గుంటూరు మిరపకాయ
గుంటూరు మిరపకాయలు
గుంటూరు మిరపకాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా లో పండుస్తున్న మిరపకాయలు. ఈ మిరపకాయలు ప్రపంచవ్యాప్తంగా ఆసియా, కెనడా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గుంటూరు జిల్లా అనెక మిరపకాయలకు, మిరపకాయ పొడికి ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్పత్తులు శ్రీలంక, బంగ్లాదేశ్, మధ్యతూర్పు, దక్షిణ కొరియా, యు.కె, యుఎస్ & లాటిన్ అమెరికాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ మిరపకాయలు వివిధ రంగులు, వివిధ రకాల రుచులను దానిలో ఉన్నా కాప్సికం పరిమానాన్ని బట్టి కలిగి పుంటాయి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల వంటలలో ఈ గుంటూరు మిరప కాయలను ఉపయోగిస్తారు.
గుంటూరు మిరపకాయ | |
---|---|
జాతి | కాప్సికం చైనిస్ |
వృక్ష రకం | 'హాబనెరో' |
కారం (హీట్) | ఎక్కువ కారం |
స్కోవిల్లె స్కేల్ | 30,000-350,000 SHU |
గుంటూరు మిరప వ్యవసాయదారులు
మార్చు- వండర్ హాట్ చిల్లీ అనునది అతికారంగా ఉన్న మిరపకాయ.
- 334 చిల్లీ అనునది ఎగుమతి చేయవలసిన రకం.[1]
- గుంటూరు సన్న మిరపకాయ - S4 రకం అనునది ప్రఖ్యాతి చెందిన మిరప రకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన డిమాండ్ ఉన్నది. దీనిని గుంటూరు, వరంగల్, ఖమ్మం జిల్లాలలో పండిస్తారు. ఈ మిరపకాయ తొక్క దళసరిగానూ, ఎరుపుగానూ, కారంగానూ ఉంటుంది. ఈ పంట పండించే కాలం డిసెంబరు నుండి మే నలవరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పంట సుమారు 280,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. దీని అస్తా రంగు విలువ 32.11, కాప్సైచిన్ విలువ 0.226% ఉంటుంది.
- 273 చిల్లీ అనునది సాధారణ ముడుతలు గల చిల్లీ.
ఇతర గుంటూరు మిరపకాయలలో పత్కి, ఇండో-5, అంకుర్, రోష్ని, బెడ్కి, మధుబాల కూడా ఉన్నాయి. పత్కి, తేజ రకాలను రుచి కొరకు, వంటల రంగుల కొరకు వాడుతారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Fresh crop seen boosting Guntur chili mandi volumes
- ↑ Fresh arrivals fail to pull down chili prices
- ↑ "Finer grade of Teja variety fetches Rs. 9,700 per quintal". Archived from the original on 2012-11-05. Retrieved 2016-01-24.