపించిన ఒక అద్భుతమైన 'హర్‌కాటెయిన్' ఇది.

తేరీ జాత్ హై అక్బరీ సర్వారీ (నేపథ్య గాయకునితో కలిసి గీత పాడిన యుగళ గీతం) :

ఇది పిర్యాదుకి సంబంధించిన ఒక ముస్లిం భక్తి గీతం. ఈ పాటను గీతా రాయ్ తనదైన శైలిలో పాడారు.

తేరీ మేరీ దోస్తీ కహానీ బాన్ గయీ:

ఇదొక హాస్య గీతం, కొత్తగా శృంగారాన్ని రుచి చూసిన సమయంలో ఈ పాట వినిపిస్తుంది. ఈ పాటలో కూడా గీతా రాయ్ తనదైన శైలిని ప్రదర్శించారు.

అయితే, హీర్ రంజా చిత్రంలో విషాద గీతం, శృంగార భరిత గీతం, భక్తి గీతం, పంజాబీ భాషలో వినిపించే ప్రాంతీయ గీతం లాంటి అనేక రకాల ప్రక్రియలు మనకు కనిపిస్తాయి. మరోవైపు గీతా రాయ్ స్వరంలోని స్థాయిని, వైవిధ్యాన్ని కూడా ఈ చిత్రం చక్కగా ప్రదర్శిస్తుంది.

గులాం హైదర్ సంగీత దర్శకత్వంలో దిలీప్ కుమార్-కామినీ కౌషల్‌ జంటగా నటించిన షాయిద్ చిత్రం కోసం కూడా గీతా రాయ్ తన స్వరాన్ని అందించారు: ఆజా భేదార్దీ బాల్మా కోయి రో రో పుకారే అంటూ సాగే పాటను గీత ఆలపించారు. మరోవైపు ఈ చిత్రంలో పాడేందుకు ప్రయత్నించిన లతా మంగేష్కర్‌ను ఈ చిత్ర నిర్మాత తిరస్కరించారు. ఈ సమయంలో సురీందర్ కౌర్ అనే కొత్త గాయకుడిని గులాం హైదర్ వెలుగులోకి తెచ్చారు, ఆ రోజుల్లో సురీందర్ కౌర్ పాటలకు మంచి ఆదరణ ఉండేది. మరోవైపు షాహీద్ చిత్ర నిర్మాత తిరస్కరించిన లతా మంగేష్కర్ స్వరాన్ని మరింత సానబెట్టే విషయాన్ని గులాం హైదర్ సవాలుగా తీసుకున్నారు. అలా లతకు మంచి తర్ఫీదు అందించిన ఆయన తన "ఆవిష్కరణ" మజ్‌బూర్ (1948) ద్వారా ఆమెకు అతిపెద్ద బ్రేక్ ఇచ్చారు. అయితే గులాం హైదర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోనూ మేన్ టు రేహ్ గయి ఆజ్ అకేలీ రే అనే పాటను గీతా రాయ్ పాడారు. అంతే కాకుండా లతా మంగేష్కర్‌తో కలిసి గోరీ సఖియోన్ సే అంకియాన్ చురా రహి రే మరియు హర్ షాయ్ పే జవానీ హై అనే యుగళ గీతాలను కూడా గీత పాడారు.

1948లో వచ్చిన పద్మినీ చిత్రం కోసం గులాం హైదర్ సంగీత సారథ్యంలో గీతా రాయ్ అనేక పాటలను ఆలపించారు. అశోక్ కుమార్‌తో కలిసి ఆమె ఆలపించిన సపేరా బీన్ బజాయో రే గీతం అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. అలాగే G.M. దురానీతో కలిసి హరి చునారియా వాలి కా దిల్ అట్కా అనే పాటను ఆమె ఆలపించారు. ఇవి మాత్రమే కాకుండా వాలీ సహాబ్ రాసిన ఆజా ఆజా ఓ బిదేసీ బాలమ్ మరియు మోరా జియా నహిన్ బాస్ మేన్ అనే పాటలనూ ఆమె ఆలపించారు. వీటన్నింటితో పాటు మోర్ అంగ్‌నా కాగ్ నా బోలే అనే పాటను కూడా ఆమె పద్మినీ చిత్రం కోసం పాడారు.

1948లో చందాకి చాందినీ అనే చిత్రం కూడా విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె ఉల్ఫాట్ కే దర్ద్ కా కభీ మజాలో మరియు ఓహ్ జాదూగర్ కాయే అనే పాటలను పాడారు.

1948లోనే విడుదలైన హువా సవేరా చిత్రంలో సైతం గీత ఆలపించిన పాట చోటు చేసుకుంది: మోర్ మాన్ మేన్ సమాయా హై ప్యార్ అంటూ సాగే ఈ పాటకు జియాన్ దత్ స్వరాలు అందించగా, భగవతీ ప్రసాద్ వాజ్‌పాయ్ ఈ పాటను రాశారు. ఈ పాట పల్లెటూరి యాసతో సాగుతుంది. అయితే, గీతా రాయ్ నైపుణ్యాన్ని ఆ రోజుల్లో జియాన్ దత్ సహాబ్ విస్తారంగా ఉపయోగించుకోలేక పోయారు. బులో C రాణి మాత్రం ఆమె నైపుణ్యాలను విస్తారంగా ఉపయోగించుకోవడం జరిగింది.

1948లో గీతా రాయ్ మరిన్ని పాటలను కూడా ఆలపించడం జరిగింది. అయితే వాటి గురించి మనం ఇక్కడ పూర్తిగా విశ్లేషించబోవడం లేదు. అలాంటి పాటల్లో మచ్చుకు కొన్ని:

మేరీ కహానీ చిత్రంలో ఆమె సురేంద్రతో కలిసి యుగళ గీతం ఆలపించారు: వాదా కర్కే కిసీసే నా ఆనా అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. దీంతోపాటు K.దత్తా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రో రో కే సునాతే అనే పాటను కూడా ఆమె ఆలపించారు. అలాగే ఇదే చిత్రం కోసం సురేంద్రతో కలిసి ఆమె, బుల్‌బుల్ కో మిలా పూల్ అనే యుగళ గీతాన్ని కూడా పాడారు.

ఇక ఫిల్మీస్ట్యాన్ నిర్మించిన యాక్టరస్ కోసం శ్యామ్ సుందర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కోసం శంషాద్ బేగంతో కలిసి గీతా రాయ్ రెండు యుగళ గీతాలను పాడారు: అన్కోన్ అన్కోన్ మేన్ మరియు ఓ గోరీ తేరీ బంకా చాయిలా అనే పల్లవులతో ఈ పాటలు సాగుతాయి.

దీని తర్వాత గీతా రాయ్- శంషాద్ బేగం కలిసి ఆలపించిన యుగళ గీతం అంజుమాన్‌లో వినిపించింది. నర్గీస్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో నర్గీస్ నటించారు. ఈ చిత్రానికి బులో C. రాణీ సంగీతం అందించారు. ప్యార్ తేరా మేరా మేరా తేరా ప్యార్ అనే పల్లవితో సాగే పాటను గీత ఈ చిత్రం కోసం పాడారు.

దీని తర్వాత సుహాగ్ రాత్ (1948) చిత్రం కోసం గీతా రాయ్ మరియు శంషాద్ బేగం కలిసి మరో పాటను ఆలపించారు: మేరే దిల్ కి దడ్కనో మేన్ సఖీ కౌన్ ఆ సమయా అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. ఈ పాటలోని కొన్ని పంక్తులను విని పండిట్ నెహ్రూ చాలా సంతోషించడంతో పాటు కిదర్ శర్మను కవి-నిర్మాత అని మెచ్చుకున్నారు. పండిట్ నెహ్రూను అంతగా మైమరపించిన ఆ పాటలోని పంక్తులు: ఆన్కోన్ మేన్ ఆన్‌ఖైన్ దాల్ తునే ముజ్కో క్యా పిలాయా, జిస్ తారే పార్ నజర్ పడి వు తరా లడ్కాడయా అంటూ సాగుతాయి. అంతేకాకుండా గీతా రాయ్ మరియు రాజ్‌కుమార్‌లు కలిసి పాడిన అందమైన యుగళ గీతం కూడా ఈ చిత్రంలో చోటు చేసుకుంది: బాజే మోరీ పాయల్ తున్నక్ తున్నక్ అనే పల్లవితో ఆ యుగళ గీతం సాగుతుంది. అలాగే రాజ్‌కుమారీతో కలిసి గీతా రాయ్ ఆలపించిన రుంజుహుమ్ మత్వాలే బాదల్ చా గయే అనే పాట కూడా ఈ చిత్రంలో చోటు చేసుకుంది. ఈ చిత్రం ద్వారా స్నేహల్ భట్కర్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అలాగే గీతా బాలి కూడా నటిగా ఈ చిత్రంతోనే రంగ ప్రవేశం చేశారు. అటు తర్వాతి కాలంలో గీతా బాలి కోసం గీతా రాయ్ అనేక ఆణి ముత్యాల వంటి పాటలు పాడారు.

చంద్రలేఖలో చోటు చేసుకున్న నాచే ఘోడా బీచ్ బజార్ అనే యుగళ గీతాన్ని అంతగా ప్రాముఖ్యం లేని నేపథ్య గాయకునితో కలిసి గీతా రాయ్ ఆలపించారు. ఈ చిత్రానికి S. రాజేశ్వర రావ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని ఇతర పాటలన్నింటినీ ఉమా దేవి ఆలపించినప్పటికీ, గీతా రాయ్ పాడిన పాట మాత్రం ప్రజల ఆదరణ పొందింది.

ద్వి భాషా (గుజరాతీ/హిందీ) కథానాయకి అయిన నిరూపా రాయ్, గుణసుందరి చిత్రంలో నటించడంతో పాటు ఆ పాత్ర ద్వారా ఆమె బాగా ప్రచారం పొందారు. ఈ చిత్రం కోసం బులో C. రాణీ సంగీత దర్శకత్వంలో ననదియా మారే అనే పాటను గీతా రాయ్ ఆలపించారు. (ఇదే పాటను గీతా రాయ్ గుజరాతీ వెర్షన్ కోసం కూడా పాడారు) .

1948లో వచ్చిన మరో చిత్రం టూటే తారేకు సౌకత్ దేహెల్వీ "నాషద్" సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కోసం ముకేష్‌తో కలిసి గీతా రాయ్ రెండు యుగళ గీతాలు పాడారు: రాజా మోహే లే చల్ తు దెల్లీకి సైర్ కో మరియు రెహ్‌తే హో అబ్ తూ హర్ ఘాడీ అనే పల్లవులతో ఈ పాటలు సాగుతాయి. ఇవి మాత్రమే కాకుండా నాజర్ సే మిలీ హై నాజర్ పెహ్‌లే హో.. పెహ్‌లే పెహ్‌లే అనే సోలో గీతాన్ని కూడా గీత ఆలపించారు.

చాంద్ సితార్‌లో ఆజా మేరే బాల్మా కైసీ సుహానీ రాత్ హై అనే సోలో గీతాన్ని గీతా రాయ్ ఆలపించారు. ఈ చిత్రానికి ప్రేమ్‌నాథ్ సంగీతాన్ని అందించారు.

అంజానా అనేది అప్పట్లో భారత భూషన్ పురస్కారం పొందిన చిత్రం. ఈ చిత్రానికి D.C. దత్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కోసం గీతా దత్ మరియు శంకర్ దాస్‌లు సూరజ్ జాగా దర్తి జాగీ మరియు సాబ్ నగ్రీ దూంద్ ఫిరీ నైనా నా పాయే సన్వారియా అనే యుగళ గీతాలను పాడారు.

1948లో వచ్చిన హాస్య చిత్రం హిప్ హిప్ హుర్రేలోని దుబేయ్ జి కో పక్వాన్ మిలా అనే పాటను హనుమాన్ ప్రసాద్, గీతా రాయ్ మరియు G.M. దురానీలచే పాడించారు. ఈ పాటను సహిర్ లుథియాన్వీ రాశారు. దీంతోపాటు జవానీ హమ్ గుజారేన్ అనే పాటను శంషాద్ బేగం మరియు S. బల్బీర్‌లతో కలిసి గీతా రాయ్ పాడారు.

మొట్ట మొదటి మిస్ ఇండియా (1947) ప్రమీల నటించిన ఆప్ బీటి చిత్రానికి హరిబాయ్ మిస్ట్రీ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని మోర్ సాయియాన్ భయే కోట్‌వాల్ అనే పాటను గీతా రాయ్ మరియు రాజ్‌కుమారిలు కలిసి పాడారు.

జీనే దో చిత్రానికి సౌకత్ దేహెల్వీ సంగీతాన్ని అందించారు. అటు తర్వాతా ఆయన సిని రంగంలో "నాషద్" పేరుతో ప్రాముఖ్యం పొందారు. ఈ చిత్రం కోసం సున్ సున్ రి బుల్‌బుల్ దీవానీ అనే ఒక అందమైన పాటని గీతా రాయ్ పాడారు.

రెహనా నటించిన ఖిద్‌కీ చిత్రం కోసం లతా మంగేష్కర్ మరియు చిటాల్కర్‌లతో కలిసి గీతా రాయ్ ఒక అందమైన పాటను ఆలపించారు. తేరే బినా సునా సునా అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడైన P.L. సంతోషీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, C.రామచంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

మొత్తంమీద 1948లో గీతా రాయ్ సాహసవంతులైన సంగీత దర్శకుల సారథ్యంలో అనేక పాటలు పాడారు. మాస్టర్ గులాం హైదర్, హన్స్‌రాజ్ బెహ్ల్, బులో C. రాణీ, శ్యాం సుందర్, K.దత్తా, షౌకత్ దేహెల్వీ లేదా నాషద్, చిత్రగుప్త్, ఖయ్యమ్, జియాన్ దత్, S. రాజేశ్వర రావ్, R.A. పైన్‌జంకర్, S.D. బటిష్, అజిజ్ ఖాన్, ముకుంద్ మసురేకర్, హనుమాన్ ప్రసాద్, C. రామచంద్ర లాంటి సాహసవంతులైన దర్శకులందరూ గీతా రాయ్‌తో అద్భుతమైన పాటలు పాడించారు. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం గురించి ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అది ఏమిటంటే, ఒక గాయకురాలిగా మొదటి రెండేళ్ల కాలంలో గీతా రాయ్ దాదాపు 75 పాటలు పాడారు, ఆ రకంగా ఆమె సాధించిన ఘనత నేటికీ అలాగే నిల్చి ఉంది. అంతేకాదు ఆ రోజుల్లో గీతా రాయ్ పాటకు ఉన్న ఆదరణ ఏపాటిదనే విషయాన్ని కూడా ఇది మనకు స్పష్టం చేస్తుంది.

1949కి వచ్చేసరికి, రాత్ కి రాణి (1949) చిత్రం కోసం హన్స్‌రాజ్ సంగీత సారథ్యంలో ముకేష్‌తో కలిసి గీతా రాయ్ ఒక యుగళ గీతాన్ని ఆలపించారు. శ్యామ్ మరియు మునావర్ సుల్తానా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, గీతా రాయ్, ముకేష్‌లు పాడిన అదే పాటను కొన్ని కారణాల వల్ల మహమ్మద్ రఫీ మరియు లతా మంగేష్కర్‌ల స్వరంతో రీరికార్డ్ చేయడం జరిగింది.

అటు తర్వాత జెవ్‌రాత్ చిత్రం కోసం హన్స్ రాజ్ సంగీతంలో ఆయా మేరా సాజన్ ఆయా అనే పాటను గీతా రాయ్ పాడారు.

అలాగే హన్స్‌రాజ్ బెహ్ల్ సంగీత దర్శకత్వం వహించిన చకోరీ కోసం నైనో మేన్ జూలా దలా కాజల్ కి దోర్ కా అనే పాటను గీత ఆలపించారు.

1949లో రఫీ-గీతా రాయ్ అనేక యుగళ గీతాలను పాడారు:

కర్వత్ చిత్రం ఇందులో ఒకటి. హన్స్‌రాజ్ బెహ్ల్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, S.K. దీపక్ పాటలు రాశారు. గయా అందేరా హువా సవేరా జాగ్ ఉతే ఇన్సాన్ అనే పల్లవితో సాగే ఈ పాట బానిసత్వం నుంచి పొందిన స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యాన్ని సంబరాలు జరుపుకోవడంతో పాటు కొత్త అధ్యాయాన్ని లిఖించే క్రమంలో వినిపిస్తుంది. ఈ పాటతో పాటు వచ్చే సంగీతంలో ఎక్కువగా డ్రమ్ముల శబ్దం చోటు చేసుకోవడంతో పాటు విభిన్నమైన సంగీత శ్రేణులు ఇందులో వినిపిస్తాయి. ఈ పాట రికార్డింగ్‌లో రఫీ మరియు గీతా రాయ్‌ల స్వరాలతో పాటు అనేక మంది స్వరాలు కూడా వినిపిస్తాయి.

ఇవి మాత్రమే కాకుండా కర్‌వత్‌లో గీతా-ఆశాలు యుగళ గీతం పాడారు: ఓ బాదల్ ఘిర్ ఆయే అనే పల్లవితో ఆ పాట సాగుతుంది. అలాగే S.D. బటిష్‌తో కలిసి మరో యుగళ గీతాన్ని కూడా ఆలపించారు: మేన్ అంగూర్ కి బెల్ అనే పల్లవితో ఈ పాట ఉంటుంది. ఇక గీత మాత్రమే పాడిన ఓహ్ చందా బాదల్ మేన్ ముఖ్ లే చిపా అనే సోలో గీతం కూడా ఇందులో వినిపిస్తుంది.

ఇక నాచ్ చిత్రం, హుస్న్‌లాల్-భగత్రం సంగీతానికి ఒక ప్రత్యేకమైన చిహ్నంగా నిలవడంతో పాటు హార్మోనియం స్వరంతో ప్రారంభమవుతుంది. ఇందులోని క్యూన్ కర్తా మాన్ జవానీ కా తు ఏక్ బుల్‌బులా పానీ కా అనే పాటను మహమ్మద్ రఫీ మరియు లతా మంగేష్కర్‌లతో కలిసి గీతా రాయ్ ఆలపించారు. కేవలం కొంతకాలానికి మాత్రమే పరిమితమైన యవ్వనం మరియు జీవితాలకు సంబంధించిన తత్వాన్ని తెలిపే విధంగా ఈ పాట ఉంటుంది.

నాచ్‌లోని మరో పాటను కూడా మహమ్మద్ రఫీ, గీతా రాయ్ మరియు లతా మంగేష్కర్ త్రయం ఆలపించింది. ఇదొక విషాద గీతం, ఈ పాటలోని చరణాలను మహమ్మద్ రఫీ ఆలపించగా, గీతా రాయ్, లత కలిసి 'ముందరి భాగం' లాబ్ పే ఫరియాద్ హై దిల్ బర్‌బాద్ హై అనే పల్లవిని ఆలపించారు. ప్రతి చరణం పూర్తయిన తర్వాత ఈ పల్లవి విన్పిస్తుంది.

ఇదే నాచ్ చిత్రంలో లత మరియు కోరస్‌లతో కలిసి గీత మరో పాటను కూడా ఆలపించారు: చాక్ చాక్ చలే హమారీ రైల్ యే హై ఆగ్ పానీ కా ఖేల్ అనే పల్లవితో ఈ పాట సాగుతుంది.

1949లో విడుదలైన హమారీ మంజిల్ అనే చిత్రానికి కూడా హుస్న్‌లాల్-భగత్రం సంగీతాన్ని అందించారు. నిజానికి 1948-49లో వారి హవా నడిచింది. అంతేకాదు వీరిద్దరి సంగీత సారథ్యంలో సురయ్యకు కూడా అదొక స్వర్ణయుగంగా అవతరించింది. ఈ చిత్రంలో మనం మహమ్మద్ రఫీ మరియు గీతా రాయ్‌లతో సహా మరికొందరు నేపథ్య గాయకులు ఆలపించిన రెండు పాటలను వినవచ్చు:

అంధేరే సే నా దర్ (కాంటే బనెన్గే కలియాన్ కాన్టన్ సే ఖేల్తా జా) అంటూ సాగే పాటను రాజిందర్ కృష్ణ రాశారు. జీవిత తత్వాన్ని బోధించే ఈ గీతం, జీవితంలోని కష్టసుఖాలను ఎదుర్కొనే దిశగా మనల్ని ప్రోత్సహిస్తుంది, రఫీ స్వరంతో ప్రారంభమయ్యే ఈ పాట గీతా రాయ్ మరియు ఇతర నేపథ్య గాయకుల స్వరాలతో ముందుకు సాగుతుంది.

బద్లా హువా దునియా మేన్ ఉల్ఫాట్ కా ఫసాన్ హై అనే పాటను ఖ్వామర్ జలలాబాదీ రాశారు. S.D. బటిష్, గీతా రాయ్, మరియు మహమ్మద్ రఫీలు ఈ పాటను ఆలపించారు. ఇదొక హాస్య గీతం, ఆధునిక లైలా మజ్నూ మరియు షిరీన్ ఫర్హాద్‌లపై వ్యంగ్యంగా సాగుతుంది: క్యా ప్యార్ కరే కోయ్ రాషాన్ కా జమానా హై, వోహ్ ఔర్ జమానా తాహ్ యే ఔర్ జమానా హై అనే పల్లవితో ఈ పాట సాగుతుంది.

అలాగే ఈ చిత్రంలో నయినోన్ సే నైన్ మిలాకే అంటూ గీతా రాయ్ ఆలపించిన సోలో పాట కూడా ఉంది.

ఈ చిత్రం తర్వాత హుస్న్‌లాల్-భగత్రం సంగీతంలో వచ్చిన మరో చిత్రం బన్సూరియా, ఇందులో ఆజా ఆజా కే జియా మోరా తరాస్ గయా అనే పాటను గీత పాడారు.

అమర్ కహాని (1949) చిత్రానికి సైతం హుస్న్‌లాల్ భగత్రం ద్వయమే సంగీతాన్ని అందించింది. రాజేందర్ కృష్ణ ఈ చిత్రానికి పాటలు రాశారు. ఇందులో హేహ్ కైసా దిల్లగీ హై మరియు చోటీ సి ఏక్ బగియా మేన్ అనే రెండు పాటను గీతా రాయ్ పాడారు. ఈ రెండు పాటలు కూడా ఉచ్ఛ స్వరంతో ముగుస్తాయి.

సవాన్ భదోన్‌లో వచ్చే దో దిల్ జిస్కే పాస్ సిపాహియా మరియు రాఖీలో వచ్చే జానే వాలే ఇదర్ దేఖ్తా జా అనే పాటలను హుస్న్‌లాల్ భగత్రం సంగీత దర్శకత్వంలో గీతా రాయ్ ఆలపించారు.

1949లో గీతా రాయ్ స్వరం నుంచి జాలువారిన మరికొన్ని పాటలు:

వీర్ ఘటోత్కచ చిత్రంలోని పియా కాహే దెర్ లగాయే పాటను S.N. త్రిపాఠీ సంగీత దర్శకత్వంలో గీత ఆలపించారు. ఈ పాటను మోతీ రాశారు.

ఇక శ్యామ్ బాబు పతక్ సంగీత దర్శకత్వం వహించి, బహుళ-నైపుణ్యం కలిగిన ప్రేమ్ ధవాన్ పాటలు రాసిన జీత్ చిత్రంలోనూ గీతా రాయ్ పాటలు విన్పిస్తాయి. ఈ చిత్రం కోసం గీతా రాయ్ పాడిన సునో సునో బన్వారీ మోరీ అనే పాటను అప్పటి విఖ్యాత నటి దుర్గా ఖోటేపై చిత్రీకరించారు. అలాగే వినోద్‌తో కలిసి "కామ్ కరో భాయ్ కామ్ కరో జాగ్ మేన్ ఆప్నా నామ్ కరో" అనే యుగళ గీతాన్ని కూడా ఆమె పాడారు. ఈ పాట సురయ్య సోలో గీతంగా కూడా విన్పిస్తుంది.

జియాన్ దత్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సున్హేర్ చిత్రంలోని జియా కా దియా పియా టిమ్ టిమ్ హోవే పాటను శంషాద్ బేగంతో కలిసి గీతా రాయ్ ఆలపించారు. అలాగే ఇదే చిత్రంలో సులోచనా కదంతో కలిసి ఉమాన్‌గోన్ కే దిన్ అనే పాటను కూడా గీతా పాడారు.

నర్గీస్ తల్లి జద్దన్ బాయ్ నిర్మాతగా దరోగజీ చిత్రం రూపొందింది. గీతా రాయ్ కోసం బులో C. రాణి స్వరాలు కూర్చిన 12 పాటల్లో కొన్ని ఈ చిత్రంలో చోటు చేసుకున్నాయి. లే జా లే జా లే జా బాబూ యేహ్ మేరీ నిషానీ మరియు మోరీ తుజా సే ఉలాజ్ గయీ అంఖియాన్ అనే రెండు పాటలను గీతా రాయ్ పాడారు. ఆ సమయంలో నర్గీస్ అగ్రశ్రేణి కథానాయకగా పరిశ్రమలో చాలా వేగంగా ఎదుగుతున్నారు. దీంతో జద్దన్ బాయ్ అంటే అప్పట్లో చాలా పెద్ద పేరు. అలాంటి వ్యక్తి తన సొంత నిర్మాణంలో వచ్చిన అన్ని చిత్రాల్లో పాడే అవకాశాన్ని గీతా రాయ్‌కే కట్టబెట్టారు. ఇందులో పది పాటలను నర్గీస్‌పైనే చిత్రీకరించడం జరిగింది. ఈ విధంగా గీతా రాయ్ యవ్వన ప్రాయంలో ఉన్న రోజుల్లోనే తన సామర్థ్యం, ప్రజాదరణ, నమ్మకం లాంటి అంశాల కారణంగా సినీ పరిశ్రమలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు.

మధుబాల నటించిన సిపహియా (1949) లో ఆమెతో పాటు అమిర్‌బాయ్ కర్ణాటకి నటించారు. నటిగానే కాకుండా ఆ రోజుల్లో ప్రముఖ నేపథ్య గాయనిగా కూడా అమిర్‌బాయ్ అందరికీ సుపరిచితులు. ఇందులోని ఒక పాటను లతా మంగేష్కర్‌తో కలిసి గీతా రాయ్ ఆలపించారు. చలో ఘున్‌ఘాట్ మేన్ గుయాన్ చుపా కే అంటూ సాగే ఈ పాటకు C. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించారు.

రోషిణీ చిత్రంలోని పెహన్ చునారియా కాలీ అనే పాటను గీతా రాయ్, C.రామచంద్ర కలిసి ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా అందించిన రామచంద్ర ఆ రోజుల్లో చిటాల్కర్‌ అనే పేరుతో కూడా ప్రాచుర్యం పొందారు.

కనీజ్ (1949) కు ఆ రోజుల్లో ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు: గులాం హైదర్, హన్స్‌రాజ్ బెహ్ల్ మరియు O.P. నాయర్‌లు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. అయితే, ఈ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమైన నాయర్ కేవలం సినిమాకు సంబంధించిన నేపథ్య సంగీతాన్ని మాత్రమే అందించారు. ఇందులో గీతా రాయ్ పాడిన జియా మోరా హాలే డోలే హో అనే పాటను కుల్‌దీప్ కౌర్‌పై చిత్రీకరించారు. ఇందులోని మరో అందమైన గీతం, పాకే నజారోన్ కా ఇషారా అనే పాటను కూడా గీతా రాయ్ పాడారు.

గులాం మహమ్మద్ సంగీతాన్ని అందించిన దిల్ కి బస్తీ చిత్రంలో గీతా రాయ్ కింది పాటలను పాడారు:

ఓహ్ పరదేసియా ఓ రసియా అనే పాటను ఆమె జోహ్రా బాయ్‌తో కలిసి పాడారు.

హేహ్ హి హై దిల్ కి బస్తీ పాటను G M దురానీతో కలిసి పాడారు.

నజుక్ దిల్ హై తోడ్ నా దేనా పాటను G M దురానీతో కలిసి పాడారు.

అలాగే గులాం మహమ్మద్ సంగీతాన్ని అందించిన పరాస్‌లో ఆమె కోయ్ పుకారే పియా పియా అనే పాటను ఆమె పాడారు.

బులో C. రాణి బాణీలు సమకూర్చిన నజారేలో గీతా రాయ్ రెండు పాటలు పాడారు: మీరా మాన్ మేన్ డోల్ మరియు మిల్తే హో ఉసీకో అనే ఈ రెండు పాటలను ఆమె G.M. దురానీతో కలిసి ఆలపించారు. ఈ పాటలు మాత్రమే కాకుండా G.M. దురానీతో కలిసి ఈ చిత్రం కోసం మరో రెండు పాటలను కూడా ఆమె ఆలపించారు. దునియాకి అందరీ రాత్ మేన్ మరియు బహర్ ఆయీ చామన్ అనే ఈ రెండు పాటల్లో శంషాద్ బేగం కూడా గొంతు కలిపారు.

బులో C. రాణి సంగీతం అందించిన భుల్ భులాయ్‌యాన్ చిత్రంలో అఖియోన్ సే నీంద్ చురాకే అనే పాటను గీతా రాయ్ పాడారు.

మేరీ కస్తీ కో ముహబత్ కా కినారా మిల్ గయా అనే పల్లవితో కమల్ చిత్రం కోసం ఆమె ఆలపించిన పాటకు సంగీత దర్శకుడు S.D. బర్మన్ స్వరాలు అందించారు. ఇక ఇదే చిత్రం కోసం సురేంద్రతో కలిసి ఆమె, కెహ్‌నే కో హైన్ తయ్యార్ అనే యుగళ గీతాన్ని పాడారు.

దిలీప్-కుమార్ నటించిన షబ్నం చిత్రం కోసం S.D. బర్మన్ మరోసారి గీతా రాయ్ స్వరాన్ని ఆశ్రయించారు. ఆమె ఆలపించిన సోలో సౌండ్-ట్రాక్ గీతమైన దిల్ తడ్‌పా కే కహాన్ చలా ఇదే చిత్రంలో యుగళ గీతంగా కూడా వినిపించింది. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ పాటలోని రెండో స్వరాన్ని శంషాద్ బేగం పాడారు. ఈ చిత్రం కోసం ఆమె ముకేష్‌తో కలిసి ఖ్విస్‌మత్ మేన్ బిచాద్నా తా అనే యుగళ గీతాన్ని కూడా ఆలపించారు. అప్పట్లో S.D. బర్మన్ కెరీర్‌కు సంబంధించి సబ్నం చిత్రం అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

1949లో రామ్ వివాహ్ కోసం గీతా రాయ్ తొలిసారిగా మన్నా డేతో కలిసి పాడారు. ధన్యా ధన్యా హే అవద్‌పురి అంటూ సాగే ఈ పాటను శంకర్‌రావ్ వ్యాస్ స్వరపర్చారు.

సంగీత దర్శకుడు నౌషద్ నేతృత్వంలో పందొమ్మిది వందల నలభైల్లో గీతా రాయ్ ఒక్క పాట కూడా పాడలేదనే మాట వాస్తవం కాదు. దిల్లగీ (1949) చిత్రం కోసం ఆమె నౌషద్ సంగీత సారథ్యంలో ఒక పాట పాడారు. ఈ చిత్రంలో సురయ్య-శ్యామ్ ఆలపించిన తూ మేరా చాంద్ మేన్ తేరీ చాందినీ అనే యుగళ గీతం అత్యంత విజయవంతమైనది. ఈ పాటకు సంబంధించిన మరో రూపం కూడా ఈ చిత్రంలో ఉన్న విషయం చాలామందికి తెలీదు. ఈ మరో రూపంలో వచ్చే ఈ పాటను సహాయ నటి శ్యామ కోసం గీతా రాయ్ పాడారు. అయితే, ఈ పాటకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు అందుబాటులో లేవు. అయితే, మెహబూబా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా (1962) కోసం నౌషద్ సంగీత సారథ్యంలో ఆమె పాడిన ముజే హుజూర్ తుమ్‌సే ప్యార్‌హై అనే పాట మాత్రం అభిమానులకు అందుబాటులో ఉంది. గీతా రాయ్‌కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పాలంటే, అప్పట్లోనే పోర్చుగల్‌ వారు ఒక TV ప్రకటన కోసం ఆమె స్వరాన్ని ఉపయోగించుకున్నారు. "ZAPP" అనే ఒక వైర్‌లెస్ ఇంటర్నెట్ కంపెనీ కోసం చేసిన ప్రకటనలో భాగంగా వారు గీతా రాయ్ స్వరాన్ని ఉపయోగించారు. అంతేకాదు, 1961లో పోర్చుగీస్ వారు గోవాను విడిచివెళ్లే సమయంలోనూ గీతా రాయ్-దత్‌ని మరియు ఆమె తీయటి స్వరాన్ని మర్చిపోలేకపోయారు.

గీతా రాయ్ తన కెరీర్‌లో భాగంగా దాదాపు 1500 పాటలను పాడడమే కాకుండా, బంగ్లా, గుజరాతీ మరియు పంజాబీ లాంటి ప్రాంతీయ భాషల వారికీ తన గానామృతాన్ని రుచి చూపించారు. 1946 మరియు 1949ల మధ్య ఆమె పాడిన పాటల గురించి మనం తెలుసుకున్నాం. గీతా రాయ్ పాడిన సోలో పాటలను పక్కనపెడితే, నలభైల్లో, ఆ తర్వాతి దశాబ్దాల్లో ఆమె తన ప్రధాన సహ నేపథ్య గాయకులతో కలిసి పాడిన యుగళ గీతాల వివరాలను కింద పేర్కొనడం జరిగింది:

మహమ్మద్ రఫీతో: మొత్తం 162 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినవి 9 పాటలు.

G.M. దురానీతో: మొత్తం 33 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినవి 12 పాటలు.

లతా మంగేష్కర్‌తో: మొత్తం 37 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆమెతో కలిసి పాడినవి 9 పాటలు. అయితే ఈ పాటల్లో మహమ్మద్ రఫీ లేదా హేమంత్ కుమార్ మరియు ఇతరులు కూడా గొంతు కలిపిన పాటలు కొన్ని ఉన్నాయి.

శంషాద్ బేగంతో: మొత్తం 20 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆమెతో కలిసి పాడినవి 11 పాటలు.

రాజ్‌కుమారితో: మొత్తం 10 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆమెతో కలిసి పాడినవి 9 పాటలు.

జహ్రాబాయ్ అంబలెవాలితో: మొత్తం 5 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆమెతో కలిసి పాడినవి 2 పాటలు.

ముఖేష్‌తో: మొత్తం 19 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినవి 6 పాటలు. వారిద్దరూ కలిసి గుజరాతీలో పాడిన నాలుగు పాటలు ఈ జాబితాలో చోటు చేసుకోలేదు.

ఆశా భోంస్లేతో: మొత్తం 35 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆమెతో కలిసి పాడినవి 2 పాటలు.

మన్నా డేతో: మొత్తం 26 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినది 1 పాట. దీంతోపాటు ప్రాంతీయ భాషలో మరో 5 పాటలను కూడా ఆయనతో కలిసి పాడారు.

S.D. బటిష్‌తో: మొత్తం 6 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినవి 3 పాటలు. ఈ జాబితాలో విడుదల కాని ఒక పాట కూడా ఉంది.

సులోచనా కదంతో: మొత్తం 7 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆమెతో కలిసి పాడినవి 4 పాటలు.

ఖయ్యమ్‌తో: నలభైల్లో 3 పాటలు మాత్రమే పాడారు.

బినాపాణి ముఖర్జీతో: నలైభైల్లో 2 పాటలు మరియు 1950లో ఒక పాట మాత్రమే పాడారు.

హమీదా బానూతో: కేవలం 4 పాటలు మాత్రమే పాడగా అందులో నలభైల్లో ఆమెతో కలిసి పాడింది 1 పాట మాత్రమే.

చిటాల్కర్‌తో: మొత్తం 9 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినవి 6 పాటలు.

శంకర్ దాస్ గుప్తాతో: మొత్తం 8 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినవి 2 పాటలు, వీటితోపాటు అరుణ్ కుమార్ మరియు యశోధరలతో కలిసి ఒక్కో పాట పాడారు.

సురేంద్రతో: మొత్తం 5 పాటలు పాడగా అందులో నలభైల్లో ఆయనతో కలిసి పాడినవి 3 పాటలు.

మరోవైపు నలభైల్లో ఆమెతో కలిసి పాడని ఎంతో మంది నేపథ్య గాయకులు యాభైల ప్రారంభంలో ఆమెతో కలిసి అనేక పాటలు పాడారు. తలాత్ మహమ్మద్ (26 పాటలు మరియు ఒక-చిత్రీకరణ జరగని పాట) ; హేమంత్ కుమార్ (31 లేదా 32 పాటలు మరియు 3 బెంగాలీ పాటలు) ; కిషోర్ కుమార్ (13 పాటలతో పాటు రెండు బెంగాలీ పాటలు) ; సుమన్ కళ్యాణ్‌పూర్ (6 పాటలు) : మహేంద్ర కపూర్ (12 పాటలతో పాటు రెండు భోజ్‌పూరీ గీతాలు) ; ముబారక్ బేగం (కేవలం 1 పాట) ; సురయ్య (కేవలం 1 పాట) ; సుధా మల్హోత్రా (7 పాటలు) ; మీనా కపూర్ (5 పాటలు మరియు 1 చిత్రీకరణ జరగని పాట) ; కృష్ణ గోయల్ (5 పాటలు) ; ఖాన్ మస్తానా (2 పాటలు) ; S. బల్బీర్ (10 పాటలు ఇందులో ఇతరులు స్వరం కలిపిన పాటలు కూడా ఉన్నాయి) ; నూతన్ (1 పాట) లాంటి ఎందరో నేపథ్య గాయకులు ఈ జాబితాలో ఉన్నారు.

అయితే పైన పేర్కొన్న జాబితా పూర్తిగా సమగ్రమైనది కాదు. అదేసమయంలో ఈ జాబితా పూర్తిగా సమగ్రమైనది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా చెప్పడానికి గల కారణాలను ఇక్కడ తప్పకుండా పేర్కొనాల్సిన అవసరముంది. గతంలో, నేపథ్య గాయకుల వివరాలను కనీసం గ్రామఫోన్ రికార్డులపై కూడా పేర్కొనేవారు కాదు. కేవలం సినిమాల్లో ఈ పాటలకు పెదాలు కదిపిన నటీనటుల పేర్లను మాత్రమే ఆనాడు రికార్డుల్లో పేర్కొనేవారు. అది మాత్రమే కాకుండా అప్పట్లో ఒక పాట యుగళ గీతం అయినప్పటికీ, దాన్ని పాడిన వారిలో ఒకరి పేరును మాత్రమే రికార్డుల్లో పేర్కొనేవారు. దీంతోపాటు, పాత రికార్డులు ఇప్పటికే ధ్వంసమైన కారణంగా, పైన పేర్కొన్న ఎంపిక అనేది పూర్తిగా అసమగ్రమైన వివరాలపైన లేదా ఏర్చికూర్చిన వివరాలపై ఆధారపడి రూపొందించడం జరిగింది. అయితే, పైన చెప్పిన విధంగా ఓ పక్క కొద్దిపాటి తేడాలు ఉన్నప్పటికీ, పందొమ్మిది వందల నలభైల్లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఒక నేపథ్య గాయనికి సంబంధించిన మొత్తం పాటల వివరాలను అందించే ప్రయత్నం ఇక్కడ జరిగింది.

నేపథ్య గాయకురాలిగా గీతా రాయ్ తన గాత్రాన్ని మరియు భావోద్వేగాలని చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ రచయితల కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటలను సుమధురంగా ఆలపించేందుకు వినియోగించారు. అక్తర్ రొమానీ, అలీ సర్దార్ జఫారీ, అంజన్, అంజుమ్ జైపూరీ, అంజుమ్ పిలిభితి, ఆర్జూ లక్నోవీ, అసాద్ భోపాలీ, అవినాశ్ వ్యాస్, అజీజ్ కాశ్మీరీ, B D మిశ్రా, B M శర్మ, B P భార్గవ్, B R శర్మ, బల్వంత్ కపూర్, బంధు, బేకల్ అమృత్‌సరి, భగవతి ప్రసాద్ వాజ్‌పేయ్, భారత్ వ్యాస్, బిస్మిల్ పేష్‌వారి, D N మధోక్, దేవేంద్ర, ఫరూఖీ ఖ్యాసెర్, ఫెరోజ్ జలందరీ, G S నేపాలీ, G S పాట్‌దార్, ఘాఫిల్ హర్‌నల్వి, గుల్సన్ బవ్రా, గుల్జార్, హెయ్‌రత్ సీతాపురి, హమిద్ హైదరాబాదీ, హర్ష్, హస్రత్ జైపూరీ, హస్రత్ లక్నోవీ, హిమ్మత్ రాయ్ శర్మ, I C కపూర్, ఇందీవర్, J అభయంకర్, జైదేవ్, జాన్ నిసార్ అక్తర్, K L పర్దేశీ, K మనోహర్, K రాజ్‌దన్, కైఫ్ ఇర్ఫానీ, కైఫీ అజ్మీ, కమీల్ రషీద్, కపిల్ కుమార్, కవి ప్రదీప్, కేదర్ శర్మ, ఖాలీష్ లక్నోవీ, ఖవార్ జమాన్, ఖుమార్ బరంబ్‌కవి, కులదీప్ సింగ్ చాంద్, M A తాజ్, M L ఖన్నా, మధుకర్ రాజస్థానీ, మధుసూదన్ భాగల్పూరి, మహేంద్ర ప్రాణ్, మజ్రోహ్ సుల్తాన్‌పురి, మన్మోహన్ సబీర్, మనోహర్ ఖన్నా, మీరాభాయ్, మోతీ B A, ముల్క్ రాజ్ భక్రి, మున్షీ శ్యామ్, మున్షీ సాగర్ హుస్సేన్, నక్‌షాబ్ జరచవి, నరేంద్ర శర్మ, నవాజ్, నజీమ్ పానిపాటి, నీలకంఠ్ తివారీ, నూర్ దేవాసి, న్యాయ్ శర్మ, ఓమ్ ప్రకాశ్, P L సంతోషీ, ప్రఫుల్ దేశాయ్, ప్రతాప్, ప్రేమ్ ధవాన్, ప్రేమి, Pt గాఫిల్, Pt ఇంద్ర, Pt మాధుర్, Pt ముక్రమ్ శర్మ, ఖ్వామర్ జలలాబాదీ, R C పాండే, రఫీఖ్, రాజా మెహందీ అలీ ఖాన్, రాజేంద్ర కృష్ణ, రాజేశ్ కుమార్, రాం మూర్తి, రమేశ్ గుప్తా, రమేశ్ పాండే, రమేశ్ శాస్త్రి, రన్‌ధీర్, S రాజి-ఉద్-దిన్, S H బిహారి, S K దీపక్, S P కల్లా, S R సాజ్, S రతన్, S. కశ్యప్, సాజన్ బిహారీ, సాబా అఫ్ఘనీ, సఫ్దర్ ఆహ్ సీతాపురి, సాగర్ బదాయునీ, సాహిర్ లుదియాన్వి, సాజన్ బిహారీ, సాలిగ్ లక్నవీ, శైలేంద్ర, శైలి శైలేంద్ర, షకీల్ బదాయునీ, షకీల్ నోమనీ, షామ్స్ అజీమాబాదీ, షర్షార్ సైలానీ, షేవాన్ రిజ్వీ, షోలా కహామావి, శ్యామ్ హిందీ, సూర్‌దాస్, సురేశ్ త్రిపాఠీ, తాబా ఝాన్స్‌వీ, తాజ్‌దర్ తాజ్, తన్వీర్ నగ్వీ, తేజ్‌నాథ్ ఝార్, ఉద్దవ్ కుమార్, వర్మ మాలిక్, విద్యాపాఠి, వినయ్ కుమార్, విశ్వామిత్ర అదిల్, వీరజేంద్ర గౌడ్, వాహీద్ ఖురేషీ, వాలి సహాబ్, యోగేష్ గౌడ్, జియా సర్హాదీ లాంటి రచయితలెందరో రాసిన పాటలను గీతా రాయ్ తన సుమధుర కంఠంతో పాడారు.

మరోవైపు పాటల రచయితలతో పాటు, గీతా రాయ్ స్వరంతో తమ సంగీతానికి మరిన్ని సొగసులు అద్దుకున్న సంగీత దర్శకుల జాబితా కూడా తక్కువేమీ కాదు. మెలోడీకి ఆధ్యులైన అలాంటి సంగీత దర్శకులు చాలామందే ఉన్నారు: అమల్ ముఖర్జీ, అనల్ ఛటోపాధ్యాయ, అనిల్ బగ్చీ, A R ఖురేషీ, అలీ అక్బర్ ఖాన్, ఆదిల్ – అహ్మద్, అమల్ ముఖర్జీ, అనిల్ బిశ్వాస్, అరుణ్‌కుమార్ ముఖర్జీ, అవినాష్ వ్యాస్, అజిజ్ ఖాన్,B N బాలి, B S కల్లా, బసంత్ ప్రకాశ్, భోలా శ్రేష్ఠ, వినోద్ ఛటోపాధ్యాయ, బిపిన్ బాబుల్, బిపిన్ దత్తా, బులో C రాణి, C అర్జున్, C రామచంద్ర, చిక్ చాక్‌లెట్ (A.X. వాజ్), చిత్రగుప్త్, దాన్ సింగ్, దత్తా దవ్జేకర్, దత్తారామ్ గడేకర్, దత్తా కోర్‌గావోన్కర్ (K దత్తా), దత్తారామ్, దేవ్‌రాజ్, ధనిరామ్, D దిలీప్ (దిలీప్ ధోలకియా), D C దత్, E.శంకర్ శాస్త్రి & B. S. కల్లా, G K వెంకటేశ్, G N జోషి, G S కోహ్లీ, గనపత్ రావ్, ఘంటశాల, గులాం హైదెర్, గులాం మహమ్మద్, గుంజన్ (G M దురానీ), జియాన్ దత్, హఫీజ్ ఖాన్, హన్స్‌రాజ్ బెహ్ల్,హనుమాన్ ప్రసాద్, హేమంత్ కుమార్, హిరేన్ బోస్, హుస్నాలాల్ భగత్రం, ఇనయత్ అలీ, ఇఖ్‌బాల్, ఇఖ్‌బాల్ ఖురేషీ, జగ్‌మోహన్ "సూర్‌సాగర్," జాగ్ ఫూల్ కౌషిక్, జైదేవ్, జమాల్ సేన్, జిమ్మీ, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, కానూ ఘోష్, కానూ రాయ్, ఖయ్యుం, ఖేమ్‌చంద్ ప్రకాశ్, ఖుర్షిద్ అన్వర్, కృష్ణ దయాల్, కుమార్, లాచ్చిరామ్ తమర్, M A రవూఫ్, మదన్ మోహన్, మన్నా డే, మనోహర్, మోహన్ శర్మ, ముకుల్ రాయ్, నచికేట ఘోష్, నారాయణ్, N దత్తా, నాషద్ "షౌకత్ దెహెల్వీ," నౌషద్ అలీ, నీనూ మజుందార్, నిఖిల్ ఘోష్, నిర్మల్ చక్రవర్తి, నిస్సార్ బాజ్మీ, O P నాయర్, P నాగేశ్వర్ రావ్, పండిట్ గోవింద్రమ్, పండిట్ హర్‌బన్స్‌లాల్, పండిట్ రవి శంకర్, పంకజ్ ముల్లిక్, పరదేశి, ప్రేమ్‌నాథ్, R సుదర్శనం (ధనిరామ్‌తో), రాజ్‌హాన్స్, రాం గంగూలీ, రాం ప్రసాద్, రమేశ్ నాయుడు, రత్నదీప్ హేమరాజ్, రవి, రాబిన్ బెనర్జీ, రాబిన్ ఛటర్జీ, రోషన్ లాల్, S D బటిష్, S D బర్మన్, S K పాల్, S మదన్, S మొహిందర్, S N త్రిపాఠి, S రాజేశ్వర రావ్, శైలేష్ ముఖర్జీ, షాజద్ హుస్సేన్, సలిల్ ఛౌదరీ, షన్మఖ్ బాబు, సర్దార్ మాలిక్, సర్దూల్ ఖ్వాత్రా, శంకర్ జైకిషేన్, శంకర్ లాల్, శర్మాజీ వర్మాజీ [కయ్యూం మరియు రహ్మాన్ వర్మ] శివరాం కృష్ణ, శ్యామ్ బాబు పతక్, శ్యామ్ సుందర్, శ్యామ్ శర్మ, స్నేహల్ భట్కర్ (B వాసుదేవ్), సోనిక్, సుబీర్ సేన్, సుదిప్తా, సుధిన్ దాస్‌గుప్తా, సుధిర్‌లాల్ చక్రవర్తి, సుహ్రిద్ కర్, సురేశ్ తల్వార్, సుశాంత్ బెనర్జీ, స్వపన్ జగ్‌మోహన్, తిమిర్ బరాన్ మరియు S K పాల్, ఉషా ఖన్నా, V. బల్సారా, వసంత్ దేశాయ్, వసంత్ రామచంద్ర, వినోద్, విశ్వనాథన్-రామమూర్తి, మరియు జాఫర్ ఖుర్జీద్ లాంటి వారంతా గీతా రాయ్ పాడిన పాటల కోసం స్వరాలు కూర్చినవారే.

ఒకవేళ పైన పేర్కొన్న పాటల రచయితల పేర్లు మరియు సంగీత దర్శకుల పేర్లు మరియు గీతా రాయ్ పాడిన మొత్తం పాటల సంఖ్య వంటి వివరాలను మరింత సమగ్రంగా రూపొందించే అంశాన్ని నిపుణులైన సంఖ్యావేత్తలు మరియు వ్యాఖ్యానవేత్తలకు వదిలిపెట్టినప్పటికీ, గీతా రాయ్‌కి సంబంధించి పైన పేర్కొన్న జాబితాలను పరిశీలిస్తే, బాలీవుడ్‌లో అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన నేపథ్య గాయకురాళ్లలో ఒకరిగా గీతా రాయ్ ఉద్భవించారనే విషయాన్ని చెప్పేందుకు మాత్రం ఈ వివరాలు ఒక విస్తారమైన విషయ సూచికగా ఉపయోగపడుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

పై అంశాలను పరిశీలించిన తర్వాత, 1946-1949లోని సంగీత అభిమానులపై గీతా రాయ్ ప్రభావం ఏమేరకు ఉండేదో మనం సులభంగా ఊహించుకోవచ్చు. అంతేకాదు ఆనాటి మన సొంత రోజులను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. దో భాయ్‌లో గీతా రాయ్ ఆలపించిన ఒక పాటను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. ఈ సందర్భంలో ఒకటి మాత్రం నిజం! వుర్తెరింగ్ హైట్స్ అనే ఏకాంత నవల, దాని రచయిత ఎమిలే బ్రోంటే పేరును అత్యంత మేథావిగా నిలబెట్టిన విధంగానే, దో భాయ్‌లో గీతా రాయ్ ఆలపించిన పాటలు వింటే చాలు ఒక మేథావి గాయకురాలిగా ఆమె మన జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది. అలాగే ఉపఖండంలోని భారతదేశం మరియు పాకిస్థాన్‌తో సహా అన్నిచోట్లా ప్రఖ్యాత నేపథ్య గాయకుల్లో ఒకరిగా కూడా ఆమె పేరు మన మదిలో శాశ్వతంగా చోటు చేసుకుంటుంది. ఆమె పాడిన మేరా సుందర్ సప్నా బీత్ గయా అనే పాట విని చలించకుండా నిలవాలంటే అది కేవలం పాషాణ హృదయులకు మాత్రమే సాధ్యం. కేవలం పదహారేళ్ల వయసు కలిగిన అమ్మాయి ఆ స్థాయి విషాధాన్ని, ఆ రకమైన తియ్యదనాన్ని, ఆ విధమైన భావోద్వేగాన్ని స్వరంలో పలికించడమనేది నిజంగానే ఒక అద్భుతం. రోదిస్తూ మరియు బాధపడతూ అదేసమయంలో గుండెను పిండేసే బాధతో సతమతమయ్యే ఒక వ్యక్తిలా ఆమె ఈ పాటను ఆలపించారు, కష్టాలతో నిండిన తన జీవిత కథను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, పాడేందుకు అన్నట్టు ఆమె గొంతు నుంచి ఈ పాట వెలువడింది. ఈ పాటలో వినిపించే మరో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఒకవేళ గీతా రాయ్ తన సొంత విషాదకర భావోద్వేగాలను ఇందులో పలికించారేమో అనే విధంగా ఈ పాట మనకు వినిపిస్తుంది: మేరీ ప్రేమ్ కహానీ ఖత్మ్ హోయే మేరే జీవన్ కా సంగీత్ గయా..., ఆంకేన్ అసువాన్ మేన్ దూబ్ గయేన్ హన్స్‌నే కా జమానా బీత్ గయా..... ఇస్ జీవన్ కో అబ్ ఆగ్ లగే..ముజే చోద్ కే జీవన్ మీత్ గయా...మేన్ ప్రేమ్ మేన్ సాబ్ కుచ్ హార్ గయే...బేదార్ద్ జమానా జీత్ గయా.... మేరా సుందర్ సప్నా బీత్ గయా అంటూ సాగే ఈ పాటలో చివరగా ఓ చిన్న నిటూర్పు విన్పిస్తుంది! ఈ పాటలోని వివిధ పంక్తులను ఆమె ఎలా పాడారు, E శబ్ధాలను ఎలా పలికారు అనే విషయాన్ని గమనించండి. గీతా రాయ్ వయసుని మరియు ఆమె పాటలో వినిపించే స్వేచ్ఛాయుత మాధుర్యం, జాలి స్వభావాన్ని పరిగణలోకి తీసుకున్నట్టైతే, ఒక దశాబ్దం తర్వాత అదే సంగీత దర్శకుని సారథ్యంలో ప్యాసా (1957) చిత్రం కోసం ఆమె పాడిన ఆజ్ సాజన్ మోహే అంగ్ లగాలో ...లేదా కాఘజ్ కే పూల్ (1959) చిత్రం కోసం పాడిన వాక్ట్ నే కియా క్యా హసీన్ సితమ్ కంటే ముందు పాడిన ఈ పాటే శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. గీతా రాయ్‌లోని ఈ ప్రతిభ కారణంగానే ఆరోజుల్లో దో భాయ్ కోసం స్వరపర్చిన మొత్తం తొమ్మిది పాటల్లో ఆరు పాటలు పాడే అవకాశాన్ని S.D. బర్మన్ ఆమెకే ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించదు. 1947 ప్రారంభం నాటికి సంగీత ఆలాపనలో ఆమె ప్రమాణాలను మించిపోయారు. అనిల్ బిశ్వాస్ సంగీత సారథ్యంలో ఆమె పాడిన పాటలతో స్పష్టత, "మార్థవ్యం, శృంగారం మరియు శృతి" కలగలిసిన ఒక ఆకర్షకరమైన గాత్రం కలిగిన గాయనిగా ఆమెకు అసాధారణమైన గుర్తింపు లభించింది. ఆ సమయంలోనే "బంగల్ కా జాదూ" ఆశా భోస్లే పరిశ్రమలోకి అడుగుపెట్టారు. లతా మంగేష్కర్ సోదరిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె, గీతా రాయ్ స్వరంలోని శృంగారాన్ని విని బాగా ప్రభావితం కావడమే కాకుండా, లతా మంగేష్కర్ నీడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె కెరీర్‌లో ఆ రకమైన స్వరం ఒక గుర్తింపు చిహ్నంగా మారింది. అప్పట్లో ప్రతి ఒక్కరినీ కదిలించిన ఆ స్వరంలోని అద్భుతమే గీతా రాయ్ వృత్తి జీవితాన్ని అందనంత ఎత్తుకు తీసుకువెళ్లింది. మరో స్వచ్ఛమైన నిజం ఏమిటంటే, దో భాయ్ తర్వాత S.D. బర్మన్ సైతం మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదు – తన చిత్రం కోసం ఆయన గీతా రాయ్‌ని ఎంచుకోవడమే అందుకు కారణం.

వృత్తి జీవితం ప్రారంభంలో ఒక మహిళగా గీతా రాయ్ నేపథ్య గాన రంగంలో కఠినమైన పోటీని ఎదుర్కొన్నారు. అప్పట్లో నేపథ్య గాన రంగంలో మహారాణిగా వెలుగొందుతున్న నూర్ జహాన్ ఒకవైపు, చాకోలెట్ మెరుపుల సురయ్య మరోవైపు ఉండగా, అప్పట్లో నేపథ్య గాయకురాళ్లగా మంచి హోదాలో ఉన్న పారుల్ ఘోష్, లలితా దెవుల్కర్, అమిర్‌బాయ్ కర్ణాటకీ, జోహ్రాబాయ్ అంబలవాలి, శంషాద్ బేగం లాంటి మరికొందరు కూడా రంగంలో ఉన్న సమయంలో కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన గీతా రాయ్‌కి పోటీ అనేది ఏ స్థాయిలో ఉండి ఉంటుందో మనం సులభంగానే ఊహించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో లతా మంగేష్కర్ అప్పటికి కనీసం పోటీలో కూడా లేరు, ఆమె స్వరం "పీలగా" ఉందన్న కారణంతో రికార్డింగ్ స్డూడియోల్లో ఆమె పాటను నిరాకరించడం జరిగింది. అప్పట్లో పేరున్న నిర్మాణ సంస్థ అయిన ఫిల్మీస్టాన్, షాహిద్ (1948) లో లతా మంగేష్కర్‌ను తిరస్కరించినప్పటికీ, గీతా రాయ్‌ని మాత్రం తిరస్కరించలేదు. గీతా రాయ్ ఆలపించిన పాటను రికార్డింగ్ చేసిన తర్వాత దాన్ని విని అటుపై మాత్రమే ఆమెను తిరస్కరించాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలనే S.D. బర్మన్ ఒప్పందం కారణంగా అది సాధ్యమైంది. ఆవిధంగా ఆమె హమేన్ చోద్ పియా కిస్ దేశ్ గయే అనే పాటను ఆలపించారు. అంతేకాదు అటు తర్వాతా దో భాయ్‌లోని మొత్తం తొమ్మిది పాటల్లో ఆరింటిని తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు పరిశ్రమలో ఎదగడం కోసమని ఆమె ఇతరులు తరహాలో ఎలాంటి సంగీత శిక్షణా తీసుకోలేదు. మరి ఆమెకు ఉన్న బలమేంటి? అసలుసిసలైన గాయనిగా సహజసిద్ధమైన స్వరాన్ని కలిగి ఉండడమే గీత విషయంలో వరంగా పరిణమించింది. మరోవైపు, నూర్ జహాన్, లతా మంగేష్కర్ తరహాలో గాత్రం విషయంలో తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉండాలని ఆమె ఏనాడూ భావించలేదు. అంతేకాదు అప్పట్లో "ఆధునిక మీరా"గా సుపరిచితమైన "రాయ్" జుతికా రాయ్‌లాగా ఎదగాలని కూడా ఆమె ఆలోచించలేదు.

అయితే, దురదృష్టవశాత్తూ ప్రారంభంలో ఏడుపు పాటలకు మరియు భజన గీతాలకు మాత్రమే సరిపోతారనే ముద్ర గీతా రాయ్‌పై పడినప్పటికీ, ఆ విషయాన్ని ఆమె నష్టంగా భావించలేదు. జోగన్ (1950) చిత్రం ద్వారా ఆమె తనలోని ప్రతిభ ఎలాంటిదో పరిశ్రమకు చాటి చెప్పారు. దిలీప్ కుమార్ మరియు నర్గీస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఒక ఉన్నత-స్థాయి చిత్రం మాత్రమే కాకుండా అప్పట్లో అదొక అసాధారణ ప్రేమ కథా చిత్రంగా కూడా గుర్తింపు పొందింది. అటువంటి చిత్రంలో మాత్ జా మాత్ జా జోగి; అయ్ రి మేన్ తోహ్ ప్రేమ్ దివానీ; మరియు గున్గత్ కే పాత్ ఖోల్ రే లాంటి పాటలను గీతా రాయ్ అద్భుతంగా ఆలపించగా మిగిలిన పాటలను నర్గీస్‌పై చిత్రీకరించారు. ఆ రోజుల్లో సర్వాంతర్యామి అయిన రేడియోలో ఈ పాటలు హాట్ ఫేవరెట్‌ స్థానాన్ని ఆక్రమించాయి. ఆ రోజుల్లో గీతా రాయ్ పాడిన ఆ పాటలను నేను ఎంత ఇష్టంగా వినేవాడినో ఇప్పటికీ స్పష్టంగా జ్ఞప్తికి తెచ్చుకోగలను. అలా యాభైల్లో చిన్న పిల్లాడిగా నా జ్ఞాపకాలతో గీతా రాయ్ గురించి రాసేందుకు ఎన్నెన్నో అనుభవాలను ప్రోది చేసుకున్నాను.

యవ్వనంలోకి అడుగుపెట్టే నాటికే గీతా రాయ్ స్వరంలో గాంభీర్యం మరియు విషాధ ఛాయలు తొంగిచూడడం అనేది ఆమెను తిరుగులేని గాయనిగా నిలబెట్టాయని కచ్చితంగా చెప్పవచ్చు. ఆమె గంభీరమైన కళ్లలోకి ఒకసారి చూసినట్టైతే, ఎవరైనా సరే ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. ఆమె కళ్లలో కనిపించే ఆ భావాలే ఆమె పాటలోనూ ప్రతిఫలించేవి. అయితే ఆమె హృదయంలో మాత్రం యవ్వనానికి సంబంధించిన ఆటుపోట్లు మరియు ఉద్రేకం దాగుండి పోయాయి. అందుకే ఆమె పాడే పాటల్లో ఆ రకమైన భావోద్వేగ భావాలు సైతం సంవృద్ధిగా కనిపించేవి. దీంతో యాభైల్లో పరిస్థితులు విషమించిన స్థితిలోనూ తన స్వరం ఏ స్థాయిలో ముద్దుగా ఉంటుందో, ఎంత కొంటెగా విన్పిస్తుందో, ఎంతటి శృంగారభరితంగా, ఎంతటి మృదువుగా ఉంటుందో ఆమె ప్రపంచానికి నిరూపించారు. ఈ కారణంగానే యాభైల్లో వచ్చిన తన మధురమైన గీతాలన్నింటికీ O.P. నాయర్ ఆమె స్వరానే ఎంచుకున్నారు.

నేపథ్య గాయనిగా అన్ని రకాల ప్రక్రియల్లోనూ నైపుణ్యం సాధించడం, భాషలను ఎంచుకోవడంలో సాధించిన సామర్థ్యం లాంటి అంశాల కారణంగా బంగ్లా లేదా గుజరాతీ లేదా ఇతర ప్రాంతీయ భాషలు భాషలతో పాటు ఉర్దూ-హిందీ పాటలు లేదా బ్రజ్ భాషలోనూ గీతా రాయ్ అంతే శ్రావ్యంగా పాటలు పాడగలిగారు. అయితే, ఇతర భాషల పాటలు పాడే సమయంలో ఆమె బెంగాలీ స్క్రిప్ట్‌ను ఉపయోగించారనే విషయాన్ని ఆమె వద్ద ఉన్న అసంఖ్యాకమైన పుస్తకాలు నిరూపిస్తాయి. గీతా రాయ్‌కి సంబంధించి గొప్ప అంశం ఏమిటంటే, ఒక గాయనిగా ఆమె తన సొంత సామర్థ్యాలపై అత్యంత విశ్వాసం కలిగి ఉండేవారు. అందువల్లే తన ప్రత్యర్థులు, పోటీదారుల జీవితాల్లో ఆమె ఎప్పుడు కూడా ఎలాంటి ప్రతిబంధకాలనూ సృష్టించలేదు. పనికిమాలిన రాజకీయాలకు చోటివ్వని అతికొద్ది మంది సినీ ప్రముఖులు లేదా నేపథ్య గాయకుల్లో గీతా రాయ్ కూడా ఒకరు. తన చుట్టూ ఉన్న వారితో ఆమె ఎప్పుడూ స్నేహపూరితంగా ఉండేవారు.

గీతా రాయ్‌కి సంబంధించి పందొమ్మిది వందల నలభై దశకం చాలా ముఖ్యమైనది, ఆమె పాడిన మొత్తం పాటలని ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్న సంవత్సరాల వారీగా విభజిస్తే ఆ విషయం మనకు బోధపడుతుంది. పాటల దిగంతంలో ఆ దశకంలోనే ఒక కొత్త తార వచ్చి చేరింది. గీతా దత్ విషాంధాంతం, చిన్న వయసులోనే ఆమె మరణించడం, ఆమె అందమైన చూపులతో పాటు ఆమె నమ్రత లాంటివన్నీ కలిసి ఆమె పాటలను ముందు తరాలు సైతం ఆదరించగల ఘనకీర్తిని సాధించి పెట్టాయి. ఆలోచించి చూస్తే అగ్రశ్రేణి నేపథ్య గాయకురాలిగా గీతా దత్ ఎప్పటికీ ప్రశంసలందుకోవాల్సిన వారని బోధపడుతుంది. అయితే, గీతా రాయ్‌ని ఆ స్థాయి అందుకోనీయకుండా మోసం చేయడం కోసం విధి రాత కుట్ర చేసింది. అదంతా పందొమ్మిది వందల నలభైల తర్వాతి దశాబ్దాలకు సంబంధించిన విషయం.

గీతాజీ, మీరు పాడిన ముజే జా.న్ నా కహో మేరీ జా.న్.... (అనుభవ్ - 1971) విన్న తర్వాత ఎవరైనా సరే మిమ్మల్ని "జాన్" అని పిలవకుండా ఉండగలరా? మీరు ఈ దేశానికి మాత్రమే కాదు ప్రపంచం మొత్తానికీ ప్రియమైన వారు! మీరు భౌతికంగా మా మధ్య లేకపోవడాన్ని తలుచుకుని భారమైన మరియు విషాదంతో నిండిన హృదయాలతో మేము మీ జయంతిని జరుపుకుంటున్నాం. అయితే, మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మధురమైన మీ పాటల రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీ అభిమానుల మధ్యన మీరు ఎల్లప్పుడూ ఆత్మ రూపంలో ఉంటూనే ఉన్నారనే విషయం మాకు బాగానే తెలుసు! http://www.geetadutt.com/impact.html.

వ్యక్తిగత జీవితంసవరించు

బాజీ చిత్రం కోసం రికార్డింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చిన మరియు వృద్ధిలోకి వస్తున్న సినీ దర్శకుడు గురు దత్‌ను గీతా రాయ్ తొలిసారిగా కలుసుకున్నారు. అలా వారిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిచయం ప్రేమగా మారి 1953 మే 26లో జరిగిన వారి వివాహంతో ఆ బంధం మరింత బలపడింది. పెళ్ళి తర్వాత గురు దత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల కోసం కొన్ని మధురమైన పాటలు పాడిన ఆమె, ఇతర దర్శకుల చిత్రాల్లోనూ పాడడాన్ని ఎప్పటిలాగే కొనసాగించారు.

గీత మరియు గురు దత్‌ దంపతులకు తరున్ (b. 1954), అరుణ్ (b. 1956), మరియు నినా (b. 1962) అని ముగ్గురు సంతానం.

1957లో "గౌరీ" పేరుతో గీత ప్రధాన పాత్రలో గురు దత్ ఒక చిత్రాన్ని ప్రారంభించారు. భారతదేశంలోనే మొట్టమొదటి సినిమాస్కోప్‌ చిత్రంగా అట్టహాసంగా ఈ చిత్ర ప్రారంబోత్సవం జరిగినప్పటికీ, కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. దీని తర్వాత ఆ దంపతుల వివాహ బంధం బీటలు వారడం ప్రారంభమైంది, ఈ సమయంలోనే వహీదా రెహ్మాన్‌తో గురు దత్ ప్రేమ కలాపాలు ప్రారంభ కావడం, గీత తాగుడుకు బానిస కావడం జరిగిపోయింది. గురు దత్‌తో ఏర్పడిన మనస్పర్థలతో గాయనిగా గీత జీవితం ఒడిదుడుకులకు లోనైంది.

1958లో, లతా మంగేష్కర్ స్వరంలో శ్రుతి లేదని భావించిన S.D. బర్మన్, తన సంగీతంలో ప్రధాన గాయనిగా గీతను ఎంచుకునేందుకే మక్కువ చూపారు. అప్పట్లో అప్పుడప్పుడే పరిశ్రమలో పైకి ఎదుగుతున్న ఆషా భోంస్లే గాత్రం సైతం సరిగా పరిణితి చెందలేదని ఆయన భావించేవారు. అయితే, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్న గీత, పాట పాడే విషయంలో సరిగా ఏకాగ్రత చూపలేక బర్మన్ కోరుకున్న ప్రమాణాలను అందుకోలేకపోయారు. (దీంతో ఆయన, మరియు O.P. నాయర్ సైతం, అప్పటినుంచి ఆషాతో పనిచేసేందుకు సిద్ధం కావడంతో గాయనిగా ఆమె కెరీర్ వృద్ధికి నోచుకుంది.)

మరోవైపు తాగుడు ఎక్కువ కావడం, మితిమీరిన పరిమాణంలో నిద్రమాత్రలు తీసుకోవడం లాంటి కారణాలతో 1964లో గురు దత్ కన్నుమూశారు. (గతంలో ఆయన రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేసి ఉండడంతో ఆయన మరణాన్ని చాలామంది ఆత్మహత్యగానే భావించారు[3].) గురు దత్ మరణం తర్వాత నరాలు చచ్చుబడిన పరిస్థితికి చేరుకున్న గీత, ఆర్థిక సమస్యలతోనూ సతమతమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ గాయనిగా కెరీర్‌ను చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన ఆమె, దుర్గా పూజతో ప్రారంభించి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతోపాటు బెంగాలీ చిత్రమైన భదు భరన్‌ (1967) లో ప్రధాన పాత్ర పోషించిన ఆమె, అనుభవ్ (1971) చిత్రం కోసం అద్భుతమైన పాట పాడారు, కనూ రాయ్ సంగీత సారథ్యంలో ఆమె పాడిన చివరి పాటగా ఇది నిల్చిపోయింది.

చివరకు ప్రాణాంతక కాలేయ వ్యాధి కారణంగా 1972 జూలై 20న గీత తుది శ్వాస విడిచారు.

ముఖ్యమైన పాటల యొక్క జాబితాసవరించు

ఆమె 1200 కు పైగా హిందీ చిత్రాల్లో పాడాల్సింది. దీనికి తోడు ఆమె ఇండియాలో మరాఠీ, బెంగాలి, నేపాలి, మైథిలి, భోజ్పురి మరియు పంజాబీతో సహా ఇంకా అనేక ప్రాంతీయ భాషల్లో పాడారు.[4].

S.D. బర్మన్ దర్శకత్వ ఆధ్వర్యంలో కొన్ని మరపురాని పాటలు[5]:

 • 'మేర సుందర్ సప్న బీట్ గయా' (దో భాయి - 1947 ) http://www.youtube.com/watch?v=nE7sM_79bp0&feature=search
 • 'వో సప్నేవాలి రాత్' (ప్యార్ - 1950 )
 • 'తద్బీర్ సే బిగ్ది హుయి తక్దీర్' (బాజి - 1951 )
 • 'ఆన్ మీలో ఆన్ మీలో' (దేవదాస్ - 1955 ) మన్న దేతో
 • 'ఆజ్ సాజన్ మోహి అంగ్ లగాలో' (ప్యాస - 1957 )
 • 'హమ్ ఆప్కే ఆన్ఖోన్ మెయిన్' (ప్యాస - 1957 )
 • 'హవా దిర్ ఆన' (సుజాత - 1959 )
 • 'వక్త్ నే కియా క్యా హసీన్ సితాం' (కాగజ్ కే ఫూల్ - 1959 )

O.P. నయ్యర్ దర్శకత్వ ఆధ్వర్యంలో కొన్ని మరపురాని పాటలు[6]:

 • 'జార సామనే ఆ' (బాజ్ - 1953 )
 • 'బాభుజి దీరే చల్న' (ఆర్ పార్ - 1954 )
 • 'తనది హవా కలి ఘట' (Mr. & Mrs.'55 - 1955 )
 • 'జానే కహన్ మేర జిగర్ గయా జి' (Mr. & Mrs. '55 - 1955 )
 • 'జబ బాదల్ లేహ్రయ' (చ్చూమంతర్ - 1956 )
 • 'మేరె జిందగీ కే హుమ్సఫర్' (శ్రీమతి 420 - 1956 )
 • 'జాత కహన్ హాయ్' (C.I.D. - 1956)
 • మొహమ్మేడ్ రఫీతో 'అయ్ దిల్ హైన్ ముష్కిల్' (ఆక 'బొంబాయి మేరి జాన్') (C.I.D. - 1956)
 • 'చోర్, లుటెరే డాకు ' ( ఉస్తాద్ - 1957 )
 • 'మేర నాం చిన్ చిన్ చూ' (హౌరా బ్రిడ్జ్ - 1958 )
 • 'కైసా జాదూ బాలం తునే దర' (12 o'క్లాక్ - 1958 )

హేమంత్ కుమార్ దర్శకత్వ ఆధ్వర్యంలో కొన్ని మరపురాని పాటలు[7]:

 • నా జావో సియాన్ చ్చుడ కే బైయాన్ (సాహిబ్ బిబి ఆర్ ఘులాం - 1962 )
 • తలత్ మెహమూద్ తో కైసే రోకోగే ఐసే తూఫాన్ కో (ఆనంద్మత్ - 1952 )
 • మద్భారి హైన్ ప్యార్ కి పాల్కేన్ (ఫ్యషన్ - 1957 )
 • నా ఏ చాంద్ హోగా (షార్ట్ - 1954)
 • పియ ఐసో జియా మెయిన్ సమయే గయో (సాహిబ్ బిబి ఆర్ ఘూలం - 1962 )
 • చలే ఆవ్ చలే ఆవ్ (సాహిబ్ బిబి ఆర్ ఘూలం - 1962 )

ఇతరులు

 • ముజ్హే జాన్ నా కహో మెర్ జాన్ (ఆనుభవ్ - 1971) సంగీతం : కను రాయ్

కొన్ని మరపురాని బెంగాలి పాటలు [8]:

 • 'షచిమత గో చార్ జుగే హాయ్' (1950)
 • 'ఎఖాన్-ఓ దుస్తర్ లజ్జ' (1952)
 • 'ఏసి సుందర్ స్వర్నాలి సంధ్యి' (హాస్పిటల్, 1960; సంగీతం: అమల్ ముఖేర్జీ)
 • 'కథ అచ్చే తుమి అజ్ అస్బే (కను ఘోష్ 1960)
 • 'అయి మయబి తిథి' (షోనార్ హరిన్, 1959; సంగీతం: హేమంత్ ముఖేర్జీ)
 • 'తుమి జే అమర్' [9] (హరనో సుర్, 1958; సంగీతం : హేమంత్ కుమార్)
 • 'నిషిరాట్ బంక చాంద్ ఆకాశే' (ప్రితిబి ఆమరే చాయ్, 1957; సంగీతం: నచికేత ఘోష్)
 • 'ఝనక్ ఝనక్ కనక్ కంకన్ బాజే'

సూచనలుసవరించు

 1. 'గీత దత్స్ కెరీర్ ఇన్ ది 40 స్
 2. http://www.geetadutt.com/impact.html
 3. 'గురు దత్ మూడు సార్లు ఆత్మ హత్యా కు ప్రయత్నించారు
 4. 'గీత దత్ వెబ్ సైట్ '
 5. 'గీత దత్ S.D. బర్మన్ తో తోడ్పాటు'
 6. "'గీత దత్ O.P. నాయ్యర్ తో తోడ్పాటు'". మూలం నుండి 2014-11-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-30. Cite web requires |website= (help)
 7. "'గీత దత్ హేమంత్ కుమార్ తో తోడ్పాటు'". మూలం నుండి 2015-08-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-30. Cite web requires |website= (help)
 8. "'గీత దత్ బెంగాలి చిత్ర జీవితం'". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-30. Cite web requires |website= (help)
 9. "Tumi Je Amar". YouTube.com. Retrieved 2008-03-29. Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గీతా_దత్&oldid=2801629" నుండి వెలికితీశారు