కాచిగూడ - గుంతకల్లు ప్యాసింజర్
కాచిగూడ - గుంతకల్లు ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు.[1] ఇది కాచిగూడ రైల్వే స్టేషను , గుంతకల్లు రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]
జోను , డివిజను
మార్చుఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 57425, తరచుదనం (ఫ్రీక్వెన్సీ) : ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.
సవరించిన సమయములు
మార్చురైలు నెంబర్ 57425 కాచిగూడ - గుంతకల్లు ప్యాసింజర్ యొక్క సవరించిన సమయములు (టైమింగ్స్) కార్యాచరణ కారణాల కారణంగా 2016 జనవరి 24 నుంచి అమల్లోకి ఉంటాయి. దీని ప్రకారం, రైలు నెంబరు 57425 కాచిగూడ - గుంతకల్లు ప్యాసింజర్ 10:00 గంటలకు బదులుగా 09:40 గంటలు కాచిగూడ నుండి బయలుదేరుతూ కనిపిస్తుంది. అలాగే 09:43 గంటలకు మలక్‌పేట, 09:46 గంటలకు దబీర్‌పుర, 09:51 గంటలకు యాకుత్పురా, 09:55 గంటలకు ఉప్పుగుడా, 10:01 గంటలకు ఫలక్‌నుమా, 10:10 గంటలకు బద్వేల్, 10:20 గంటలకు ఉందానగర్, 10:37 గంటలకు తిమ్మాపూర్, 10:43 గంటలకు కట్టూర్, 10:47 గంటలకు హాల్బర్గా, 10:55 గంటలకు షాద్‌నగర్ , 11:20 గంటలకు బాలానగర్ చేరుకుంటుంది. గొల్లపల్లి స్టేషన్ రైలు దాటిన తదుపరి రైలు సమయాలను ఎటువంటి మార్పు లేదు , అదే రోజున 19:30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది.[3]