గురుదత్

భారతదేశ నటుడు, దర్శకుడు, నిర్మాత

గురుదత్ పడుకొనె ( జననం: జూలై 9, 1925 ), దక్షిణ భారతదేశంలోని మైసూర్లో జన్మించిన గొప్ప భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు.

బాల్యం, జీవిత చరిత్ర

మార్చు

తండ్రి ప్రధానోపాధ్యాయుడు, తల్లి వాసంతి ఉపాధ్యాయురాలు; ఆమె బెంగాలీ నవలలను కన్నడంలోకి అనువదిస్తూ ఉండేది. గురుదత్‌కు మంచి బెంగాలీ మాట్లాడడం వచ్చు. ఆయన 1940 లో ముంబాయికి చేరుకొని, బాలివుడ్లో ప్రవేశించాడు. ఆయన కోల్‌కతాలో కొన్నాళ్ళు విద్యాభ్యాసం చేసి, కొంతకాలం ప్రముఖ నాట్య కళాకారుడు, ఉదయ్‌ శంకర్‌ వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. తరువాత ప్రభాత్ స్టూడియోలో కొరియోగ్రాఫర్గా చేరాడు. హమ్ ఏక్ హై (1946, ఆర్ పార్ (1954) సినిమాలకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ తరువాత వచ్చిన ఆయన సినిమాలు: మిస్టర్ అండ్ మిసెస్ 55, ప్యాసా, కాగఝ్ కే ఫూల్. కాగఝ్ కే ఫూల్ బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవడంతో, విరక్తి చెంది, సినిమాలు తీయడం మానివేశాడు. కథారచయిత, అబ్రార్ అల్వి సాహిబ్ బీబీ ఔర్ గులాంకు గురుదత్ దర్శకత్వం వహించి, రాష్టపతి రజత పతకాన్ని, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్‌ను గెలుచుకున్నాడు. 1953 లో ప్లేబాక్ సింగర్ గీతారాయ్ను వివాహమాడాడు. కాని వారి దాంపత్యం అంత సజావుగా సాగలేదు. గురుదత్ సినిమా విషయంలో కఠినంగా ఉండేవాడు. అతిగా త్రాగేవాడు. నటి వహీదా రెహ్మాన్తో గల సంబంధం అతని కాపురంలో చిచ్చును రేపింది. ఇతడి భార్య గీతా దత్ కూడా భారతీయ నేపధ్య గాయని. గ్గురుదత్ మరణించినప్పుడు, భార్యతో కాక, ఒంటరిగానే ఉన్నాడు. అక్టోబరు 10, 1964 రోజు గురుదత్ తన మంచంలో చనిపోయి కనిపించాడు. మద్యం ఎక్కువైందో లేక నిద్రమాత్రలు అతిగా మింగాడో ఎవరికీ తెలియదు. గురుదత్ అప్పుడు రెండు సినిమాలలో పనిచేస్తున్నాడు; లవ్ అండ్ గాడ్, బహారే ఫిర్ భి ఆయేంగీ. తరువాత వాటిని సంజీవ్ కుమార్, ధర్మేంద్ర లతో పూర్తి చేయడం జరిగింది.

నటుడిగా

మార్చు
  • పిక్నిక్ (1964) (అసంపూర్ణం)
  • సాంఝ్ ఔర్ సవేరా (1964)
  • సుహాగన్ (1964)
  • బహూ రానీ (1963)
  • భరోసా (1963)
  • సౌతేలా భాయ్ (1962)
  • చౌధవీఁ కా చాంద్ (1960)
  • కాగజ్ కే ఫూల్ (1959)
  • 12 ఒ' క్లాక్ (1958)
  • ప్యాసా ( 1957)
  • మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955)
  • ఆర్ పార్ (1954)
  • సుహాగన్ (1954)
  • బాజ్ ( 1953)
  • హమ్ ఏక్ హై ( 1946)
  • లఖారాణి ( 1945)
  • చాంద్ (1944)

దర్శకుడిగా

మార్చు
  • కాగజ్ కే ఫూల్ (1959)
  • ప్యాసా ( 1957)
  • సైలాబ్ (1956)
  • మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955)
  • ఆర్ పార్ (1954)
  • బాజ్ ( 1953)
  • జాల్ (1952)
  • బాజీ (1951)

నిర్మాతగా

మార్చు
  • ఆర్ పార్ (1954)
  • సి.ఐ.డి. (1956)
  • కాగజ్ కే ఫూల్ (1959)
  • చౌధవీఁ కా చాంద్ (1960)
  • బహారేఁ ఫిర్ భి ఆయేంగీ (1966)

1. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా పుణె గురుదత్, భారత ప్రభుత్వ జాతీయ సినిమా భాండాగారము.

వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు
  • [5] గురుదత్ గురించి దేవానంద్
  • [6][permanent dead link] గురుదత్‌తో నా పదేళ్ళ అనుభవాలు- అబ్రార్ అల్వి
  • [7] గురుదత్ ఇంటర్నెట్ డాటా బేస్
  • [8] దేవానంద్‌తో ఇంటర్‌వ్యూ-2
  • [9] గురుదత్‌ సినిమాలలోని పాటలు
"https://te.wikipedia.org/w/index.php?title=గురుదత్&oldid=4320257" నుండి వెలికితీశారు